Temple Rules: మాంసాహారం తిన్న తర్వాత గుడికి ఎందుకు వెళ్లకూడదో తెలుసా..?
Temple Rules: దేవాలయానికి వెళ్లడానికి సనాతన ధర్మంలో ఎన్నో నియమాలు, ఆచారాలున్నాయి. మాంసాహారం తిన్న తర్వాత గుడికి వెళ్లకూడదని మీరు విని ఉంటారు. గుడికి వెళ్లేముందు మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..?
![Temple Rules: మాంసాహారం తిన్న తర్వాత గుడికి ఎందుకు వెళ్లకూడదో తెలుసా..? Temple Rules: know why we should not visit temple after eating non veg Temple Rules: మాంసాహారం తిన్న తర్వాత గుడికి ఎందుకు వెళ్లకూడదో తెలుసా..?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/07/878c0b2c1f0950790a98ca227db2b7311688735215016691_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Temple Rules: సాధారణంగా మనం మన హిందూ ధర్మంలో సూచించిన నియమాలను, ఆచారాలను పాటిస్తాము. మాంసాహారం తిన్న తర్వాత గుడికి వెళ్లకూడదని హిందువులు తప్పనిసరిగా అనుసరించే సంప్రదాయంలో ఒకటి. ఇదే మన పెద్దలు, శాస్త్రాలు, ధర్మాలు, గ్రంధాలు కూడా చెబుతున్నాయి. మరి మాంసాహారం తిని దేవాలయాలకు ఎందుకు వెళ్లకూడదు..? మాంసాహారం తిన్న తర్వాత దేవాలయాలకు వెళితే ఏమవుతుంది?
Also Read : రోజూ గుడికి వెళితే మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే - మీరు అస్సలు ఊహించలేరు
1. గుడికి వెళ్లే ముందు మాంసాహారం ఎందుకు తినకూడదు
ఆలయాలకు పరిశుభ్రంగా, ప్రశాంతంగా వెళ్లే సంప్రదాయం ఉంది. గుడికి వెళ్లేటప్పుడు సాధారణంగా తలస్నానం చేసి లేదా పుణ్యనదులలో స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరిస్తాం. కొందరు ఖాళీ కడుపుతో అంటే ఏమీ తినకుండా గుడికి వెళ్తే, మరికొందరు సాత్విక ఆహారం తీసుకున్న తర్వాతే గుడికి వెళతారు. అయితే మాంసాహారం తిన్న తర్వాత గుడికి వెళ్లడం తప్పు చేసినట్టు పరిగణిస్తారు. దీనికి కారణం ఏంటి..?
ఉదాహరణకు మధ్యాహ్నం పెరుగు తింటే మంచి నిద్ర పడుతుంది. కొంత సేపు హాయిగా ఎక్కడైనా పడుకోవాలని అనిపిస్తుంది. కాబట్టి మీరు మాంసాహారం తిన్నప్పుడు మీ శరీరం, మనస్సు కొద్దిగా అలసిపోయినట్లుగా, మందగించినట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఆలయానికి వెళితే అక్కడి సానుకూల ప్రకంపనలను అనుభవించడానికి మీ మనస్సు, శరీరం అంగీకరించవు. మాంసాహారంలో తామసిక గుణాలు ఎక్కువగా ఉన్నందున, మీ మనస్సు మంచి ఆలోచనలు, ప్రకంపనలను అనుభవించడానికి అనుమతించదు.
2. వీటిని తిని గుడికి వెళ్లకండి
మాంసాహార భోజనంలో కొవ్వు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జీవక్రియను, శారీరక అవసరాలను పెంచుతాయి. అయితే మీ అంతర్గత ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. మతపరమైన ఆచారాల్లో అంతర్గత ప్రశాంతతకు, ఏకాగ్రతకు గొప్ప ప్రాముఖ్యం ఇచ్చారు. శాఖాహార భోజనంలో కూడా ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఇతర కూరలు, పలు రకాల మసాలాలు వంటి మసాలా దినుసులకు దూరంగా ఉండాలి.
Also Read : గుడి నుంచి బయటకు వచ్చే ముందు గంట ఎందుకు కొట్టాలి
మన పూర్వీకులు వివిధ శాస్త్రీయ కారణాల ఆధారంగా ప్రతి ఆచారాన్ని లేదా నియమాన్ని అనుసరించారు. వారు పాటించే నియమాలు ఖచ్చితంగా మన తరాలకు మెరుగైన జీవితానికి దారి చూపుతాయి. ఇలాంటి అద్భుతమైన ఆచారాలను, ఆలోచనలను మనకు అందించిన మన పూర్వీకుల గురించి మనం గర్వపడాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)