అన్వేషించండి

వరలక్ష్మీ వ్రతకల్పం: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ పూజ సంపూర్ణ విధానం, మంత్రాలు, సామగ్రి వివరాలు

Sri Varalakshmi Pooja Vidhanam Telugu: శ్రావణమాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సులువుగా చేసుకునేందుకు వీలుగా అవసమైన సామగ్రి, చదవాల్సిన మంత్రాలు ఇక్కడున్నాయి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శ్రావణ వరలక్ష్మీ వ్రతానికి పూజా సామగ్రి సిద్ధం చేసుకోవాలి.
  • వినాయకుడి పూజ చేసి, కలశ స్థాపనతో పూజ ప్రారంభించాలి.
  • షోడశోపచార పూజలతో అమ్మవారిని పూజించి, నైవేద్యం సమర్పించాలి.
  • తోరం కట్టుకుని, వరలక్ష్మీ వ్రతకథ చదివి ముగించాలి.

Sri Varalakshmi Pooja Vidhanam:  శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ పూజా విధానం, పూజా సామగ్రి!

వరలక్ష్మీ వ్రతం పూజా సామగ్రి
పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరొత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశంపై వస్త్రం, అమ్మవారి ప్రతిమ లేదా విగ్రహము

పంచామృతములు: ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార

తోరం: తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగతావి ముత్తయిదువలకు.

పసుపుతో వినాయకుడిని చేసి పీటపై కొద్దిగా బియ్యంపోసి తమలపాకు వేసి పూజకు సిద్ధం చేసుకోవాలి. గణేషుడి పూజ తర్వాత మరోసారి ఆచమనీయం చేసి సంకల్పం చెప్పుకుని వరలక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి. ( పసుపు గణపతి పూజ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
 
పూజావిధానం 

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!

దీపం వెలిగించాలి.
ఆచమ్య: కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోరాయనమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః..

శ్లో!! ఉత్తిష్ఠిన్తు భూతపిశాచాః యేతేభూమి భారకాః!
ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే!!

(అని అక్షతలు వాసన చూచి ఎడమవైపు వేయాలి)
మమ ఉపాత్త దురితయక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరీ ముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగాగోదావర్యోర్మధ్య ప్రదేశే...సమస దేవతా బ్రాహ్మణ హరిహ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన .... సంవత్సరే .. ఆయనే... ఋతౌ.. మాసే.. పక్షే.. తిథౌ.. వాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిధ్యార్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్ధం, సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ ప్రీత్యర్థం యావచ్ఛక్తి, ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే! తదంగత్వేన కలశపూజాం కరిష్యే!

అని సంకల్పం చెప్పుకుని కలశానికి గంధం ,అక్షతలు పెట్టి, పూలు వేసి.. చేతితో కలశమును మూసి ఈ క్రింది శ్లోకం చదవాలి.

కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాః స్మృతాః!!
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా!
ఋగ్వేదోధయజుర్వేదః, సామవేదోహ్యధర్వణః!
అజ్గైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః!
ఆయాంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః
గంగేచ, యమునేచైవ గోదావరి సరస్వతీ!
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు!!
కలశోదకేన దేవమాత్మానాం, పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య!!

(కలశంలో  నీటిని పువ్వుతో దేవునిపైన, మీపై, పూజాద్రవ్యములపైన చల్లాలి)

కళ్యాణీ కమలనిలయే కామితార్థ ప్రదాయినీ!
యావత్త్వాం పూజయిష్యామి శుభదే సుస్థిరోభవ!!

అమ్మవారిపై పూలు ఉంచండి..

ధ్యానమ్:

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరో భవమే గేహే సురాసుర నమస్కృతే
లక్ష్మీంక్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వామ్ త్రైలోక్య కుటుంబినీం సరసిజామ్ వందే ముకుంద ప్రియామ్
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ధ్యాయామి

ఆవాహనం:

సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే
ఆవాహయామి దేవీత్వామ్ సుప్రీతా భవసర్వదా
శ్రీ వరలక్ష్మీ  దేవతాయై నమః, ఆవాహయామి

ఆసనమ్:

సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే
సింహాసనమిదం దేవీ గృహ్యతాం సురపూజితే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, రత్నఖచిత సింహాసనం సమర్పయామి

పాద్యమ్:

సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవమ్
పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పాదయోః పాద్యం సమర్పయామి

అర్ఘ్యమ్:

శుద్ధోదకమ్ చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితమ్
అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,హస్తయోః అర్ఘ్యం సమర్పయామి

ఆచమనీయం:

సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతమ్
గృహానాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ముఖే ఆచమనీయం సమర్పయామి

పంచామృత స్నానం:

పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతమ్
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పంచామృతస్నానంసమర్పయామి

శుద్ధోదక స్నానం:

గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితమ్
శుద్ధోదక స్నానమిదం గృహాన హరివల్లభే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, శుద్ధోదక స్నానం సమర్పయామి

వస్త్రం:

సురార్చితాంఘ్రి యుగళేదుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన భువనేశ్వరీ
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, వస్త్రయుగ్మం సమర్పయామి

యజ్ఞోపవీతం:

తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితమ్
ఉపవీతమిదం దేవీ గృహాణ త్వం శుభంకరీ
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, యజ్ఞోపవీతం సమర్పయామి

గంధం:

కర్పూరాగరు కస్తూరీ రోచనాదిభిరన్వితమ్
గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, గంధం విలేపయామి

అక్షతలు:

అక్షతాన్ ధవళాన్ దేవీ శాలీయాన్ తండులాన్ శుభాన్
హరిద్రాకుంకుమోపేతం గృహ్యతామబ్ధిపుత్రికే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అక్షతాన్ సమర్పయామి

ఆభరణం:

కేయూర కంకణే దివ్యే హారనూపుర మేఖలాః
విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ఆభరణాని సమర్పయామి

పుష్పం:

మల్లికాజాజి కుసుమైః చంపకైర్వకుళైస్తథా
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పుష్పైః పూజయామి

అథాంగపూజా!
ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి
ఓం చపలాయై నమః జానునీ పూజయామి
ఓం పీతాంబదధరాయై నమః ఊరుం పూజయామి
ఓం కమలవసిన్యై నమః కటిం పూజయామి
ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి
ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి
ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి
ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి
ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి
ఓం సుముఖ్యై నమః ముఖం పూజయామి
ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి
ఓం సునేత్రే నమః నేత్రం పూజయామి
ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి
ఓం కమలాయై నమః శిరః పూజయామి
ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి
శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే
అని సంకల్పము చేసి అష్టోత్తర నామపూజ పసుపు కుంకుమలతో గాని, పుష్పములతో గానీ చేయవలెను.

శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః చదువుకోవాలి... ఈ లింక్ క్లిక్ చేయండి

శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి అని చెప్పుకున్నాక...ధూపం...

దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరమ్
ధూపం దాస్యామి దేవేశీ గృహ్యతాం పుణ్యగంధినీ
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి

ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకమ్
దీపం దాస్యామి తేదేవీ గృహాణ ముదితోభవ
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి ..
దీపం చూపించి నమస్కరించాలి

నైవేద్యం షడ్రసోపేతం దధిమద్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, నైవేద్యం సమర్పయామి

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్
కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, తాంబూలం సమర్పయామి
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితమ్
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అనందమంగళ నీరాజనం సందర్శయామి

నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,మంత్రపుష్పాణి సమర్పయామి
పుష్పము అక్షతలు ఉంచాలి

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ!
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ప్రదక్షిణం సమర్పయామి
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ
త్రాహిమాం కృపయాదేవీ శరణాగత వత్సలే!!
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్ మమ!
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దనీ!!
నమస్త్రైలోక్య జననీ నమస్తే విష్ణు వల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమోనమః!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, నమస్కారాన్ సమర్పయామి

తోరగ్రంథి పూజా!

ఓం కమలాయై నమః - ప్రథమ గ్రంథిం పూజయామి
రమాయై నమః - ద్వితీయ గ్రంథిం పూజయామి
లోకమాత్రే నమః - తృతీయ గ్రంథిం పూజయామి
విశ్వజనన్యై నమః - చతుర్థ గ్రంథిం పూజయామి
వరలక్ష్మీ నమః - పంచమ గ్రంథిం పూజయామి
క్షీరాబ్ధి తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి
విశ్వసాక్షిణ్యై నమః - సప్తమ గ్రంథిం పూజయామి
చంద్ర సహోదర్యై నమః - అష్టమగ్రంథిం పూజయామి
వరలక్ష్మ్యై నమః - నవమ గ్రంథిం పూజయామి

ఈ క్రింది శ్లోకము చదువుతూ తోరం కట్టుకొనవలెను.

శ్లో!! బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే

తోరం కట్టుకున్న తర్వాత అక్షతలు చేతిలోకి తీసుకుని కథ చదువుకోవాలి... వరలక్షీ వ్రత కథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Frequently Asked Questions

వరలక్ష్మీ పూజకు కావలసిన ముఖ్యమైన సామగ్రి ఏమిటి?

పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరొత్తులు, కొబ్బరికాయలు, కలశము, అమ్మవారి ప్రతిమ వంటివి కావాలి. పంచామృతాలు, తొమ్మిది ముడుల తోరం కూడా అవసరం.

పంచామృతాలలో ఏ పదార్థాలు ఉంటాయి?

పంచామృతాలలో ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార ఉంటాయి. ఇవి పూజలో అమ్మవారికి సమర్పించబడతాయి.

వరలక్ష్మీ వ్రతంలో తోరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి?

తోరాన్ని తయారు చేయడానికి, దారానికి పసుపు రాసి, ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయాలి. తొమ్మిది ముడులు వేసిన తోరం కావాలి.

వరలక్ష్మీ పూజను ఎలా ప్రారంభించాలి?

మొదట పసుపుతో వినాయకుడిని చేసి పూజించాలి. గణేషుడి పూజ తర్వాత ఆచమనీయం చేసి సంకల్పం చెప్పుకుని వరలక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

వరలక్ష్మీ వ్రతకల్పం: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ పూజ సంపూర్ణ విధానం, మంత్రాలు, సామగ్రి వివరాలు
వరలక్ష్మీ వ్రతకల్పం: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ పూజ సంపూర్ణ విధానం, మంత్రాలు, సామగ్రి వివరాలు
వరలక్ష్మీ వ్రత కథ: షోడసోపచార పూజ పూర్తిచేసి ఈ కథ చదువుకుని వాయనం ఇవ్వాలి!
వరలక్ష్మీ వ్రత కథ: షోడసోపచార పూజ పూర్తిచేసి ఈ కథ చదువుకుని వాయనం ఇవ్వాలి!
ప్రతి శుక్రవారం, శ్రావణ శుక్రవారం పూజలో చదువుకోవాల్సిన లక్ష్మీదేవి 108 నామాలతో అష్టైశ్వర్యాలు!
ప్రతి శుక్రవారం, శ్రావణ శుక్రవారం పూజలో చదువుకోవాల్సిన లక్ష్మీదేవి 108 నామాలతో అష్టైశ్వర్యాలు!
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget