Spirituality : గోమాతతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారు, లేకపోతే ఏమవుతుంది..
గృహప్రవేశం సమయంలో గోమాతని ఎందుకు తీసుకొస్తారు, ఇల్లంతా ఎందుకు తిప్పుతారు, కొత్తింట్లో అడుగుపెట్టే సమయంలో గోమాత లేకపోతే ఏమవుతుంది...
సొంతిల్లు ప్రతిఒక్కరి కల. ఎప్పుడో అప్పుడు ఆ కల నెరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడతారు. ఎట్టకేలకు తమకంటూ ఓ గూడు సమకూర్చుకున్న వేళ ఆ ఆనందానికి అవధులుండవు. బంధువులు, స్నేహితులు అందర్నీ పిలిచి పూజలు, హోమాలు, జపాలతో సందడే సందడి. అయితే గృహప్రవేశం సమయంలో కొత్తింట్లోకి ముందుగా గోమాతని తీసుకెళతారు. ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ ఇంటి యజమాని తన ధర్మపత్నితో సహా దేవుడి ఫొటో పట్టుకుని లోపలకు అడుగుపెడతాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా లోపలకు వెళతారు. పూర్వీకుల నుంచి ఇదే ఆచారం కొనసాగుతోంది. ఇంతకీ గృహప్రవేశానికి గోమాతకి సంబంధం ఏంటంటారా...గోమాతని సకలదేవతా స్వరూపంగా భావిస్తారు. అందుకే ముందుగా గోవులను కొత్తింట్లోకి తీసుకెళ్లడం ద్వారా సకలదేవతలూ ఈ ఇంట్లో అడుగుపెట్టినట్టే అని విశ్వసిస్తారు. నూతన గృహంలో మూత్రం, పేడ వేసినట్టైతే మరింత శుభకరంగా భావిస్తారు.
Also Read: ఈ టైప్ లాఫింగ్ బుద్ధ మీ ఇంట్లో ఉంటే.. అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందట
అప్పట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు కానీ... అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఈ ఆచారం పేరుతో ఆవులను ఇబ్బంది పెడుతున్నారనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. మెట్లు ఎక్కించి , హింసించి మరీ తమ కొత్తింట్లో అడుగుపెట్టిస్తున్నారు. కానీ దీనికి కూడా ఓ ప్రత్యామ్నాయం ఉందంటున్నారు పండితులు. బహుళ అంతస్తులున్న భవనాల్లోకి ఆవును తీసుకు రావడం కుదరదు కదా.. సెంటిమెంట్ ని ఫుల్ ఫిల్ చేసుకోవడం ఎలా అనేవారికోసం ఓ సలహా చెబుతున్నారు పండితులు. బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేసే వాళ్లు ... ఆ భవనం ప్రాంగణంలో ఆవు దూడలను అలంకరించి పూజించాలి. ఆవుదూడలకు అవసరమైన ఆహారాన్ని సమర్పించడంతో పాటూ వాటి యజమానులను దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. అనంతరం గోవు మూత్రాన్ని, పేడను తీసుకెళ్లి తమ నివాస స్థలాన్ని శుద్ధి చేస్తే సకలదేవతలు వచ్చినట్టే అని చెబుతారు. అంతేకానీ సెంటిమెంట్ పేరుతో గోమాతను బహుళ అంతస్థుల భవనాలు ఎక్కించి ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు. ఇది కేవలం అపార్ట్స్ మెంట్స్ వారికి మాత్రమే.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
శాస్త్రీయంగా చెప్పాలంటే ఆవు మూత్రం, పేడా రెండూ కొత్తింట్లో క్రిములూ, ఇన్ఫెక్షన్లూ, దోమల్నీ దూరం చేస్తాయి. అలానే పేడా, మూత్రం, నెయ్యీ, పెరుగూ, పాలూ… అన్నింటినీ కలిపి పంచగవ్య అంటారు. వీటిని హోమంలో వేసినప్పుడు వెలువడిన పొగ కూడా క్రిమి కీటకాల్ని బయటకు పంపుతుంది. వాతావరణంలోని వ్యర్థాలను పారదోలుతుంది. అందుకే గృహప్రవేశం సమయంలో ఆవుకి అంత ప్రాధాన్యతనిస్తారు.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి