అన్వేషించండి
Advertisement
Spirituality: లాకర్ లో ఇవి ఉంచితే డబ్బే డబ్బు, లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుంది!
Spirituality: లాకర్ ను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఇక్కడే ఇంటి సంపద దాగి ఉంటుంది. కాబట్టి ఇంటి లాకర్ సంబంధించిన కొన్ని నియమాలను తెలుసుకుందాం.
ఇంట్లో డబ్బు దాచుకునే లాకర్ ను లక్ష్మీ స్థానంగా భావిస్తారు. ఇక్కడే విలువైన వస్తువులు, డబ్బు దాచి ఉంచుతాం. అయితే లాకర్ ను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఇక్కడే ఇంటి సంపద దాగి ఉంటుంది కాబట్టి ఇంటి లాకర్ సంబంధించిన కొన్ని నియమాలను తెలుసుకుందాం.
- తమల పాకును పవిత్రమైనదిగా భావిస్తాము. అందుకే పూజలో ఉపయోగిస్తాం. ఇది గౌరీ – గణేశుని స్వరూపం. పూజలో ఉపయోగించిన తమలపాకును లాకర్ లో ఉంచాలి. జ్ఞానానికి అధిపతి అయిన గణేష్ ఎక్కడ ఉంటే లక్ష్మీ అక్కడే ఉంటుంది. లక్ష్మీ పూజలో తమల పాకు ఉంచి తమలపాకు పై ఎర్రని దారాన్ని, అక్షత, కుంకుమ, పుష్పం, ఇతర పూజా ద్రవ్యాలతో చుట్టి పూజ తర్వాత ఈ తమలపాకును లాకర్ లో ఉంచాలి.
- శుక్రవారం నాడు వెండి నాణేలను పసుపు గుడ్డలో ఉంచి, కొద్దిగా కుంకుమ కూడా కట్టి వాటిని లాకర్ లేదా డబ్బు ఉంచే స్థానంలో ఉంచాలి. వీటితో పాటు కొద్దిగా పసుపు ముద్దగా చేసి ఉంచాలి.
- పది రూపాయ నోట్ల కట్ట ఒకటి, రాగి నాణేలు ఎప్పుడూ లాకర్ లో ఉంచాలి. లేదా వెండి నాణేలు ఉంచాలి.
- రావి ఆకు మీద ఆవు నెయ్యి కలిపిన సింధూరం ఉంచి దాన్ని పూజలో పెట్టి 5 శనివారాలు ఒక్కోటి చొప్పున లాకర్ లో లేదా డబ్బు దాచుకునే స్థలంలో ఉంచాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.
- పుష్యమీ నక్షత్రం ఉన్న రోజున సాయంత్రం పూట లక్ష్మీ పూజ చేసి కుంకుమ పువ్వు, పసుపు, వెండి నాణేలు పూజలో ఉంచి వాటిని లాకర్ లో ఉంచితే లాకర్ ఎప్పుడూ సమృద్ధిగా ఉంటుంది.
- మంత్ర, తంత్రాలలో ఆగ్నేయ శంఖానికి చాలా ప్రాధాన్యత ఉంది. దీనిని పూజా స్థలంలో లేదా లాకర్ లో ఉంచితే ఇది లక్ష్మీదేవిని ఆకర్షించి దరిద్రుడిని కూడా రాజుగా మారుస్తుంది.
- బెహరా ఆకులు, వేళ్లను పుష్యమి రోజు పూజించి ఎర్రటి గుడ్డలో కట్టి లాకర్ లో ఉంచాలి. ఇది ఇంటిలో సంపదను పెంచుతుంది.
- పుష్య నక్షత్రం రోజున శంఖ పుష్పి వేరును తీసుకుని దానిని దేవతా ప్రతిమలా పూజించి ఆతర్వాత ఒక వెండి పెట్టెలో, డబ్బు దాచుకునే చోట, లాకర్లో, వ్యాపార స్థలాల్లో పెడితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ప్రతి పష్యమి నక్షత్రం రోజున ఈ వేరును మారుస్తూ ఉండాలి.
- ఇంట్లో ఐశ్వర్య విజ్ఞాన యంత్రాన్ని లేదా దండ యంత్రాన్ని ప్రతిష్టించుకోవాలి. ఈ రెండింటిలో ఒక దానిని పూజించి లాకర్ లో ఉంచాలి. ఫలితంగా లాకర్ ఎప్పుడూ నిండుగా ఉంటుంది. డబ్బు పెరుగుతూనే ఉంటుంది.
- సంపద వృద్ధికి లాకర్ లో పవిత్రమైన కాళీ గుంజల గింజలను 11 ఉంచాలి. లాకర్ లో ఎప్పుడూ ఒక ఎర్రని వస్త్రాన్ని ఉంచాలి. వ్యాపార స్థలంలో లేదా లాకర్ లక్ష్మీ గణపతి బొమ్మ పెట్టుకోవాలి.
- ముత్యపు చిప్ప, వెండి నాణెం ఎర్రటి గుడ్డలో మూట కట్టి లాకర్ లో ఉంచితే వ్యాపారంలో లాభం వస్తుంది.
- వ్యాపారంలో ఆశించిన లాభాలు లేకపోతే ఏదైనా శనివారం 21 రక్త గుంజలను నీలి రంగు గుడ్డలో కట్టి లాకర్ లో ఉంచాలి. ప్రతి రోజు మీ ఇంటి ఇలవేల్సును ధ్యానిస్తూ ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. ఇలా క్రమం తప్పకుండా చెయ్యడం వల్ల వ్యాపారంలో లాభాలతో పాటు విజయం కూడా పొందుతారు .
- ఒక శుభ ముహూర్తంలో శ్రీఫలాన్ని ఎర్రని వస్త్రంలో ఉంచి దానిపై కమియా సింధూరం, దేశ వాళీ కర్పూరం, లవంగాలు వేసి, ధూపం ఇచ్చి, కొంత దక్షిణ సమర్పించి లాకర్ లో ఉంచాలి. దీనితో సంపద వృద్ధి అవుతుంది. కొబ్బరికాయను ఎర్రని వస్త్రంలో చుట్టి డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచితే వెంటనే డబ్బు వస్తుంది.
Also Read: నెమలికి - గ్రహదోషాలకు ఏంటి సంబంధం, ఆకస్మికంగా నెమలి ఎదురైనా, కలలో కనిపించినా ఏమవుతుంది!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement