అన్వేషించండి

Astrology Tips: నెమలికి - గ్రహదోషాలకు ఏంటి సంబంధం, ఆకస్మికంగా నెమలి ఎదురైనా, కలలో కనిపించినా ఏమవుతుంది!

Astrology Tips: మీరు శకునాలను నమ్ముతారా...కలలు వాటి ఫలితాలు గురించి ఆరా తీస్తుంటారా.. ఇంట్లో కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతారా.. అయితే నెమలి గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయ్...

Astrology Tips:  భారతదేశంలో నెమలికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఆధ్యాత్మిక పరంగానూ మయూరానికి ప్రాముఖ్యత ఉంది..ఎందుకంటే నెమలి కార్తికేయుడి వాహనం. అయితే నెమలి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అవి అకస్మాత్తుగా కనిపిస్తే శుభప్రదంగా భావిస్తారు. 

తెల్లవారుజామున అకస్మాత్తుగా కనిపిస్తే
తెల్లవారుజామున అకస్మాత్తుగా నెమలి మీ ఇంటికి వస్తే అదృష్టం మీ వెంటే ఉన్నట్టు. దీనితో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అదృష్టం పెరుగుతుంది. ఇంట్లో కొన్ని శుభ కార్యాలు జరుగుతున్నాయనేందుకు ఇది సూచనగా చెబుతారు

బయటకు వెళ్లేటప్పుడు నెమలి కనిపిస్తే
ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో అకస్మాత్తుగా నెమలి కనిపించిందంటే.. మీకు రోజు ఆరంభం అదిరిందని అర్థం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఉదయాన్నే నెమలి గొంతు వినడం లేదా నెమలి ఈకలను చూడటం కూడా శుభప్రదమే.

ఎగిరే నెమలి కనిపిస్తే
ఎగిరే నెమలిని చూడటం అరుదు. అలాంటి దృశ్యం చూసిన వారి సంఖ్య చాలా తక్కువ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి దృశ్యాలను చూసినవారికి మంచి ఫలితాలు వస్తాయి. అన్నింటా విజయం మీదే..

Also Read: ధంతేరాస్ రోజు బంగారం, వెండి మాత్రమే కాదు ఈ వస్తువులు కొన్నా మంచిదే!

వాస్తు ప్రకారం నెమలి

  • బెడ్‌రూమ్‌లో నెమలి పింఛాన్ని కంటికి కనిపించేటట్టుగా పెట్టి తెల్లవారు జామున లేవగానే దానిని చూడటం వల్ల రాహుగ్రహ దోషాల నుంచి నివారణ కలుగుతుంది
  • నెమలి  పించంతో తయారైన చిత్ర పటాలను పడకగదిలో ఉంచడం ద్వారా శుభఫలితాలుంటాయి
  • నెమలి శరీరం నుంచి నేలరాలే నెమలి  పించాలను తీసుకొచ్చి ఇంట్లోని పూజగదిలో ఉంచితే వాస్తుదోషాలు తొలగిపోతాయి
  • ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెమలి పించం పెడితే ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గిపోతుంది
  • నెమలి పించంతో పాటూ పూజగదిలో వినాయకుడికి ప్రీతికరమైన గరిక, విష్ణుమూర్తికి ఇష్టమైన తులసీ దళాలను వుంచడం ద్వారా వాస్తు దోషాలను తొలగించుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read: రాశిమారుతున్న కుజుడు ఈ ఆరు రాశులవారికి అన్నీ శుభఫలితాలే!

కలలో నెమలి కనిపిస్తే

  • మీ కలలో నెమలి కనిపిస్తే, అది ఖచ్చితంగా శుభసూచకమే. శాస్త్రాల ప్రకారం కలలో నెమలిని చూడటం శుభప్రదంగా భావిస్తారు.
  • కలలో పాము -నెమలి పోట్లాటను చూస్తున్నట్లయితే అలాంటి కలలు మీకు మంచి సంకేతం. అంటే ఇకపై మీకు శత్రువులు తగ్గుతారు, వారు మీపై పన్నిన కుట్ర విఫలమవుతుంది.
  • కలలో శనిదేవుడు నెమలితో కనిపిస్తే అలాంటి కల రావడం అరుదే కానీ వస్తేమాత్రం అధ్భుతమే అంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. శని చాలీసా ప్రకారం అలాంటి కలలు వస్తే మీరు డబ్బు పొందుతారు. ఆర్థిక పురోగతికి కూడా అనేక అవకాశాలు ఉంటాయి.
  • తెల్లని నెమలి కలలో కనిపిస్తే ధనవంతులవుతారట. త్వరలోనే డబ్బు బాగా సంపాదించే అవకాశాలున్నాయని అర్థం
  • కలలో నెమలి పించం కలిసి కనిపిస్తే అది ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలను సక్సెస్ చేస్తుంది. వివాహితులకు కనిపిస్తే మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఉందని, ప్రేమ ఇంకా పెరుగుతుందని అర్థం
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget