మీ ఇంట్లో ఇవన్నీ వాస్తు ప్రకారమే పెట్టారా ఓ సారి చెక్ చేసుకోండి!



ఉత్తరం దిశ: ఉత్తర దిశ సంపదకు సూచకం. అలాగే ఆఫీసు కార్యకలాపాలకు కూడా ఈ దిశ అనుకూలంగా ఉంటుంది. ఇక ఇంట్లో అయితే ప్రవేశ ద్వారం, పడక గది, తోట, వాకిలి, బాల్కనీలు, స్విమ్మింగ్ పూల్ లాంటి నిర్మాణాలను కూడా ఈ దిశలో నిర్మించుకుంటే బాగుంటుంది.



దక్షిణ దిశ: దక్షిణ దిశ కీర్తి ప్రతిష్టతలను పెంచుతుంది. అందుకని ఆఫీసు కార్యాలయంలో అయితే సీఈఓ చాంబర్ ను ఈ దిశలో పెడితే బాగుంటుంది. ఇంట్లో అయితే మాస్టర్ బెడ్ రూం, లేదా ఎంటర్టైన్మెంట్ గదిలాగా పెడితే బాగుంటుంది.



పశ్చిమ దిశలో ఇంట్లో అయితే స్ఫోర్ట్స్ రూం లా లేదా బెడ్ రూం లా, డైనింగ్ హాల్ లాగా ఉపయోగించవచ్చు. ఈ దిశలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేయవచ్చు. ఉద్యోగస్తులకు వారివారి సీట్లకు, క్యాబిన్లకు మంచి ప్రాంతంగా ఈ పశ్చిమ దిశ చెబతారు.



తూర్పు దిశ: సూర్యుడు ఉదయించేది ఈ దిక్కునే కాబట్టి వెలుతురు బాగా వస్తుంది. ఈ దిశలో కిటికీలు, తలుపులు, బాల్కనీలు, తోటలు ఉంటే బాగుంటుంది. డ్రాయింగ్ రూం లాంటివి ఏర్పాటు చేసుకోవాలన్నా ఈ దిశలో కట్టుకుంటే బాగుంటుంది.



ఈశాన్యం దిశ: నార్త్ ఈస్ట్ దిక్కు (ఈశాన్యం) ఉన్న ప్రాంతం దైవీకానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైనది.అందువల్ల ఈ దిక్కున పూజమందిరం కానీ, లేదా ధ్యానమందిరం కానీ, యోగారూం లాంటివి ఏర్పాటు చేయవచ్చు. అయితే ఈశాన్య దిక్కులో బరువులు అస్సలు ఉంచరాదు



వాయువ్య దిశ: నార్త్ వెస్ట్ (వాయువ్యం) ప్రాంతం ప్రధానంగా గాలికి ఆనవాలం. అందుకని ఈ దిశవైపు టాయిలెట్స్, గెస్ట్ రూం, ఎలివేటర్లు, ఏసీలు లాంటివి అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు.



నైరుతి దిశ: సౌత్ ఈస్ట్ ( నైరుతి) ప్రాంతం బలమైన ప్రాంతంగా చెబుతారు. ఇంట్లో అయితే వార్డ్ రోబ్ లను ఉంచుకోవచ్చు. ఇక కార్యాలయం విషయానికి వస్తే ఈ ప్రాంతంలో డిస్కషన్ రూంలు, లేదా సీనియర్ అధికారులకు బెడ్ రూంలు ఏర్పాటు చేయవచ్చు.



ఆగ్నేయం దిశ: సౌత్ ఈస్ట్ (ఆగ్నేయం) ప్రాంతం ఎక్కువగా ఇంటి యజమానుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా వంటగది ఉండడం శ్రేయస్కరం.



అగ్నిదేవుడు ఈ దిశకు అధిపతి. ఇక కార్యాలయాల విషయానికి వస్తే ఆఫీసు క్యాంటీన్ కానీ, ఇన్వర్టర్ లాంటి విద్యుత్ పరికరాలను ఇక్కడ ఉంచవచ్చు. అంతేకాదు సృజనాత్మక కార్యకలాపాలకు కూడా ఈ దిశను ఉపయోగించవచ్చు.



Note: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.



Image Credit: Pinterest