అన్వేషించండి

Spirituality: చెడు శకునంగా భావించిన స్లీపింగ్ ఎలిఫెంట్ ఎట్టకేలకు మేల్కొంది...

కర్ణాటకలో స్లీపింగ్ ఎలిఫెంట్ గురించి విన్నవారంతా అవాక్కవుతున్నారు. శకునాలు ఫాలో అవుతారని తెలుసు కానీ మరీ ఈ రేంజ్ లోనా అనుకుంటున్నారు. ఇంతకీ అక్కడేం జరిగింది. చెడు శకునంగా భావించిన ఏనుగును ఏం చేశారు.

హిందూ ఆచార వ్యవహా రాల విషయంలో శకునాల పాత్ర ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఏ పని ప్రారంభించినా శుభ శకునం చూసుకుని ప్రారంభించాలి. అశుభ శకునం ఎదురైతే ఆ పని అసంపూర్ణంగా ముగుస్తుందని విశ్వసిస్తుంటారు. మారుతున్న పరిస్థితుల బట్టి కొందరు తమ అభిప్రాయాలు మార్చుకున్నా...మరికొందరు మాత్రం సెంటిమెంట్స్ ని ఫాలోఅవుతునే ఉన్నారు. కర్ణాటకలో స్లీపింగ్ ఎలిఫెంట్ గురించి తెలుసుకుంటే మీరూ ఇదే అంటారేమో...

కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లా బేలూరు తాలూక బెన్నినామనే గ్రామంలో పది అడుగుల పొడవైన రాతి ఏనుగు ఇప్పుడు నిటారుగా నిలబడింది. రాతి ఏనుగు నిలబడడం ఏంటి, ఇన్నాళ్లూ ఏమైందంటారా...నిజమే రాతి ఏనుగు నిలబడలేదు నిలబెట్టారు. కొన్నేళ్లుగా ఆ ఏనుగు విగ్రహం ఎడమవైపు వాలి ఉండేది. దాని పాదాలు మొత్తం మట్టిలో కూరుకుపోయి ఉండేవి. దీంతో స్లీపింగ్ ఎలిఫెంట్ అని పిలిచేవారు..పైగా గ్రామంలో ఏ చెడు జరిగినా ఆ ఏనుగు విగ్రహమే కారణం అనుకునేవారు. ఆ విగ్రహం ఉన్న స్థలం నింగేగౌడ అనే వ్యక్తిది. స్లీపింగ్ ఎలిఫెంట్ సెంటిమెంట్ తో ఎవ్వరూ ఆ స్థలం కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ఏడమవైపు వంగి నిద్రపోతున్నట్టు ఉండే ఈ ఏనుగు వల్ల నష్టం జరుగుతుందని భావించేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ స్థలాన్ని అన్నే గౌడ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఇప్పుడు అన్నేగౌడ పిల్లల అధీనంలో ఉంది. అక్కడ కాఫీ సాగుచేయాలని నిర్ణయించుకుని పనులు ప్రారంభించారు. ఇలాంటి సమయంలో గ్రామంలో ఏదైనా జరిగితే తాము చేసే పనులు, తమ స్థలంలో ఉన్న ఏనుగు విగ్రహంపై నిందలేస్తారని భావించిన అన్నేగౌడ పిల్లలు...రెండు క్రేన్‌లు, జేసీబీని అద్దెకు తీసుకుని ఏనుగును పైకి లేపి నేరుగా అదే స్థలంలో అమర్చారు.

Also Read: వసంత పంచమి ప్రత్యేకత ఇదే... వ్యాసమహర్షి ప్రతిష్టించిన సరస్వతీ నిలయంలో అక్షరాభ్యాసం చేయిస్తే..
“ఏనుగు ఎడమవైపు నిద్రపోతున్నట్టు ఎడమవైపు వంగి ఉండడం వల్ల ఏ చెడు సంఘటన జరిగినా గ్రామస్తులు దాన్ని నిందిస్తారని... ఈ స్థలాన్ని ఎవ్వరూ కొనడానికి సిద్ధంగా లేనప్పుడు మా నాన్న కొనుగోలు చేశారన్నారు అన్నేగౌడ పిల్లలు. దీని గురించి ధర్మస్థలంలో ఉన్న మ్యూజియం వారికి సమాచారం అందించాం.. వారు కూడా ఈ విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చారు. కానీ ఈ భారీ రాతి విగ్రహాన్ని తరలించడానికి సరైన అవకాశం లేక ఆ ఆలోచన విరమించుకున్నారని చెప్పారు అన్నేగౌడ పిల్లలు. కాఫీ తోటసాగుచేసేందుకు ఎలాగూ ప్లాట్ ను చదునుచేస్తున్నాం... అందుకే క్రేన్లు, జేసీబీలు అందుబాటులో ఉండడంతో చెడుశకునంగా భావించే స్లీపింగ్ ఎలిఫెంట్ ని లేపి నిల్చోబెట్టాం అంటున్నారు. 

Also Read: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా చేయాలట….
ఏనుగు 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు దాదాపు  40 టన్నుల బరువు ఉంటుంది. ఇది అసంపూర్తిగా ఉన్న విగ్రహం. బేలూర్‌లోని హొయసలలు నిర్మించిన అనేక దేవాలయాల శిల్పాల్లో ఉపయోగించిన రాయిలా ఉందట.  ఈ విగ్రహాన్ని ఎవరు చెక్కారు, ఇక్కడకు ఎలా వచ్చింది, ఎందుకు ఇక్కడే వదిలేసి వెళ్లారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదన్నారు పురావస్తు శాఖాధికారులు. మొత్తానికి చెడు శకునంగా భావించే స్లీపింగ్ ఎలిఫెంట్ ఇప్పుడు లేచి నిల్చుంది. మరి ఇకకైనా అంతా మంచే జరుగుతుందని స్థానికులు భావిస్తారేమో...చూద్దాం....

Also Read: అప్పులు, అనారోగ్యం, శత్రుబాధలు తొలగించే సూర్యారాధన ...రథసప్తమి ప్రత్యేకత ఇదే..

టాప్ హెడ్ లైన్స్

చాణక్య నీతి: మరణానంతరం ఆత్మతో పాటు వెళ్లే 3 రహస్యాలు!
చాణక్య నీతి: మరణానంతరం ఆత్మతో పాటు వెళ్లే 3 రహస్యాలు!
Shani Dev: ఆర్థిక నష్టం , కుటుంబ కలహాలు.. శని మహాదశ ప్రారంభానికి ముందు కనిపించే 10 సంకేతాలు ఇవి!  
ఆర్థిక నష్టం , కుటుంబ కలహాలు.. శని మహాదశ ప్రారంభానికి ముందు కనిపించే 10 సంకేతాలు ఇవి!  
అద్దె ఇంట్లో వాస్తు దోషాలు పురోగతికి అడ్డుపడతాయా? అక్కడ నివాసం ఉండే కుటుంబంపై ప్రభావం చూపుతుందా?
అద్దె ఇంట్లో వాస్తు దోషాలు పురోగతికి అడ్డుపడతాయా? అక్కడ నివాసం ఉండే కుటుంబంపై ప్రభావం చూపుతుందా?
Numerology 2027: సంఖ్యాశాస్త్రం ప్రకారం.. అదృష్టం కోసం డిసెంబర్‌లో మార్చుకోవాల్సిన 9 అలవాట్లు!
సంఖ్యాశాస్త్రం ప్రకారం.. అదృష్టం కోసం డిసెంబర్‌లో మార్చుకోవాల్సిన 9 అలవాట్లు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Missing Fishermen Safe: క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
Kadapa BPT Student: ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Embed widget