అన్వేషించండి
Advertisement
Spirituality: భోజనం చేస్తున్నప్పుడు అన్నంలో వెంట్రుకలు వచ్చాయా, విమర్శిస్తూ భోజనం చేస్తున్నారా, ఈ విషయాలు తెలుసుకోండి
భోజనం ఎలా చేయాలి, ఎలా వడ్డించాలి, ఎలా తినాలి, ఎలా వండాలి అనే ప్రతి విషయాన్ని నియమ నిబంధనల ప్రకారం చెప్పారు పెద్దలు. అవేంటో చూద్దాం.
కొందరు ప్లేట్ నిండా వడ్డించుకుని కడుపునిండా తింటూనే ఆ భోజనంపై చిరాకుపడుతుంటారు, బాగాలేదంటూ విమర్శిస్తారు. వాస్తవానికి భోజనం చేసేటప్పుడు వంట బాగా లేదని కోపగించుకోవడం, కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టడం వంటివి అస్సలు చేయకూడదు. ఇంకా నియమాలేంటంటే...
- రోజుకి రెండుసార్లు భోజనం చేయాలని తైత్తరీయ బ్రాహ్మణం సెలవిస్తోంది
- రెండుసార్ల మధ్యలో ఇంకేమీ తినకుండా ఉంటే ఉపవాస ఫలితం కూడా వస్తుందట
- భోజనం చేసేటప్పుడు తూర్పువైపు తిరిగి భోజనం చేయాలి
- తూర్పువైపు తిరిగి భోజనం చేస్తే ఆయుష్షు
- దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే కీర్తి
- ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి
- పడమర, దక్షిణం వైపు తిరిగి భోజనం చేయరాదని వామనపురాణం, విష్ణుపురాణంలో ఉంది
- తూర్పు తిరిగి భోజనం చేయడం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా చెబుతున్నాయి
- మను సంహిత ప్రకారం కుటుంబ పెద్ద తూర్పు ముఖంగా కూర్చుని భోజనం చేయాలి
- భోజనానికి ముందు,తర్వాత కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.
- అన్నం తినే కంచాన్ని ఎడమ చేతితో ముట్టుకోకూడదు. ఒకవేళ పొరపాటునా ముట్టుకుంటే, వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.
- అన్నం తింటున్న సమయంలో ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు, తాకరాదు.
- అన్నం తినే సమయంలో ధ్యాస మొత్తం భోజనం మీదే ఉండాలి తప్ప వేరే విషయాలను ఆలోచించకూడదు. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి.
- భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాల్లో వెంట్రుకలు, పురుగులు వస్తే వెంటనే తినే దాన్ని విడిచిపెట్టాలి
- కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు.
- భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.
- స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమం
- పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం
- అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.
- ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు.
- ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు,వడ్డించరాదు.
Also Read: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే
Also Read: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion