News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Spirituality: కళ్లు కూడా గాలి పీల్చుకుంటాయి తెలుసా

గాలి పీల్చుకోవడం, వదలడం అనుకుంటారు కానీ మన శరీరంలో పదిరకాల వాయువులు ఉంటాయని తెలుసా... ఒక్కో వాయువుకి ఒక్కో పని.. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా ప్రాణం గాల్లో కలసిపోవాల్సిందే... ఇంతకీ ఏంటా పది వాయువులు...

FOLLOW US: 
Share:

వాయు పుత్రం వాల గాత్రం వజ్ర కాయం ఆంజనేయం
వానరేంద్రం ధీరసాంద్రం ధీప్రదాయం ఆంజనేయం

వాయువుతోనే ఆయువు ఆరంభం..వాయువుతోనే ఆయువు అంతం..నడుమన గడిచేదే నరుని జీవితం. అది శ్వాసల లెక్కలు మూసిన వెంటనే సమాప్తం....ఇది ఓ సినీకవి కలం నుంచి జాలువారింది. ఊపిరి తీసుకోవడం మొదలు మన శరీరం పనిచేసేందుకు కావాల్సింది వాయువే. శాస్త్రం ప్రకారం మన శరీరంలో పది వాయువులు ఉంటాయి. అవేంటంటే....

ప్రాణవాయువు
ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉండేది ప్రాణవాయువే. ప్రాణవాయువు ఎంతవిలువైనదో కరోనా సమయంలో అందరికీ తెలిసొచ్చింది. .

Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు

అపానవాయువు
తిన్న ఆహారం విసర్జించేందుకు ఉపయోగపడేదే అపాన వాయువు. పూర్తిగా జీర్ణం కాని కార్బోహైడ్రేట్స్ వలన ఈ గ్యాస్ తయారవుతుంది. ఇలా తయారైన గ్యాస్ మొత్తం ఎలాగోలా బయటికి రావాలి. ఇందులో కొంతభాగాన్ని మానవ శరీరం సహజంగా పీల్చేసుకుంటుంది.  అపానవాయువును ఆపుకోకూడదు. 

వ్యానము
శరీరం వంగడానికి కారణమయ్యేది వ్యానము. శరీరం సంకోచ, వ్యాకోచాలకు కారణమయ్యే వాయువు ఇది. అంటే ఎక్సర సైజ్ చేసేందుకు శరీరం సహకరించేలా చేసే వాయువు ఇది.

ఉదాన వాయువు
ఉదాన వాయువు సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాం. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగుతాయి. 

Also Read: ఈ వారం ఈ రాశులవారు లక్ష్యాలను సులభంగా సాధించేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

సమాన వాయువు
జీర్ణం అయిన ఆహారం రక్తం, పిత్తం, శ్లేష్మంగా మార్చి, శరీరం అంతా సమానంగా ప్రసరించేలా చేస్తుంది సమాన వాయువు.

నాగము
జీర్ణాశయంలో అధిక వాయువు ఉండకుండా సహాయం చేసేది నాగము. అందరకీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే త్రేణుపు. కడుపునిండా తిన్నప్పుడు, హెవీగా అనిపించినప్పుడు ఈ వాయువు గొంతు ద్వారా బయటకు వస్తుంది.

కూర్మము 
కళ్లుమూసి తెరిచేందుకు కూడా గాలి అవసరం ఉంటుందని మీకు తెలుసా. కళ్లు మూసి తెరిచే సమయంలో అవసరమయ్యే గాలిని కూర్మము అంటారు. 

కృకరము
తుమ్మే సమయంలో వచ్చే గాలి కృకరము. 

Also Read: శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే

దేవదత్తము
ఇంద్రియములు పనిచేసేందుకు సహకరించేది దేవదత్తము. ఇదే ఆవులింత. 

ధనుంజయము
శరీరంలో ప్రాణం పోయినా దహనం అయ్యేవరకు ఉండే వాయువు ధనుంజయము. సాధారణంగా మనిషి మృతిచెందిన తర్వాత కూడా కొన్ని గంటల పాటూ గుండె పనిచేస్తుంది.అది ధనుంజయ వాయువు వల్లనే. 

మొత్తంగా పంచ ప్రాణాలు ఐదు, ఉప ప్రాణాలు ఐదు....ఈ పదింటిని కలపి దశవాయువులు అంటారు.

Published at : 20 Apr 2022 06:41 PM (IST) Tags: 10 vayus body oxygen pancha prana upa prana Spirituality

ఇవి కూడా చూడండి

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు

ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు

Chanakya Niti In Telugu : మీ జీవితంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 8 మంది వీళ్లే!

Chanakya Niti In Telugu : మీ జీవితంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 8 మంది వీళ్లే!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

టాప్ స్టోరీస్

Supreme Court: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో మరో బెంచ్‌కు

Supreme Court: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో మరో బెంచ్‌కు

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Ravi Teja Eagle Release Date : సంక్రాంతి బరిలో రవితేజ 'ఈగల్' - పండక్కి మొండోడు వస్తున్నాడు

Ravi Teja Eagle Release Date : సంక్రాంతి బరిలో రవితేజ 'ఈగల్' - పండక్కి మొండోడు వస్తున్నాడు

Salman Khan Tiger 3 : 'టైగర్ 3'తో సల్మాన్ 1000 కోట్లు కొడతాడా? - ఇండియాలో వెయ్యి కోట్ల హీరోలు ఎవరో తెలుసా?

Salman Khan Tiger 3 : 'టైగర్ 3'తో సల్మాన్ 1000 కోట్లు కొడతాడా? - ఇండియాలో వెయ్యి కోట్ల హీరోలు ఎవరో తెలుసా?