అన్వేషించండి

ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ ఎందుకు కడతారు - అది కుళ్లిపోతే ఏమవుతుందో తెలుసా!

Spirituality: హిందువుల ఇంటి డోర్ బయట గుమ్మడి కాయ కడుతుంటారు..ఒకటి కుళ్లిపోతే వెంటనే తీసేసి మరొకటి కడతారు..ఇంతకీ గుమ్మడి కాయ ఎందుకు కడతారు? ఇది కట్టేందుకు కూడా మంచి రోజు చూస్తారా?

Significance of Hanging a Pumpkin in Front of the House :  నరదృష్టి  అనే మాట వినేఉంటారు కదా.. ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు చూసి ఓర్వలేని వారంతా చెడుకోరుకోవడం వల్ల నరదృష్టి కుటుంబం మీద పడుతుందని చెబుతారు. ఈ ప్రభావం పడితే జరగకూడని సంఘటనలు జరుగుతాయని భావిస్తారు...అనారోగ్యం బారిన పడడం, అనవసర వివాదాలు జరుగుతుంటాయి. వ్యాపారంలో అయితే చెడుదృష్టి తగిలితే నష్టాలపాలవుతారు. అందుకే ఇలాంటి ప్రతికూల చూపు సోకకుండా కొన్ని నియమాలు పాటిస్తారు...ఇలాంటి వాటిలో ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారానికి గుమ్మడికాయ కడతారు. దీని వెనుక చాలా కారణాలుంటాయంటారు పండితులు. గుమ్మడికాయ గుమ్మానికి ఉంటే వుంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్టేనని..ఎలాంటి ప్రతకూల శక్తి లోనికి ప్రవేశించదంటారు. 

Also Read: ఎవ్వరూ చూడడం లేదు అనుకుంటే ఎలా...మిమ్మల్ని మౌనంగా గమనించే 18 సాక్షులు ఇవే!

ఏ రోజు కట్టాలి

గుమ్మడి కాయను నూతన గృహ ప్రవేశం సమయంలో కానీ లేదంటే అమావాస్య, మంగళవారం, బుధవారం రోజు కానీ ప్రత్యేకంగా పూజచేసి కడతారు. బూడిదగుమ్మడికాయను తీసుకొచ్చి కడిగి పసుపు రాసి కుంకుమబొట్టు పెట్టి దానిపై ఓంకారం, స్వస్తిక్ గుర్తును దిద్ది పూజామందిరంలో పెట్టి పూజచేసి మంచి సమయం చూసి గుమ్మానికి కడతారు. ఇలా కట్టేటప్పుడు ఓం కాలభైరవాయ నమ: అని కడతారు. నిత్యం ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత గుమ్మడికాయకు ధూపం వేస్తే చెడు దృష్టి ఇంట్లో అడుగుపెట్టదని పండితులు చెబుతారు. గుమ్మడికాయ కుళ్లిపోతే దాన్ని వెంటనే తీసేసి మరొకటి తీసుకొచ్చి పూజచేసి కట్టుకోవచ్చు. గ్రహణాలు, ఇంట్లో పురుడు, మైల వచ్చిన సందర్భాల్లో గుమ్మడికాయ తన శక్తిని కోల్పోతుందని ఆ సమయంలో కూడా పాతది తీసేసి మరొకటి తీసుకొచ్చి కట్టాలంటారు. 

Also Read: ఈ ఆలయంలో 4 స్తంభాలు 4 యుగాలకి ప్రతీక - ప్రస్తుతం ఉన్న ఒక్క స్తంభం కూలిపోతే కలియుగాంతమే!
 
ఆరోగ్యానికీ గుమ్మడికాయ!

గుమ్మడికాయ ప్రతికూల శక్తులను , దృష్టి దోషాలను తరిమేసేందుకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటారు ఆరోగ్య నిపుణులు.  శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతున్న బూడిద గుమ్మడికాయను సంస్కృతంలో కుష్మాండ అంటారు. ఇందులో 96 శాతం నీరు   4 శాతంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, కాల్షియమ్, ఐరన్, విటమిన్ బి1, బి 2, బి3, బి5, బి6, విటమిన్ సి ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే శక్తి, శరీరంలో వ్యర్థ్యాలను బయటకు తొలగించే శక్తి బూడిదగుమ్మడికాయకు ఉందని చెబుతారు. లివర్ పనితీరు మెరుగుపచ్చి జీవక్రియను మెరుగుపరుస్తుంది. ప్రతి చిన్న విషయానికి అతిగా ఆందోళన చెందేవారు రోజూ ఓ గ్లాస్ బూడిదగుమ్మడి జ్యూస్ తాగితే ఈ సమస్య నుంచి బయటపడతారు. ఈ జ్యూస్ లో కేలరీలు ,  కార్బోహైడ్రేట్లు, కొవ్వు శాతం తక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్ ఉన్నవారు నిత్యం తీసుకోవచ్చు. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడంతో పాటూ బరువు తగ్గేందుకు కూడా బెస్ట్ మెడిసిన్ బూడిదగుమ్మడికాయ జ్యూస్.  ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తినిస్తుంది..ఫలితంగా క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. సంతానానికి సంబంధించిన సమస్యలు కూడా నివారించే శక్తి బూడిదగుమ్మడికాయకు ఉంది. అనారోగ్యాన్ని మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని పెంచడంలోనూ బూడిదగుమ్మడికాయ ఉపయోగపడుతుందంటారు.  ఇంకా  చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అయినా ఒంట్లో అనారోగ్యాన్ని అయినా తరిమేసేందుకు అయినా బూడిదగుమ్మడికాయ ఉపయోగపడుతుందంటున్నారు పండితులు, ఆరోగ్యనిపుణులు...

Also Read: కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
Tiger Attacks in Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
Tiger Attacks in Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
Farmers Protest: ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Embed widget