News
News
X

Shoonya masam 2023: శూన్యమాసం అంటే ఏంటి, ఈ నెలలో శుభకార్యాలు ఎందుకు చేయరు!

Shoonya masam: శూన్యమాసం ముహూర్తాలు లేవు, ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు కదా.. ఎందుకు..అసలు శూన్యమాసం అంటే ఏంటి...

FOLLOW US: 
Share:

Shoonya masam 2022-2023: సూర్యమానం ప్రకారం, చాంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్య మాసాలంటారు. సూర్యమానం ప్రకారం ధనుర్మాసం - చాంద్రమానం ప్రకారం పుష్యమాసం కలిసి ఉన్న కొన్ని రోజులను శూన్య మాసమంటారు. ధనుర్మాసం మొత్తం  శూన్య మాసం కాదు అదేవిధంగా పుష్య మాసం మొత్తం కూడా శూన్య మాసం కాదు. ధనుర్మాసం ప్రారంభమైన కొద్దిరోజులకు పుష్య మాసం ప్రారంభం అవుతుంది. అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమయినా ముందు రోజు వరకు శూన్య మాసం కాదు. అదేవిధంగా ధనుర్మాసం అయిపోయిన తర్వాత పుష్యమాసంలో మిగిలిన రోజులు శూన్య మాసం కాదు.

Also Read: 2023 ఈ నాలుగు రాశుల స్త్రీలకు కలిసొస్తుంది, మీరున్నారా ఇందులో!

మీన మాసంతో కూడిన చైత్రమాసం, మిధున మాసంతో కూడిన ఆషాడ మాసం, కన్యా మాసంతో కూడిన భాద్రపద మాసం, ధనుర్మాసంతో కూడిన పుష్య మాసాలను శూన్య మాసాలంటారు. ఈ కాలంలో గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహాది ముఖ్య శుభ కార్యాలకు ముహుర్తాలు శూన్యం. అధిక మాసంలో కూడా శుభ కార్యాలకు ఎటువంటి ముహుర్తాలుండవు. కొత్త ఇంటి నిర్మాణం చేపట్టకూడదు. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయకూడదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించరాదు. శని జన్మ నక్షత్రం పుష్యమి కావడంతో ఈ పుష్యమాసంలో ఏం శుభకార్యం చేసినా సత్ఫలితాన్నివ్వదని చెబుతారు.పితృ కార్యాలు మాత్రం శూన్య మాసంలో చేయవచ్చు.

చంద్రమానం ప్రకారం తెలుగు నెలలు
హిందువులకు చాంద్రమానము సూర్యమానమని రెండు రకాల కాలమానాలు (క్యాలెండర్) ఉన్నాయి. చంద్రుడి గమనాన్ని ఆధారం చేసుకుని చాంద్రమాన మాసాలు ఏర్పడతాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం అని పన్నెండు మాసాలు ఉన్నాయి. శుక్ల పాడ్యమి మొదలు అమావాస్య వరకు ఒక నెలగా పరిగణిస్తారు. ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ తరువాత వచ్చే కృష్ణ పాడ్యమి మొదలు మళ్లీ వచ్చే పూర్ణిమ వరకు ఒక మాసంగా పరిగణిస్తారు. పూర్ణిమ రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసాన్ని పిలుస్తారు. ఉదాహరణకు చంద్రుడు పూర్ణిమనాడు చిత్త నక్షత్రం దగ్గర ఉంటాడు కాబట్టి చైత్ర మాసం అంటారు. చంద్రుడు విశాఖ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నప్పుడు వైశాఖ మాసమని పిలుస్తారు. 

Also Read: ఈ సారి ముక్కోటి ఏకాదశి ఎప్పుడొచ్చింది, ఉత్తర ద్వార దర్శనం వెనుకున్న పరమార్థం ఏంటి!

సూర్యసంచారం ఆధారంగా రాశుల పేర్లతో నెలలు
సూర్యుడు ప్రతినెలా ఒక రాశిలో ఉంటాడు. ధనుర్మాసంలో ధనుస్సురాశి దగ్గర ఉంటాడు. మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం ఈ పన్నెండు రాశుల పేర్లతో పన్నెండు సూర్య మాన నెలలు ఉంటాయి. సూర్యుని చుట్టూ భూమి ఒక స్థిరమైన కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. అందువల్ల సూర్యమానం ఆధారంగా చేసుకొని తయారుచేసిన కాలమానం రుతువులకు సామీప్యంగా ఉంటుంది.

Published at : 27 Dec 2022 11:52 AM (IST) Tags: dhanurmasam Shoonya masam Shooonya Masam date and time pushya masam

సంబంధిత కథనాలు

Shoe Rack Vastu Tips: చెప్పులు ఈ దిక్కున వదులుతున్నారా? దరిద్రం మిమ్మల్ని వదలదు

Shoe Rack Vastu Tips: చెప్పులు ఈ దిక్కున వదులుతున్నారా? దరిద్రం మిమ్మల్ని వదలదు

Garuda Purana: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?

Garuda Purana: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?

సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమే ‘సాలగ్రామం’ - ఇలా పూజిస్తే మీ కష్టాలన్నీ మాయం!

సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమే ‘సాలగ్రామం’ - ఇలా పూజిస్తే మీ కష్టాలన్నీ మాయం!

Horoscope Today 08th February 2023: ఈ రాశివారు కొన్నివిషయాల్లో సంకోచం లేకుండా దూసుకుపోతారు, ఫిబ్రవరి 8 రాశిఫలాలు

Horoscope Today 08th February 2023: ఈ రాశివారు కొన్నివిషయాల్లో సంకోచం లేకుండా దూసుకుపోతారు, ఫిబ్రవరి 8 రాశిఫలాలు

Gunadala Mary Mata Festival: ఈ 9 నుంచి గుణదల మేరీ మాత ఉత్సవాలు - అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు

Gunadala Mary Mata Festival: ఈ 9 నుంచి గుణదల మేరీ మాత ఉత్సవాలు - అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు

టాప్ స్టోరీస్

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !

Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్  !

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్‌! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్‌ తెస్తున్నారు!

No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్‌! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్‌ తెస్తున్నారు!