By: ABP Desam | Updated at : 19 Feb 2022 07:06 AM (IST)
Edited By: RamaLakshmibai
Shani Mantra
శనివారానికి అధిపతి శనీశ్వరుడు. సంఖ్యలలో 'ఎనిమిది' శనికి ప్రీతికరమైన సంఖ్య. ప్రత్యక్ష దైవం అయిన సూర్యుడు, ఛాయాదేవికి పుట్టిన సంతానం శని. అందుకే ఛాయాపుత్రుడు అనికూడా అంటారు. మనుషుల జాతక చక్రాలపైన తన ప్రభావం ఎలా చూపబోతున్నాడో అని చెప్పేందుకే శని..సూర్య గ్రహణం సమయంలో జన్మించాడని చెబుతారు.
శనీశ్వరునికి ఇష్టమైనవి నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నీలం, ఇనుము, అశుభ్రంగా-బద్ధకంగా ఉండే చోటు. బతికి ఉన్నంతకాలం చేసిన తప్పులకు మరణానంతరం శిక్షలు వేస్తాడు శనిదేవుడి అన్నయ్య యమధర్మరాజు. కానీ తమ్ముడు శని మాత్రం జీవుడు బతికిఉండగానే తన ప్రతాపాన్ని చూపిస్తాడు. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపేలా చేస్తాడు. నమ్మక ద్రోహం,వెన్నుపోటు,హింస,పాపం, అన్యాయ మార్గాలను అనుసరించేవారికి వారి కర్మ ఫలిత ఆధారంగా శనిదేవుడు వారిని ఎక్కువ ఇబ్బంది పెడతాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
Also Read: ఈ అష్టకం అష్ట దరిద్రాలను నాశనం చేస్తుంది, ఎందుకంత పవర్ ఫుల్ అంటే
గోచారస్థితి ఫలితంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉంటాయి. శని ప్రభావం పడితే అన్న యముడుని దాదాపు పరిచయం చేసి తీసుకొస్తాడని( అంటే చావు అంచుల వరకూ తీసుకెళ్లి తీసుకొస్తాడని) అంటారు. అందుకే శని పట్టకుండా ఎవ్వరూ ఆపలేరు కానీ ఆ ప్రభావం తగ్గించేందుకు, శనని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని మంత్రాలు చదివితే మంచిదంటారు పండితులు
ఓం శం శనయేనమ
ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః
కోణస్ధః పింగళ బభ్రు
కృష్ణో రౌద్రంతకో యమ:
సౌరి శనైశ్చరో మంద:
పిప్పలాదేవ సంస్తుత:
నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం
ఓం సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష:
శివప్రియ: మందచార: ప్రసనాత్మ పీడాం హరతుమే శని
శని గాయత్రీ మంత్రం:
ఓం ఖగథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.
ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్
శని శాంతి మంత్రం
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి
''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.
శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే
ఈ శ్లోకాలను కుదిరితే నిత్యం లేదంటే ప్రతి శనివారం జపించడం వల్ల శనిదోషం తగ్గుతుందని చెబుతారు. ముఖ్యంగా ఆంజనేయుడిని, శివుడిని పూజించినా శని ప్రభావం తక్కువ ఉంటుందంటారు.
నోట్: వీటిని ఎంతవరకూ అనుసరించవచ్చు అనేది మీ భక్తి విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది
Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే
Chanakya Niti In Telugu: గెలుపంటే శత్రువుని ఓడించడం కాదు మళ్లీ లేవకుండా చేయడం!
Different Tip to Celebrate Christmas 2023: క్రిస్టియన్స్ మాత్రమే కాదు క్రిస్మస్ కి మీరూ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు!
Astrology: ఈ 4 రాశులవారు మొండి ఘటాలు, వీళ్లతో అస్సలు వాదించలేం!
Daily Horoscope Today Dec 6, 2023 : ఈ రాశివారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండడమే మంచిది, డిసెంబరు 6 రాశిఫలాలు
Astrology: మీ పిల్లల్లో ప్రత్యేకతేంటో వాళ్ల రాశి చెప్పేస్తుంది, మరి మీకు తెలుసా!
Telanagna Politics: కాంగ్రెస్ కేసీఆర్నే ఫాలో కానుందా? కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?
Pavan Babu Meet : చంద్రబాబుతో పవన్ భేటీ - అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ!
CM Revanth : మాట నిలబెట్టుకున్న రేవంత్ - దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం
AP High Court: ఎస్ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు
/body>