అన్వేషించండి

Saturn Retrograde july 12th: కుంభం నుంచి మకరంలోకి వక్రంలో శని, ఈ రాశులవారికి అరాచకంగా ఉంది

జులై 12 నుంచి శనిగ్రహం రాశిమారనున్నాడు. కుంభ రాశి నుంచి మకర రాశిలోకి వక్రంలో ప్రయాణించనున్నాడు. ఈ ప్రభావం ద్వాదశ రాశులవారిపైనా పడుతుంది. మకరంలో శని తిరోగమనం ఎవరికి అరాచకంగా ఉంటుందో చూద్దాం...

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం  నవ గ్రహాల్లో శనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహాలన్నింటిలో శని గ్రహమే అత్యంత నెమ్మదిగా ప్రయాణిస్తుంది. జులై 11 వరకూ కుంభరాశిలో ఉన్న శని... జులై 12 నుంచి కుంభ రాశి నుంచి మకరంలోకి తిరోగమనం చేయనున్నాడు. ఇదే రాశిలో అక్టోబర్ 20 వరకూ వక్రంలో ప్రయాణించి..ఆ తర్వాత కూడా ఇదే రాశిలో సంచరిస్తాడు. శని తిరోగమనం దశలో ఉన్నప్పుడు ఆ ప్రభావం 12 రాశులపైనా పడుతుంది. క్టోబరు 23 వరకూ శని వక్రంలోనే ఉంటాడు.  ఈ ఫలితంగా కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం పడుతుంది...ఆ రాశులేంటంటే...

మిథునం
మకరంలో శని సంచారం అంటే మిథున రాశివారికి శని 8వ స్థానంలో ఉన్నట్టు అర్థం. ఈ రాశివారిపై శని ప్రతికూల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఆస్తి సంబంధిత విషయాలు మీకు సమస్యలు సృష్టిస్తాయి. కోపాన్ని అదుపు చేసుకోవాల్సిందే. అనుకోని విభేదాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఈ సమయంలో మీ మానసిక పరిస్థితి సరిగా ఉండదు. మీరు చేసే పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. 

కర్కాటకం
మకరంలో శని సంచారం ప్రభావం కర్కాటక రాశివారిపై మిశ్రమ ఫలితాలనిస్తుంది.  భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు నష్టాలు ఎదుర్కోక తప్పదు. వాహన ప్రమాదం ఉంది జాగ్రత్త.  తలపెట్టిన పనుల్లో ఆంటకాలు ఏర్పడతాయి. ఓపికగా పనిచేయండి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.  

Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం

తులా
శని తిరోగమనం మకర రాశివారికి ప్రతికూల ఫలితాలున్నాయి.  మానసికంగా బలహీనంగా ఉంటారు. ఉద్యోగులకు ఒత్తిడి తప్పదు. ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది...ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ పిల్లల వైపునుంచి శుభవార్తలు వింటారు.  

ధనుస్సు
మకరంలో శని సంచారం ధనస్సు రాశివారికి అంతగా బాలేదు.  ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. చీటికీ మాటికీ వివాదాలు జరుగుతాయి. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. ఎవ్వరిపైనా మాట విసరొద్దు. అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. మానసిక ఒత్తిడికి లోనవుతారు. తలపెట్టిన పనులు మాత్రం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు.  పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా  ఎలాంటి ప్రయాస లేకుండా ఆయా పనులు పూర్తి చేస్తారు

Also Read: ఇంట్లో ఆదిశగా దీపం పెడితే అన్నీ అపశకునాలే

మకరం
మకర రాశివారికి ఆదాయం పెరుగుతుంది. సోదరుల సహకారం మీకు ధైర్యాన్నిస్తుంది. శని ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో మనస్పర్థలు తలెత్తుతాయి. మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఖర్చులు అదుపుచేయండి. వ్యాపారులకు బాగానే ఉంది.

కుంభం
శని మార్పు కుంభరాశికి మిశ్రమ ఫలితాలు  ఇస్తుంది.  శని తిరోగమనం సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. శత్రువుల నుంచి హానికలిగే అవకాశం ఉంది. పనికిరాని వాటికోసం డబ్బు ఖర్చు చేయొద్దు. పాత వ్యాధులు బయటపడతాయి. కుటుంబంలో అపార్థాలు పెరుగుతాయి. 

Also Read: సాష్టాంగ నమస్కారం స్త్రీలు ఎందుకు చేయకూడదు

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

అల్లాటప్పా అనే పదం ఎలా పుట్టింది? దీని అసలైన అర్థం ఏంటి?
అల్లాటప్పా అనే పదం ఎలా పుట్టింది? దీని అసలైన అర్థం ఏంటి?
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Surya Gochar 2026: సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget