శని సంచారం మారుతోంది ఏప్రిల్ 6 నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
శని మార్పు ఏ రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
నవ గ్రహాల గమన ప్రభావం ప్రపంచ ప్రజల అందరి మీదా ఉంటుందని జ్యోతిషం చెబుతోంది. కొన్ని గ్రహాలు నెమ్మదిగా సాగుతాయి. అలా సాగే గ్రహాల్లో శని మొదటిది. శని చాలా మందగమనంతో సాగే గ్రహం. అందువల్ల ఈ గ్రహాన్ని మందుడు అని కూడా అంటారు. ఒక రాశి నుంచి మరో రాశికి మారేందుకు దాదాపుగా రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శని కదలికలు నెమ్మదిగా ఉండడం వల్ల దాని ప్రభావం ప్రపంచం మీద చాలా ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం శని తన స్వస్థానమైన కుంభ రాశి శతభిష నక్షత్రంలో ఉన్నాడు. శనీశ్చరుడు 6 ఏప్రిల్ 2024న పూర్వాభాద్ర నక్షత్రంలోకి మారుతున్నాడు. శని రాశి మారుతున్నందున అన్ని రాశుల వారి మీద దీని ప్రభావం ఉంటుంది. కొన్ని రాశుల వారి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. కొంత మందికి అదృష్టం వరిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నత స్థితి సాధిస్తారు. అయితే ఈ శని మార్పు ఏ రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
కన్యా రాశి
ఏప్రిల్ 6న శని పూర్వాభాద్ర నక్షత్రంలోకి శని సంచారం జరగడం వల్ల కన్యరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వృత్తిలో మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం, వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
శని మార్పు వృశ్చిక రాశి వారికి జీవితంలో మంచి మార్పులను తీసుకువస్తుంది. అన్ని రకాల ఆనందాలు వీరి సొంతమవుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. లేదా కొత్త లాభాదాయక డీల్స్ కుదురుతాయి. ఈ రాశి వారికి శని ఆశిస్సులతో కేరీర్ లో ముందుకు దూసుకుపోతారు. సంపద బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి సమాజంలో, కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుబంధాలు బలపడతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం, అన్నిటా విజయం వీరికి సొంతమవుతుంది.
కుంభరాశి
శనీశ్చరుడు కుంభరాశి కి అధిపతి. ప్రస్తుతం స్వస్థానంలో కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. ఇప్పుడు శని సంచార మార్పు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గౌరవం, విశ్వాసం, సంపద పెరిగే సంకేతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మందకోడిగా సాగిన పనులు వేగం పుంజుకుంటాయి. మీ స్థానం సమాజంలో బలంగా మారుతుంది. ప్రతిష్ట పెరుగుతుంది. జీవితం గాడిన పడిన భావన కలుగుతుంది. కొత్త ప్రణాళికలు ఫలిస్తాయి. అన్ని కోరికలు నేరవేరే అవకాశాలే ఎక్కువ.
Also Read : Hanuman Jayanti 2024: ఈ ఏడాది హనుమాన్ జయంతి ఎప్పుడు? ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయ్!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.