అన్వేషించండి

Hanuman Jayanti 2024: ఈ ఏడాది హనుమాన్ జయంతి ఎప్పుడు? ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయ్!

Hanuman Jayanti Date: ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏ రోజు వస్తుంది. ఏం చేస్తే కష్టాలు తొలగిపోతాయి?

ఏటా చైత్ర మాసంలో పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటాము. అంజనీ దేవి, వానర రాజు కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించిన పవిత్రమైన రోజు ఇది. హనుమాన్ జయంతి రోజున హనుమంతుడితో పాటు సీతారాముల పూజ కూడా జరుపుతారు. రాముడి ఆరాధన లేకుండా హనుమాన్ పూజ సంపూర్ణం కాదు.

హనుమాన్ శోభాయాత్ర వైశిష్ట్యం

చైత్ర శుద్ద పౌర్ణమి రోజున హనుమంతుడు అవతరించిన రోజు మాత్రమే కాదు. ఈ రోజున హనుమాన్ శోభాయాత్ర చాలా అన్ని ప్రముఖ ఆంజనేయ ఆలయాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాయి. అందుకు రామాయణంలో ఒక కారణం కూడా చెబుతారు. రావణుడి మీద రాముడు సాధించిన విజయంలో ప్రముఖ పాత్ర హనుమంతుడికి కూడా ఉంది. ఆ విషయాన్ని రాముడు ఏనాడూ విస్మరించలేదు. రామ పట్టాభిషేకం అనంతరం ఇదే హనుమాన్ జయంతి రోజున రాముడు హనుమంతుడిని శుభాకాంక్షలు తెలుపుతూ తన విజయానికి కారకుడైన వాయు పుత్రుడికి నిండు సభలో సన్మానం జరిపి ఆలింగనం చేసుకున్నాడని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలంతా ఆ రోజును హనుమత్ విజయోత్సవంగా జరుపుకోవడం అనవాయితీగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది ఎప్పుడు

ఈ సంవత్సరం 2024 ఏప్రిల్ 23న హనుమాన్ జయంతి జరుపుకోబోతున్నారు. చైత్ర మాసంలో శుక్లపక్ష పౌర్ణమి ఏప్రిల్ 23 తెల్లవారుజామున 3.45 గంటలకు ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 24 ఉదయం 5.18 గంటలకు ముగుస్తుంది. ఏప్రిల్ 23న ఉదయం 9.03 గంటల నుంచి 10.41 గంటల వరకు హనుమాన్ ఆరాధనకు అనువైన సమయం. బ్రహ్మ ముహూర్తం ఏప్రిల్ 23 ఉదయం 4.20 నుంచి 5.04 గంటల వరకు ఉంది. అభిజీత్ ముహూర్తం ఉదయం 11.53 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.46 గంటలకు ముగుస్తుంది.

ఈ ఏడాది ప్రత్యేకం

ఏప్రిల్ 23 చైత్ర పౌర్ణమి మంగళ వారం రోజున రావడం యాదృఛ్చికమే అయినా అపురూపమని పండితులు అభిప్రాయపడుతున్నారు. మంగళ వారం హనుమంతుడికి ప్రీతి పాత్రమైన రోజు. ఈ హనుమాన్ జయంతి రోజున ఇలాంటి ప్రత్యేక పూజలు హనుమంతుడికి, రాముడికి చేసుకోవడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందట. రామ నవమి తర్వాత సరిగ్గా ఆరు రోజులకు హనుమాన్ జన్మదినం వస్తుంది. ఈ ఏడాది రామ నవమి ఏప్రిల్ 17న వస్తోంది.

హనుమాన్ జయంతి ప్రాముఖ్యత

హనుమాన్ జయంతి రోజు హనుమంతుడిని సేవించుకోవడం వల్ల కష్టాలు తొలగి పోతాయని నమ్మకం. రోగభయం, భూతప్రేతాల వల్ల కలిగే భయాలను హనుమంతుడు తొలగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమాన్ జయంతి రోజున ఆంజేనేయ స్వామి గుడికి వెళ్లి పచ్చిమిర్చి, బెల్లం, నూనె, బేసన్ లడ్డు నైవేద్యంగా సమర్పించాలి. హనుమాన్ చాలీసా పఠనం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. హనుమత్ జయంతి రోజున రామాయణం చదువుకోవడం శుభ ప్రదం. ముఖ్యంగా సుందరాకాండ పారాయణం హనుమత్ కృపకు పాత్రులను చేస్తుంది.

Also Read : Solar Eclipse 2024 : 54 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న సంపూర్ణ సూర్య గ్రహణం ప్రభావం ఏమిటో తెలుసా? మనకు వర్తిస్తుందా?

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

టాప్ హెడ్ లైన్స్

మిథునం, కర్కాటకం వారఫలం: డిసెంబర్ మొదటి వారం మీ ఆర్థిక, ప్రేమ, ఉద్యోగ జాతకం!
మిథునం, కర్కాటకం వారఫలం: డిసెంబర్ మొదటి వారం మీ ఆర్థిక, ప్రేమ, ఉద్యోగ జాతకం!
వారఫలాలు నవంబర్ 30 - డిసెంబర్ 6: మేష, వృషభ రాశుల అదృష్టం మారబోతోందా?
వారఫలాలు నవంబర్ 30 - డిసెంబర్ 6: మేష, వృషభ రాశుల అదృష్టం మారబోతోందా?
నవంబర్ 28 శనివారం ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులకు అదృష్టం, ఆర్థిక లాభం!
నవంబర్ 28 శనివారం ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులకు అదృష్టం, ఆర్థిక లాభం!
నవంబర్ 28 శనివారం రాశి ఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులకు అద్భుతమైన శుభ ఫలితాలు!
నవంబర్ 28 శనివారం రాశి ఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులకు అద్భుతమైన శుభ ఫలితాలు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Jagapathi Babu : వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Embed widget