అన్వేషించండి

Solar Eclipse 2024 : 54 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న సంపూర్ణ సూర్య గ్రహణం ప్రభావం ఏమిటో తెలుసా? మనకు వర్తిస్తుందా?

54 సంవత్సరాల క్రితం 1970వ సంవత్సరంలో ఏర్పడింది. తిరిగి ఇప్పుడు అలాంటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అంత విశేషమైన సూర్యగ్రహణం గురించి కొన్ని విషయాలు...

ప్రతి సంవత్సరం రెండు మూడు సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఈ సంవత్సరంలో ఏర్పడే మొదటి సూర్య గ్రహణం సంపూర్ణ గ్రహణం మాత్రమే కాదు దాదాపు 54 సంవత్సరాల తర్వాత ఇటువంటి సూర్య గ్రహణం ఏర్పడుతున్నట్టు పండితులు చెబుతున్నారు. 1970వ సంవత్సరంలో ఏర్పడిన సూర్య గ్రహణం మళ్లీ ఈ ఏడాది కనిపించబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని విశేషాలు మీ కోసం.

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8 ఏర్పడబోతోంది. చైత్ర నవరాత్రుల ప్రారంభానికి ముందు ఏర్పడే ఈ సూర్యగ్రహణానికి జ్యోతిషంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని పండితులు అంటున్నారు. ఇది ఈ సంవత్సరంలో ఏర్పడే మొదటి గ్రహణం మాత్రమే కాదు సంపూర్ణ సూర్యగ్రహణం కూడా. ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుంది? ప్రభావం ఎలా ఉంటుంది? ఇక్కడ తెలుసుకుందాం.

ఎప్పుడు ఏర్పడుతుంది?

శాస్త్రాన్ని అనుసరించి సూర్యగ్రహణ శుభాశుభ ఫలితాలు ప్రపంచ పరిస్థితులను ప్రభావితం చేస్తాయి. ఈ సంవత్సరం 8, 9 తేదీల మధ్య కాలంలో రాత్రి పూట ఏర్పడుతుంది. దీని వ్యవధి ఎనిమిదవ తేది రాత్రి 9.12 నిమిషాల నుంచి తెల్లవారుజామున 1.25 నిమిషాల వరకు ఉంటుంది. సూర్య గ్రహణ సూతక కాలం గ్రహణానికి 12 గంటల ముందు నుంచి ప్రారంభం అవుతుంది.

మనకు కనిపిస్తుందా?

ఈ సూర్యగ్రహణం భారత దేశంలో కనిపించదు. అందువల్ల సూతక కాలం కూడా ఇక్కడ వర్తించదు. అలస్కా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, ఐర్లాండ్ తో సహా మరి కొన్ని ఉత్తర ప్రాంతాలు, ఇంగ్లాండ్ లోని కొన్ని వాయువ్య ప్రాంతాలు, కెనడా మినహా మొత్తం అమెరికాలో సంపూర్ణ సూర్య గ్రహణం కనిపిస్తుంది. ఈ ఏడాది మెక్సికోలోని మజాటియన్ నగరంలో సంపూర్ణ సూర్య గ్రహణం కనిపించబోతోంది.

గ్రహణ సమయాలు

రాత్రి 9.12 నిమిషాలకు సూర్య గ్రహణం ప్రారంభం అవుతుంది. గ్రహణం 11.47 కూ సంపూర్ణం అవుతుంది. అర్థ రాత్రి 1.25 నిమిషాలకు ముగింపు మొదలై 2.22 నిమిషాలకు పూర్తయి పోతుంది. పూర్తి గ్రహణ వ్యవధి దాదాపుగా 5 గంటల 10 నిమిషాలు. ఏప్రిల్ 8 న ఈ సూర్యగ్రహణ సమయంలో దాదుగా 7 నిమిషాల 50 సెకన్ల పాటు సూర్యుడు పూర్తిగా కనిపించడు. అంటే ఈ సమయంలో సూర్యుడు పూర్తిగా అంతర్ధానమవుతాడు. అమెరికాలో చాలా ప్రాంతాల్లో ఈ సమయంలో చీకటి పడుతుంది.

అయితే ఈ గ్రహణ వేళల్లో భారత దేశంలో రాత్రి కాలం కనుక ఇక్కడ సూర్య గ్రహణం కనిపించదు. గ్రహణం కనిపించదు. కనుక గ్రహణ సూతకాలు, ఇతర నియమాలు కూడా మనకు వర్తించవని శాస్త్రం చెబుతోందని పండితులు నిర్దారిస్తున్నారు. కనుక ఈ గ్రహణ ప్రభావం కూడా మన ప్రాంతాల మీద నామమాత్రమే అని అంటున్నారు.

Also Read : Vastu Tips: ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే డబ్బే డబ్బు - ఆ దోషాలన్నీ తొలగిపోతాయ్!

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

టాప్ హెడ్ లైన్స్

19-10-2026 సోమవారం మకర, కుంభ, మీన రాశుల వారికి అదృష్టం, ధనలాభం, ఉద్యోగంలో ఉన్నతి!
19-10-2026 సోమవారం మకర, కుంభ, మీన రాశుల వారికి అదృష్టం, ధనలాభం, ఉద్యోగంలో ఉన్నతి!
19-10-2026 సోమవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలాలు: ఈ రోజు ధనయోగం, కొత్త అవకాశాలు!
19-10-2026 సోమవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలాలు: ఈ రోజు ధనయోగం, కొత్త అవకాశాలు!
19-10-2026 సోమవారం కర్కాటకం, సింహం, కన్యా రాశిఫలాలు: అఖండ ధనయోగం, అదృష్టం!
19-10-2026 సోమవారం కర్కాటకం, సింహం, కన్యా రాశిఫలాలు: అఖండ ధనయోగం, అదృష్టం!
19-10-2026 సోమవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: మహా నవమి రోజు శుభమా, సవాళ్లా?
19-10-2026 సోమవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: మహా నవమి రోజు శుభమా, సవాళ్లా?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Embed widget