Vastu Tips: ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే డబ్బే డబ్బు - ఆ దోషాలన్నీ తొలగిపోతాయ్!
కొన్ని సార్లు ఇంటి నిర్మాణాలను వాస్తును అనుసరించి మార్చుకోవడం సాధ్యపడకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఇంటి వాస్తు దోషాల ప్రభావాలను తగ్గించుకోవచ్చు.
ఇంట్లో ప్రతి విషయానికి వాస్తు అవసరమే. వాస్తు అంటే ఒక కట్టడం లోపల బయట ఎలా ఉండాలో వివరించే శాస్త్రీయ విధానం. ఇంట్లో వస్తువులు వాస్తు ప్రకారం అక్కడ సంపద కొలువుంటుంది. ఇంట్లో వాస్తు దోషాలుంటే ఇబ్బందులు తప్పకుండా ఎదురవుతాయి. ఇక్కడ ఇంట్లో వస్తువుల అమరికకు సంబంధించిన కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. వాస్తు పాటించి వస్తువులు అమర్చుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది.
ఇంట్లోని ప్రతి దిశలో ఎలాంటి వస్తువులు ఉండాలో వాస్తులో వివరణలు ఉన్నాయి. ఇంట్లోని ప్రతి మూల వాస్తు ప్రకారం లేకపోతే ఇంట్లో ప్రతికూలత వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితి కుటుంబ సభ్యుల మధ్య విబేధాలకు లేదా దారిద్ర్యానికి కారణం కాగలదు.
అటువంటి పరిస్థితులు ఎదురుకాకూడదని అనుకున్నపుడు ఒకే ఒక మార్గం వాస్తును అనుసరించడం. కొన్ని సార్లు ఇంటి నిర్మాణాలను వాస్తును అనుసరించి మార్చుకోవడం సాధ్యపడకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఇంటి వాస్తు దోషాల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. కొన్ని వాస్తు జాగ్రత్తలు క్రమం తప్పకుండా పాటించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందవచ్చు.
ఎలాంటి వాస్తు నియమాలు పాటిస్తే లక్ష్మి కొలువై ఉంటుందో తెలుసుకుందాం.
- ఇంట్లో ఆవరణలో తులసి మొక్క నాటి దాన్ని క్రమంగా పూజిస్తూండాలి. ప్రతిరోజూ నీళ్ల పోస్తూ మొక్కను జాగ్రత్తగా చూసుకుంటే ఇంట్లోకి సానుకూల శక్తి విస్తరిస్తుంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో వాస్తు దోషాలు చేరవు. తులసి పూజలందుకునే చోట తప్పక లక్ష్మి కొలువై ఉంటుంది.
- ప్రతి రోజూ సాయం సంధ్య వేళ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఆవునెయ్యితో దీపం వెలిగిస్తుంటే వాస్తు దోషాలు పీడించవు. ఆ దీప కాంతి ప్రతికూల శక్తిని నిరోధిస్తుంది.
- ఇంట్లో వంటగది తూర్పు దిక్కున ఆగ్నేయ మూలన ఉండాలి. అలా సాధ్యపడనపుడు కుండిలో తూర్పు వైపున ఒక తులసి మొక్కను పెంచవచ్చు. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లో వాస్తు దోషం వేదించదు. వంట గది సరైన దిశలో తిరిగి నిర్మించకుండా ఈ పరిహారం పాటించవచ్చు.
- ఇంట్లో తోట పెంచుకునే వారు తప్పకుండా ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. వాడిపోయిన పూలు, పండిపోయిన ఆకులు తోటలో రాలిపడి ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇవి ప్రతికూల శక్తిని ఆకర్శిస్తాయి. వాస్తు దోషాలుంటే వాటి ప్రభావం తీవ్రతరం చేస్తాయి. అందువల్ల తోట ప్రాంతం శుభ్రంగా ఉంచుకోవాలి.
- ఇంట్లో విరిగిపోయిన, పగిలి పోయిన లేదా ఉపయోగం లేని వస్తువులను ఉంచుకోవద్దు. ఇంట్లో చెత్తసామాన్లు పెరిగిపోకుండా శుభ్రంగా చక్కగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళీ చేరితే మొదటగా ఎదురయ్యేది వాస్తు సమస్యలు.
- ఇంట్లో నీటి పంపులన్నీ సరిగ్గా పనిచేసేలా జాగ్రత్త పడాలి. ఎక్కడి నుంచి కూడానీళ్లు కారిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ నీటి కుళాయిలు పాడయిపోయి నీళ్లు కారుతుంటే వెంటనే దాన్ని బాగుచేయించాలి. నీరు వృథా కాకుండా చూసుకోవాలి. ఇలా నీళ్లు వృథా కావడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
- మురుగు నీటి పారుదల ఉత్తరం లేదా తూర్పుదిశలో మాత్రమే ఉండాలి. ఈ జాగ్రత్త ఇంటి నిర్మాణ సమయంలో తప్పక పాటించాలి.
- సాయం సంధ్యలో తప్పకుండా ఇంటి ఆవరణలో దీపం వెలిగించాలి లేతా లైట్ వెలిగేలా జాగ్రత్త పడాలి. కాంతి సానుకూల శక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. సాయం సమయంలో ఇల్లు చీకటిగా ఉండకుండా జాగ్రత్త పడాలి.
- వంట చేసిన తర్వాత మొదటి ముద్ద గోమాతకు తినిపిస్తే ఆ ఇంట్లో తిండికి లోటు ఉండదు.
Also Read: అద్దంలో అలా చూసుకునే అలవాటుందా - అయితే మిమ్మల్ని ఈ దోషం వెంటాడుతుంది!