By: RAMA | Updated at : 15 Jan 2023 07:09 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pinterest
Sankranti Daanam 2023: భోగి, సంక్రాంతి రోజుల్లో చేసే మంచి పనులకు రెట్టింపు ఫలితం దక్కుతుందంటారు పండితులు. ముఖ్యంగా పితృదేవతల్ని ఆరాధించడం వల్ల...ఆయురారోగ్యాలతో జీవిస్తారని చెబుతారు. మరీ ముఖ్యంగా సంక్రాంతి రోజున దానధర్మాలు చేస్తే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నుంచి విముక్తి లభించడంతో పాటూ ఒంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుందంటారు. ఈ పండుగరోజు మహిళలు...పూలు, కుంకుమ, పండ్లు దానం చేయాలి.
Also Read: కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు కదా నిజమా - చేస్తే ఏమవుతుంది!
గుమ్మడి కాయ ఎందుకు దానం చేస్తారు
మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతికి శనిభగవానుడు. శని వాత ప్రధాన గ్రహమని శాస్త్రం చెబుతుంది. వాతమనేది నూనె లాంటి పదార్థాల వల్ల, గుమ్మడికాయ వంటి కాయల వల్ల తగ్గుతుంది. కాబట్టి ఆ రోజు నలుగుతో స్నానం చేసి శనీశ్వరుని ప్రీతి కోసం నువ్వులు, గుమ్మడి కాయలు దానం చేయాలని చెబుతారు.
బ్రహ్మాండానికి ప్రతీక గుమ్మడి పండు
గుమ్మడి పండు భూమండలానికి ప్రతీక..శ్రీ మహావిష్ణువు ఆది వరాహరూపంలో భూగోళాన్ని పైకి తీసుకొచ్చింది సంక్రాంతి రోజే..అందుకే భూమికి సంకేతమైన గుమ్మడి పండును దానం చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. కల్పం ఆరంభంలో భూలోకానికి ప్రళయం వచ్చి భూమి సముద్రంలో మునిగిపోయే సమయంలో శ్రీ హరి ఆది వారాహ రూపం ఎత్తి భూమిని ఈ రోజునే ఉద్ధరించాడు. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించింది ఈ వరాహరూపంలోనే. వరాహ స్వామి భూమిని ఉద్ధరించినందుకు సంకేతంగా గుమ్మడి పండు దానం చేస్తారు. శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మాండాన్ని దానం ఇస్తే ఎంత ఫలితం కలుగుతుందో..అంత పుణ్యం గుమ్మడి పండు దానం చెయ్యడం వల్ల కలుగుతుందని చెబుతారు.
Also Read: భోగి, సంక్రాంతికి ఇంటి ముందు గొబ్బిళ్లు ఎందుకు పెడతారు, ఆ పాటల వెనుకున్న ఆంతర్యం ఏంటి!
బలికి సంబంధించిన పండుగ
కేరళ ప్రాంతంలో బలి చక్రవర్తికి సంబంధించిన పండుగగా చేసుకుంటారు. దానగుణం ఉండడం వల్లే బలి చక్రవర్తి.. వామనుడిగా వచ్చిన శ్రీ మహావిష్ణువుకి మూడు అడుగులు దానం ఇచ్చేందుకు అంగీకరించాడు. ఆ ఫలితంగానే బలి పాతాళానికి వెళ్లిపోయాడు. బలి చక్రవర్తికి, శ్రీ విష్ణువును సంతృప్తి పరుస్తూ బ్రహ్మాండానికి గుర్తుగా గుమ్మడి పండు సంక్రాంతి రోజు దానం ఇస్తారు. గుమ్మడి పండు దానం ఇస్తే భూదానం చేసినంత ఫలితం వస్తుందంటారు.
ఏడాదికి నాలుగు సంక్రాంతులుంటాయి
1.ఆయన సంక్రాంతులు
2.విఘవ సంక్రాంతులు
3.షడశీతి సంక్రాంతులు
4.విష్ణుపదీ సంక్రాంతులు.
ఉత్తరాయణంలో మకరసంక్రాంతి, దక్షిణాయణంలో కర్కాటక సంక్రాంతి వస్తాయి
విఘవ సంక్రాంతులు వచ్చే కాలంలో రాత్రి, పగలు సమానంగా ఉంటుంది
ధనుర్మాస సంక్రాంతులను షఢశీతి సంక్రాంతులు అంటారు
వృశ్చిక, కుంభ, సింహ, వృషభ రాశులలో వచ్చే సంక్రాంతులు విష్ణుపదీ సంక్రాంతులు అని పిలుస్తారు
అయితే ఉత్తరాయణ ప్రారంభం నుంచి సూర్యుడి వెలుగు పెరుగుతూ అందరికీ ఓ కొత్తదనాన్ని ప్రసాదిస్తుంది. పంట చేతికంది రైతుల కళ్లలో ఆనందం ఉంటుంది. కొత్త బియ్యం, కొత్త బెల్లం, చెరకు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. అందుకే దాన ధర్మాలకు మకర సంక్రాంతి మరింత ప్రత్యేకం.
Tungnath Temple History: ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం - పరమేశ్వరుడి బాహువులు పడిన ప్రదేశం ఇది
Magha Pournami 2023: ఈ రోజు మాఘ పూర్ణిమ, ప్రాముఖ్యత ఏంటి - సముద్రం స్నానం ఎందుకు చేయాలి!
Horoscope Today 05th February 2023: ఈ రాశివారు తొందరపాటు తగ్గించుకోవాలి, వివాదాలకు దూరంగా ఉండాలి - ఫిబ్రవరి 5 రాశిఫలాలు
Maha Shivratri 2023 Panch Kedar Yatra: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి, ఒక్కటి దర్శించుకున్నా అదృష్టమే!
Maha Shivaratri 2023: శ్మశానంలో ఉంటారెందుకు స్వామి అని పార్వతి అడిగిన ప్రశ్నకు శివుడు ఏం చెప్పాడో తెలుసా!
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!