By: ABP Desam | Updated at : 25 Jan 2022 02:23 PM (IST)
Edited By: RamaLakshmibai
రుద్రాక్ష, నవరత్నాలు
శివపురాణం ప్రకారం రాక్షసరాజైన త్రిపురాసురుడు వరగర్వంతో దేవతలను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తుండేవాడు. దేవతలంతా పరమ శివుని మొరపెట్టుకున్నారు. త్రిపురాసుర సంహారం కోసం శక్తిమంతమైన అఘోరాస్త్రం పొందడానికి తీవ్రమైన తపస్సు చేశాడు శివుడు. తపస్సు కోసం సమాధిలోకి వెళ్లిన పరమశివుడు చాలా కాలం తర్వాత కళ్లు తెరిచినప్పుడు కొన్ని అశ్రు బిందువులు భూమి మీద పడ్డాయి. ఆ అశ్రువులే విత్తనాలుగా మారి రుద్రాక్ష వృక్షాలుగా మొలకెత్తాయని.. ఈ చెట్టు నుంచి వచ్చే ఫలాల్లో బీజాలనే రుద్రాక్షలంటారని చెబుతారు. ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా రుద్రాక్షకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలామంది శివ భక్తులు మెడలో మాలగా ధరించడం చూస్తూనే ఉంటాం. వీటిని ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని కొందరి భక్తుల నమ్మకం. అయితే ఇండో వెస్ట్రన్ కల్చర్ లో ఫ్యాషన్ కోసం కూడా రుద్రాక్షలు ధరించేవారి సంఖ్య ఎక్కువమంది ఉండడంతో వీటికి మరింత ప్రాముఖ్యత పెరిగింది.
Also Read: ఈ ముఖి రుద్రాక్ష ధరిస్తే ఐశ్వర్యం-అదృష్టం.. ఈ ముఖి రుద్రాక్ష వేసుకుంటే మృత్యుదోషం పోతుందట...
ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రుద్రాక్షలు వేసుకుంటున్నారు కానీ మీ జన్మనక్షత్రం ఆధారంగా రుద్రాక్ష వేసుకుంటే ఇంకా మంచి జరుగుతుందని చెబుతారు.
నక్షత్రం ధరించాల్సిన రుద్రాక్ష
అశ్వని నవముఖి
భరణి షణ్ముఖి
కృత్తిక ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి ద్విముఖి
మృగశిర త్రిముఖి
ఆరుద్ర అష్టముఖి
పునర్వసు పంచముఖి
పుష్యమి సప్తముఖి
ఆశ్లేష చతుర్ముఖి
మఖ నవముఖి
పుబ్బ షణ్ముఖి
ఉత్తర ఏకముఖి, ద్వాదశముఖి
హస్త ద్విముఖి
చిత్త త్రిముఖి
స్వాతి అష్టముఖి
విశాఖ పంచముఖి
అనురాధ సప్తముఖి
జ్యేష్ఠ చతుర్ముఖి
మూల నవముఖి
పూర్వాషాఢ షణ్ముఖి
ఉత్తరాషాఢ ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం ద్విముఖి
ధనిష్ట త్రిముఖి
శతభిషం అష్టముఖి
పూర్వాభాద్ర పంచముఖి
ఉత్తరాభాద్ర సప్తముఖి
రేవతి చతుర్ముఖి.
Also Read: రుద్రాక్ష చెట్టు ఇంట్లోనే పెంచుకోవచ్చు…ఎలాగో తెలుసా?
మీ నక్షత్రం, గ్రహస్థితి ఆధారంగా వినియోగించే నవరత్నాలకు బదులు రుద్రాక్షలు కూడా ధరించవచ్చట.
కెంపు ఏకముఖి, ద్వాదశముఖి
ముత్యం ద్విముఖి, ఏకాదశ ముఖి
పగడం త్రిముఖి, అష్టాదశ ముఖి
పచ్చ చతుర్ముఖి, త్రయోదశ ముఖి
పుష్యరాగం పంచ ముఖి, చతుర్దశ ముఖి
వజ్రం షణ్ముఖి, పంచ దశ ముఖి
నీలం సప్త ముఖి, షోడశ ముఖి
గోమేధికం అష్టముఖి, గౌరీ శంకర ముఖి
వైఢూర్యం నవ ముఖి, ఆష్టా దశ ముఖి.
ఇవన్నీ పలు సందర్భాల్లో జ్యోతిష్యులు చెప్పినవి, కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారం. దీన్ని విశ్వశించాలా వద్దా అన్నది మీ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.
Also Read: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Today Panchang 22 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, భానుసప్తమి ప్రత్యేక శ్లోకం
Horoscope Today 22 May 2022: ఈ రాశివారు దూకుడు తగ్గించుకోవాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 22 May 2022: భానుసప్తమి ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం, మీరున్నారా ఇందులో ఇక్కడె తెలుసుకోండి
Panakala Swamy Temple :ప్రసాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం
Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!
Weather Updates: ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి