Horoscope Today 24th May 2022: మంగళవారం ఈ రాశులవారికి జయాన్నిస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 24 May 2022: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి
2022 మే 24 మంగళవారం రాశిఫలాలు
మేషం
ఈ రాశివారు వ్యాపారంలో అభివృద్ధేందుకు అవకాశాలు పొందుతారు. గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. కుటుంబంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీరు మీ కెరీర్ గురించి చాలా కచ్చితంగా ఉంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారమవుతాయి. మీ పని తీరు మెరుగుపడుతుంది. బంధువులను కలుస్తారు.
వృషభం
ఈరోజంతా సంతోషంగా ఉంటారు.ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో అధిక లాభం వస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో సామరస్యంగా ఉంటారు. మీరు పిల్లల సమస్యల గురించి కొంచెం ఆందోళన చెందుతారు.ఈరోజు పాత మిత్రులను కలుస్తారు.
మిథునం
సమీపంలోని ప్రదేశానికి టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఓ శుభవార్త వింటారు. మీరు ఉన్నత విద్యలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో అధిక పని కారణంగా ఒత్తిడి ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. మీ మాటల మీద సంయమనం పాటించండి.
కర్కాటకం
విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు ఎవ్వరి నుంచీ ఎక్కువ ఆశించవద్దు. మనసులోనే ఏదో విషయంపై బాధపడతారు. జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. అధిక పని వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. టెన్షన్ పెరుగుతుంది.
సింహం
ఒక పెద్ద బాధ్యతను పూర్తి చేయడం అభినందనీయం. వైవాహిక జీవితం చాలా శృంగారభరితంగా ఉంటుంది. అనేక రకాల ఆలోచనలు ఒక్కసారిగా మనసులో పేరుకుపోతుంటాయి. నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. వ్యాపార లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించండి. ఇల్లు మారాలి అనుకుంటే మంచి రోజు.
కన్యా
ఈ రోజు మీకు చాలా మంచిరోజు. మీరు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇంటర్వ్యూ మీకు గొప్ప విజయాన్ని అందించగలదు. స్నేహితుడికి సహాయం చేస్తారు.స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Also Read: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే
తులా
కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. కార్యాలయంలో పని కారణంగా మీరు ఒత్తిడికి లోనవుతారు. గృహ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బాధ్యతను సులభంగా నిర్వర్తించగలుగుతారు. విద్యార్థులు చదువు విషయంలో చాలా సీరియస్‌గా ఉంటారు. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఈరోజు ఎవరికీ సలహా ఇవ్వకండి.
వృశ్చికం
గుర్తుతెలియని వ్యక్తుల వల్ల మీరు నష్టపోతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించకపోతే ఆ ప్రబావం మీ బడ్జెట్ పై పడుతుంది. మీ దినచర్యలో కొన్ని మార్పులు తీసుకురావడం మంచిది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానేయండి. విద్యార్థులు విజయం సాధించగలరు. అసభ్య పదాలు వాడవద్దు.
ధనుస్సు
మీ పనులు చాలా వరకు సులభంగా పూర్తవుతాయి. మీ ఆలోచల ప్రభావం మీ చుట్టూ ఉన్నవారిపై పడుతుంది. మీ సమర్థత పెరుగుతుంది. మంచి జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మకరం
ఒకరి మాటలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఒత్తిడికి లోనవుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అజాగ్రత్తగా ఉంటారు. అధిక పనిభారం కారణంగా ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామి కార్యకలాపాలను పర్యవేక్షించండి.
కుంభం
ఈ రోజు ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. ఓ శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి మీ పట్ల అంకితభావంతో ఉంటారు. ఈ రోజు యువకులు కొత్త ప్రేమ ప్రతిపాదనలను అందుకుంటారు. కొత్త ఖర్చులకు దూరంగా ఉండండి.
Also Read: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే
మీనం
అపరిచితులతో అనవసర డిస్కషన్ వద్దు. తొందరగా కోపం వచ్చేస్తుంది. ఏ పనినైనా వాయిదా వేసే ధోరణి మానుకోండి. మీరు కొన్ని పనుల కోసం పరుగెత్తవలసి ఉంటుంది. వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపగలుగుతారు. ఈరోజు సాధారణంగా ఉంటుంది.