IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT
IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK

Ramadan 2022: హిందువులకు కార్తీకమాసం, ముస్లింలకు రంజాన్- ఈ రెండింటి మధ్య సారూప్యతలివే

పిలిచే, కొలిచే దేవుడు వేరైనా అన్ని మతాల సారాంశం ఒక్కటే. అన్నిమతాలు ఒక్కటే అంతా భారతీయులమే అనే ఉద్దేశంతో రాసిన ఈ కథనంలో తప్పులు వెతకడం మానేసి.. ఆంతర్యాన్ని అర్థం చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది.

FOLLOW US: 

ఉపవాసం పాటించడం దాదాపు ప్రతిమతంలోనూ ఉంటుంది. హిందువుల పండుగల్లో దాదాపు 60శాతం పండుగలకు ఉపవాసం కాన్సెప్ట్ ఉంటుంది. పాటించడం-పాటించకపోవడం అనేది పూర్తిగా వారికి సంబంధించిన విషయం. అయితే భారీగా ఉపవాసం ఉండేదెప్పుడంటే మాత్రం కార్తీకమాసమే అని చెప్పాలి. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో నెల రోజులూ ఉపవాసం పాటించేవారున్నారు. కొందరు సోమవారం, మరికొందరు ఏకాదశికి మాత్రమే ఉపవాసం ఉంటారు. ఇంచుమించు ఇదే పద్ధతిలో ఉంటుంది ముస్లింలు ఆచించే రంజాన్ ఉపవాసం. 

కార్తీకమాసం-రంజాన్ మధ్య సారూప్యతలివే 

  • దీపావళి అమావాస్య మర్నాడు మొదలయ్యే పాడ్యమి నుంచి కార్తీకమాసం ప్రారంభం అయితే...నెలవంక కనిపించగానే రంజాన్ ఉపవాసాలు ప్రారంభమవుతాయి
  • కార్తీకమాసంలో తెల్లవారుజామున నిద్రలేచి పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తే.. రంజాన్ నెలరోజులూ తెల్లవారుజామునే నమాజ్ చేస్తారు.
  • కార్తీకమాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి చీకటిపడగానే నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేస్తారు. ముస్లింలు కూడా రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండి సాయంత్రానికి విరమిస్తారు.
  • శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం అయితే.. బైబిల్ ఉద్భవించిన మాసం రంజాన్
  • కార్తీకమాసంలో ఒక్కరోజు శివకేశవులను స్మరించినా స్వర్గలోక ప్రాప్తి అని హిందువుల విశ్వాసం... రంజాన్ నెల రోజులూ నరకద్వారాలు మూసివేసి స్వర్గ ద్వారాలు మాత్రమే తెరిచి ఉంటాయని ముస్లింల విశ్వాసం.
  • ఉపవాస సమయంలో ఆగ్రహావేశాలకు లోనుకాకుండా శాంతంగా, నిగ్రహంగా ఉంటారు. ఈ సందర్భంగా పేదలకు చేతనైన సాయం చేస్తారు.
  • ఉపవాసం చేస్తున్నన్ని రోజులు చెడ్డ వ్యక్తులకు, చెడు శక్తులకు దూరంగా ఉండాలని చెప్పడం ఏమతంలో అయినా అనుసరించే పద్ధతే.
  • ఏప్రిల్ 3 వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమైన రంజాన్ వేడుకలు.. 30 రోజుల పాటూ అంటే మే 3 వ తేదీన రంజాన్ తో పండుగ ముగుస్తుంది. 

Also Read: ఖురాన్ ఆవిర్భవించిన నెల ఇదే, మనసు-శరీరంలో మలినాల ప్రక్షాళణకే రంజాన్ ఉపవాస దీక్షలు
ఉపవాసం వెనుక తర్కం
ఉపవాసం అంటే దేవుడి కోసం ప్రాపంచికసుఖాలు వదిలివేయటం అని అర్థం. ఉపవాసం అంటే తపస్సు లాంటింది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆహారాన్ని, ఇతర కోర్కెలను త్యజించి పూర్తిగా దేవుడిపై దృష్టిసారించడం. అంటే బాహ్య ప్రపంచానికి దూరంగా అంతర్గత ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గరగా చేరుకోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే కార్తీకమాసం అయనా రంజాన్ అయినా ఉపవాసం అంటే దేవుడికోసం కాదు..ప్రతివ్యక్తిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగులోకి తరలివెళ్లడం. 

Also Read: సర్ప దోషాలన్నీ తొలగించే ఆలయం, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది

Also Read: హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి, పఠిస్తే కష్టాలెందుకు తీరుతాయి

Published at : 27 Apr 2022 04:42 PM (IST) Tags: ramadan 2022 ramadan mufti menk ramadan 2022 ramadan 2022 song ramadan songs 2022 ramadan vlog maher zain ramadan ramadan song ramadan vlog 2022 routine ramadan ramadhan vlog ramadan ramadan music ramadaan 2022 musique ramadan ramadan routine mufti menk ramadan ramadan daily vlog ramadhan tiba ramadan with mufti menk lagu ramadhan 2022 ramadan special 2022

సంబంధిత కథనాలు

Gyanvapi Mosque Row: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం

Gyanvapi Mosque Row: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Today Panchang 19th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి

Today Panchang 19th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి

Horoscope Today 19th May 2022: ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 19th May 2022:  ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు

GT vs RCB: అడకత్తెరలో ఆర్సీబీ! GTపై గెలిచినా దిల్లీ ఓడాలని ప్రార్థించక తప్పదు!

GT vs RCB: అడకత్తెరలో ఆర్సీబీ! GTపై గెలిచినా దిల్లీ ఓడాలని ప్రార్థించక తప్పదు!

Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!

Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!