అన్వేషించండి

Ram Navami 2026 Date : శ్రీరామ నవమి మార్చి 26 or 27? రాములోరి కళ్యాణం ఎప్పుడు?

Sri Rama Navami Date 2026: తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి తొమ్మిదో రోజు వచ్చే తిథి నవమి.. ఈ రోజు శ్రీరాముడి కళ్యాణం జరుపుకుంటారు.. ఈ ఏడాది తిథి విషయంలో గందరగోళం ఎందుకొచ్చింది?  

Sri Rama Navami 2026

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

2026లో శ్రీరామ నవమి విషయంలో గందరగోళం నెలకొంది. ఈ ఏడాది నవమి తిథి రెండు రోజులు ఉండడంతో ఏ రోజు కళ్యాణం జరుపుకోవాలి అనే సందిగ్ధం నెలకొంది. 

గంటల పంచాంగం ప్రకారం..

నవమి తిథి ప్రారంభం - మార్చి 26 గురువారం మధ్యాహ్నం 2 గంటల 27 నిముషాలకు

నవమి తిథి ముగింపు - మార్చి 27 శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 32 నిముషాలు

పునర్వసు నక్షత్రం - మార్చి 26 రాత్రి 7 గంటల 3 నిముషాల నుంచి... మార్చి 27 శుక్రవారం సాయంత్రం 5 గంటల 44 నిముషాల వరకు

సాధారణంగా పండుగలు నిర్వహించుకునేందుకు సూర్యోదయం తిథిని పరిగణలోకి తీసుకుంటారు...ఈ లెక్కన నవమి తిథి మార్చి 27 శుక్రవారం ఉంది, సీతారాముల కళ్యాణం కూడా అభిజిత్ లగ్నం మధ్యాహ్నం సమయంలో ఉంటుంది అందుకే ఎలాంటి సందేహం లేకుండా మార్చి 27 శుక్రవారమే శ్రీరామకళ్యాణం అని పంచాంగకర్తలు చెబుతున్నారు.

సీతారాముల కళ్యాణానికి మధ్యాహ్నం అభిజిత్ లగ్నం ప్రధానం... రాముడు జన్మించిన సమయం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో ఉందని చెబుతారు. కచ్చితమైన జన్మ క్షణం సుమారు 12 గంటల 22 నిముషాలు. మధ్యాహ్న సమయంలోనే శ్రీరాముడు పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పూజ, అభిషేకం, హోం, సీతారాముల కళ్యాణం..అభిజిత్ ముహూర్తంలో నిర్వహిస్తారు.  ఈ లెక్కన 12 గంటల సమయంలో నవమి ఉన్న రోజు కూడా మార్చి 27 శుక్రవారమే. అందుకే సీతారాముల కళ్యాణం, పూజ, హోమంకి అత్యుత్తమం మార్చి 27 శుక్రవారం. స్థానిక సంప్రదాయాలు, స్థానిక ఆలయాలు ఆధారంగా కూడా వీటిలో మార్పులుంటాయి. 
 
ధర్మ బద్ధ జీవనానికి నిర్వచనం శ్రీరాముడు. మనిషిగా ఎలా బ్రతకాలో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి చూపించిన పురుషోత్తముడు రామచంద్రుడు. అందుకే 'రామస్య ఆయన రామాయణం' అని అంటారు. అయనము అంటే నడక, రామాయణం అంటే రాముడి నడక అని అర్థం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రామావతారంలో మినహా మిగిలిన ఏ అవతారంలోనూ అయనము అనే మాట వినియోగించలేదు. ఎందుకంటే పరిపూర్ణమైన మానవుడి అవతారం రాముడు. అందుకే కృష్ణావతారంలో శ్రీ కృష్ణుడు తానే నారాయణుడిని అని చెప్పుకున్నాడు కానీ రామావతారంలో రాముడు తానే దేవుడిని అని ఎక్కడా చెప్పలేదు. రాముడు అడుగు తీసి అడుగేస్తే ధర్మం..ఆయన ప్రతి అడుగు సత్యం..రాముడి కదలికకు అంత ప్రధాన్యం.. అందుకే  “రామో విగ్రహవాన్ ధర్మః ” అన్నారు .

శ్రీరామ నవమి రోజు రాముడిని పూజించడం భక్తులకు ఆనందం, శాంతిని అందిస్తుంది. ఈ పండుగను దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆయన జన్మించిన అయోధ్యలో, రామయ్య కొలువైన భద్రాద్రిలో ఘనంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రామాలయంలోనూ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి.  

 శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget