ఆది వినాయక దేవాలయం: భారతదేశంలో ఈ ఏకైక దేవాలయంలో గణేశుడు మానవ శిరస్సుతో కొలువుదీరారు!
Naramukha Ganapathi Temple Significance: వినాయకుడు అనగానే తొండంతో బొజ్జగణపయ్య రూపం కళ్లముందు కనిపిస్తుంది. కానీ ఇక్కడ వినాయకుడు మానవ ముఖంతో దర్శనమిస్తారు.

Adi Vinayaka Temple: ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ ఆగస్టు 27, 2025 బుధవారం నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. వినాయకుడు, విఘ్నాధిపతిగా పిలుస్తారు, కొలుస్తారు. నిత్యం ఆయన్ను స్మరిస్తారు. అయితే ఆ రూపాన్ని తలుచుకోగానే పొడవైన తొండం , ఏనుగు తల కలిగిన దేవుని రూపం కనిపిస్తుంది. కానీ భారతదేశంలో మానవ శిరస్సుతో కొలువై ఉన్న ఏకైక గణేష్ ఆలయం కూడా ఉందని మీకు తెలుసా?
గణపతి ఆలయం తమిళనాడులోని తిలతర్పన్‌పురిలో ఉంది. ఈ ఆలయం పేరు ఆది వినాయకర్. ఈ ఆలయంలో వినాయకుడు అసలు రూపంలో కొలువై ఉన్నారు. ఆది వినాయకర్ ఆలయంలో గణేష్ ఏనుగు తల కలిగిన దేవుడు కాదు, మానవ శిరస్సుతో కొలువై ఉన్నాడు. వాస్తవానికి, ఆలయంలో ప్రతిష్టించిన గణేష్ విగ్రహం, పార్వతీ దేవి గణపతి మహారాజుకు ఏనుగు తలను అమర్చడానికి ముందు చేసిన అసలు రూపాన్ని చూపిస్తుంది.
ఈ అరుదైన చిత్రం ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. నమ్మకాల ప్రకారం, ఇక్కడ చేసే ప్రార్థనల ద్వారా అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి. జీవితంలో కొత్త ప్రారంభానికి ఆశీర్వాదం లభిస్తుంది.
పితృ సంస్కారాలు చేసేందుకు పవిత్రస్థలం
ఈ ఆలయంలో పితృ సంస్కారాలు చేసేందుకు పవిత్రస్థలంగా భావిస్తారు. పురాణాల ప్రకారం రామచంద్రుడు తన తండ్రి దశరథుడి కోసం ఈ ఆలయంలో అనుష్ఠానం చేశాడు. ఆలయంలోపల వినాయకుడి విగ్రహం 5 అడుగుల పొడవు ఉంటుంది, ఆయనను పాములతో అలంకరించారు, చేతుల్లో గొడ్డలి, తాడు, తామర, మోదక్ ఉన్నాయి. ఈ రూపం శక్తి, పవిత్రత ఆధ్యాత్మికతకు ప్రతీక.
గణేష్ చతుర్థి - మహాశివరాత్రి ప్రత్యేకం
గణేష్ చతుర్థి , మహా శివరాత్రి వంటి పండుగలలో ఇక్కడ కన్నులపండువగా ఉత్సవాలు జరుగుతాయి . దీనితో పాటు ప్రతి గురువారం ఆలయంలో ఆది వినాయకుడికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు.
ఆది వినాయక ఆలయం మీరు గణపతిని ఆయన అసలు రూపంలో కలుసుకునే ప్రదేశం. మానవ ముఖంతో మీరు ఆయనను దర్శించుకుంటారు. వీలైతే, ఈ గణపతిని దర్శించుకోవడానికి ఆది వినాయక ఆలయానికి వెళ్ళండి.
నరముఖ గణపతి ఆలయం తమిళనాడు కూతనూరు సరస్వతీ ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో , తిరునల్లార్ శనీశ్వరుడి ఆలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. పితృదోషాలు ఉంటే జీవితంలో సరైన పురోగతి ఉండదు. అందుకే ఈ నరముఖ గణపతి ఆలయాన్ని దర్శించుకుంటే పితృదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి ఇచ్చినది మాత్రమే. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
వినాయక చవితి పూజా విధానం - పసుపు గణపతి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పసుపు గణపతి పూజ తర్వాత మీరు తీసుకొచ్చిన గణేష్ విగ్రహానికి పూజ చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వినాయక చవితి రోజు చదవాల్సిన కథలు సంస్కృతంలో కాకుండా మీకు అర్థమయ్యేలా చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















