అన్వేషించండి

నంది చెవిలో కోర్కెలు చెబితే శివుడిని ఎలా చేరుతాయ్? మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఆధ్యాత్మిక రహస్యం!

Spiritual News: శివాలయంలో నందిచెవిలో కోర్కెలు చెబితే అవన్నీ నెరవేరుతాయా? ఇందులో నిజమెంత? అసలు నంది చెవిలో ఎందుకు చెప్పాలి? దీనివెనుకున్న పురాణ కథ ఏంటి?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నంది చెవిలో కోరికలు చెప్పడం భక్తుల ప్రధాన నమ్మకం.
  • వినాయకుడు నంది ద్వారా శివునికి జలంధరుడి విషయం చేరవేశాడు.
  • నంది శివుని నమ్మకమైన దూత, భక్తుల సందేశాలను చేరుస్తుంది.
  • పూర్తి విశ్వాసంతో చేసిన ప్రార్థనలు మాత్రమే ఫలితాన్నిస్తాయి.

Shiva: శివాలయాన్ని సందర్శించే భక్తులు శంకరుడి ముందు కళ్లమూసుకుని నిలబడి ప్రార్థించి.. ఆ తర్వాత నంది కొమ్ముల మధ్యనుంచి దర్శనం చేసుకుని.. నంది చెవిలో గుసగుసలాడుతారు. తమ మనసులో ఉండే కోర్కెలు నంది చెవిలో చెబితే..భోళా శంకరుడు తీర్చుతాడని భక్తుల విశ్వాసం. ఈ సంప్రదాయం ఎంతోకాలం నుంచి కొనసాగుతోంది. 

ఓసారి శివుడు , పార్వతి, నంది ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో జలంధరుడు అనే రాక్షసుడు పార్వతిని అపహరించాలని ప్రయత్నం చేశాడు. ఈ చర్య ముందుగానే తెలుసుకున్న వినాయకుడు తండ్రికి చెప్పాలి అనుకున్నాడు. కానీ వినాయకుడు, ఇతర దేవతలు ఎవ్వరూ కూడా ధ్యానంలో ఉన్న రుద్రుడి దగ్గరకు వెళ్లేందుకు సాహసం చేయలేదు. అప్పుడు నంది చెవిలో ఆ విషయం చెబితే కచ్చితంగా శివుడిని చేరుతుందని భావించాడట వినాయకుడు. అలా జలంధరుడి విషయం నంది ద్వారా శివుడికి చేరవేశాడు వినాయకుడు, అప్పటి నుంచి నందిచెవిలో ఏం చెప్పినా శివయ్యను చేరుతుందనే నమ్మకం బలపడిందనే పురాణ కథ ప్రచారంలో ఉంది

నంది చెవిలో చెబితే కోర్కెలు నిజంగా నెరవేరుతాయా?

ఆధ్యాత్మిక దృక్పథంలో చూస్తే ఇందులో లోతైన అర్థం దాగిఉంది. నంది శివుడి వాహనం మాత్రమే కాదు పరమేశ్వరుడికి అత్యంత సన్నిహిత భక్తుడు, ద్వారపాలకుడు, నమ్మకమైన దూత. పురాణాల ప్రకారం నంది..శివుడు ధ్యానం చేసే సమయంలో భక్తుల ప్రార్థనలు అందించే మద్యవర్తి. సదా ధ్యానంలో మునిగిఉండే శివుడికి భంగం కలిగించకుండా భక్తులను నిరాశపర్చకుండా ఆ సందేశాలను నంది చేరవేరుస్తాడని నమ్మకం. 

ఆధ్యాత్మికంగా చూస్తే నంది..జీవాత్మకు ప్రతీక. ఎప్పుడూ శివుడివైపే చూస్తూ కనిపించే నంది ఏకాగ్రతకు ప్రతీక. 

మన కోర్కెలు నంది చెవిలో చెప్పడం అంటే.. మన అస్థిరమైన మనస్సును స్థిరమైన భక్తి వద్ద ఉంచి దైవసన్నిధికి సమర్పించడమే

శివుడు అగ్నితత్వం..ఆయన ధ్యానం లోకకళ్యాణం కోసం.. అందుకే భక్తులు నేరుగా ఆయన్ను భంగపరచకుండా నందిద్వారా సందేశం పంపించడం సంప్రదాయమైన మర్యాద.
 
నంది కథ అత్యంత ప్రేరణాత్మకం.. ఎందుకంటే నంది మొదట్లో సాధారణ జీవి. కానీ శివుడి పట్ల అపారమైన భక్తి, సేవ, విధేయతతో దైవిక స్థాయికి ఎదిగాడు. శివుడు నందిని తన వాహనంగా, గురువుగా, సహచరుడిగా ఆశీర్వదించాడు. నిజమైన భక్తి, సమర్పణతో ఏ జీవి అయినా దైవ సన్నిధికి చేరవచ్చని సూచించే పాఠం ఇది.

నంది చెవిలో కోర్కెలు చెబితే నెరవేరుతాయా అంటే అది రహస్యంగా, భక్తితో చేయాలి. పరీక్ష పెట్టేందుకో, యాంత్రికంగానో చేస్తే ఆ కోర్కె నెరవేరదు. పూర్తి విశ్వాసంతో చేస్తేనే ఫలితం ఉంటుంది. ఈ చర్య మనలో అహంకారాన్ని వదిలించి..దైవంపై ఆధారపడడానికి సహాయపడుతుంది. మన కోర్కెలు నెరవేరడం అంటే ఆచారం మాత్రమే కాదు..కర్మ, ప్రయత్నం, సమయం దైవానుగ్రహంపై ఆధారపడి ఉంటుంది. తద్వారా మనసును శాంతపరిచి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇది విజ్ఞానం, ఆధ్యాత్మికత కలయిక. నమ్మకం మన మనసును బలోపేతం చేసి కోర్కెలు సాధించడానికి ప్రేరణ ఇస్తుంది. కానీ హందూ ధర్మం ప్రకారం భక్తి ద్వారా మనం దైవంతో ఏకం అవుతాం. నంది అనే గురువుద్వారా శివతత్వాన్ని అర్థం చేసుకుంటాం.  

ఆధ్యాత్మికవేత్తలు చెప్పేదేంటంటే.. నిజమైన ఫలితం భక్తి, నిస్వార్థ సేవ, ధర్మం నుంచి వస్తుంది. కోరిన కోర్కెలు నెరవేరడం అంటే ఆ కోర్కెలను దైవం చేతుల్లో పెట్టడం ద్వారా మనం పొందే శాంతి, సంతృప్తి గొప్పది.  

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.

Frequently Asked Questions

శివాలయంలో భక్తులు నంది చెవిలో ఎందుకు గుసగుసలాడుతారు?

భక్తుల విశ్వాసం ప్రకారం, తమ కోరికలు నంది చెవిలో చెబితే శివుడు వాటిని తీరుస్తాడు. వినాయకుడు జలంధరుడి విషయం నంది ద్వారా శివుడికి చేరవేశాడని పురాణ కథ చెబుతుంది.

శివారాధనలో నంది పాత్ర, ప్రాముఖ్యత ఏమిటి?

నంది శివుని వాహనం, ద్వారపాలకుడు, నమ్మకమైన దూత. ఆయన ఆధ్యాత్మికంగా జీవాత్మకు, ఏకాగ్రతకు ప్రతీకగా నిలుస్తాడు. భక్తుల సందేశాలను శివుడికి చేరవేసే మధ్యవర్తిగా కూడా నందిని భావిస్తారు.

నంది చెవిలో కోరికలు చెబితే అవి నిజంగా నెరవేరుతాయా?

ఇది విశ్వాసం, భక్తితో కూడిన ఆచారం. రహస్యంగా, పూర్తి నమ్మకంతో చేస్తేనే ఫలితం ఉంటుంది. ఇది అహంకారాన్ని తగ్గించి దైవంపై ఆధారపడటానికి సహాయపడుతుంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

గురువారం కృష్ణాష్టకం: చదువు, ఉద్యోగంలో వెలగాలంటే ఈ ఒక్కటీ పాటించండి!
గురువారం కృష్ణాష్టకం: చదువు, ఉద్యోగంలో వెలగాలంటే ఈ ఒక్కటీ పాటించండి!
వారణాసిలో గంగానది ఒడ్డున అజ్ఞాత భిక్షువు! మీరెవరో తెలుసంటూ కాళ్లు వదలని వ్యక్తి! ఇంతకీ ఎవరా మహానుభావుడు?
వారణాసిలో గంగానది ఒడ్డున అజ్ఞాత భిక్షువు! మీరెవరో తెలుసంటూ కాళ్లు వదలని వ్యక్తి! ఇంతకీ ఎవరా మహానుభావుడు?
Guru Purnima 2026: ఏం చేసినా కలసిరావడం లేదా? గురు పౌర్ణమి రోజు సులభమైన ఈ పరిహారం చేయండి!
ఏం చేసినా కలసిరావడం లేదా? గురు పౌర్ణమి రోజు సులభమైన ఈ పరిహారం చేయండి!
Guru Purnima 2026: గురు పౌర్ణమి పూజా విధానం! ఈరోజు ఈ 7పనులు చేస్తే సంపద, విజయం, అదృష్టం మీ సొంతం!
గురు పౌర్ణమి పూజా విధానం! ఈరోజు ఈ 7పనులు చేస్తే సంపద, విజయం, అదృష్టం మీ సొంతం!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget