News
News
వీడియోలు ఆటలు
X

June 2022 Festivals : జూన్ నెలలో ముఖ్యమైన పండుగలు ఇవే

జూన్ నెలలో నిర్జల ఏకాదశి, గంగా దసరా, ఏరువాక పూర్ణిమ, వృషభ పూజ సహా చాలా ముఖ్యమైన రోజున్నాయి. 2022 జూన్ మాసంలో ఏయే రోజుల్లో ఏయే పండుగలు ఏ రోజుల్లో ఇక్కడ తెలుసుకోండి.

FOLLOW US: 
Share:

2022 జూన్ నెలలో పండుగలు 
జూన్ 2 రంభావ్రతం
జూన్ 7 శుక్లాదేవి పూజ
జూన్ 8 మృగశిర కార్తె ప్రారంభం
జూన్ 9 దశపాపహర దశమి, రామేశ్వర ప్రతిష్ట
జూన్ 10 నిర్జల ఏకాదశి
జూన్ 11 రామలక్ష్మణ ద్వాదశి
జూన్ 14 ఏరువాక పూర్ణిమ, వృషభ పూజ
జూన్ 15 మిథున సంక్రాంతి
జూన్ 17 సంకటహర చతుర్థి
జూన్ 22 ఆరుద్ర కార్తె ప్రారంభం
జూన్ 24 మతత్రయ ఏకాదశి
జూన్ 25 కూర్మ జయంతి
జూన్ 27 మాసశివరాత్రి
జూన్ 28 వటసావిత్రి వ్రతం
జూన్ 30 చంద్రదర్శనం

Also Read: జూన్ 10న నిర్జల ఏకాదశి, ఈ నియమాలు పాటిస్తే ఆర్థిక, అనారోగ్య సమస్యలుండవ్

రంభావ్రతం
ఈ నెలలో రంభ తృతీయ జూన్ రెండో తేదీన గురువారం వచ్చింది. ఈ పవిత్రమైన రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు మరియు పిల్లల శ్రేయస్సు కోసం అరటిచెట్టుకి పూజ చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఏటా జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

గంగా దసరా
హిందూ పంచాంగం ప్రకారం దశపాపహర దశమిని జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని పదో రోజున జరుపుకుంటారు. ఈరోజున గంగా మాతను పూజించడం, గంగాస్నానం చేయడం ఉత్తమం అంటారు. ఈ ఏడాది దశపాపహర దశమి జూన్ 9న వచ్చింది. ఇదే రోజు రామేశ్వర ప్రతిష్ట కూడా.

నిర్జల ఏకాదశి
ఈ పర్వదినం రోజు చుక్క నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. అందుకే నిర్జల ఏకాదశి అంటారు. నిర్జల ఏకాదశి ఈ ఏడాది జూన్ 10 శుక్రవారం వచ్చింది. ఈ రోజు ఉపవాసం చేయాలి, నేలపైనే నిద్రించాలి, మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పూజచేయాలి. అష్టాక్షరి మంత్రం  "ఓం నమో భగవతే వాసుదేవాయ" అని జపించాలి. అనంతరం ఏకాదశికి సంబంధించిన కథ చెప్పుకుని హారతివ్వాలి. అతిథులను పిలిచి భోజనం పెట్టడం, బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సహా దాన ధర్మాలకు ఇదే సరైన రోజు అని పండితులు చెబుతారు.

వట సావిత్రి వ్రతం..
మన దేశంలోని చాలా ప్రాంతాల్లో జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో పౌర్ణమి రోజున వటసావిత్రి వ్రతం ఆచరిస్తారు. ఈరోజున వివాహిత స్త్రీలు రోజంతా ఉపవాసం ఉండి, తమ భర్త దీర్ఘాయువు పొందేందుకు రావి చెట్టును పూజిస్తారు. జూన్ 28న వటసావిత్రి వ్రతం ఆచరించనున్నారు. లక్ష్మీ నారాయణులుగా  లేదా శివ పార్వతులుగా భావించి ఐదు పోగుల దారాలను చుట్టూ తిరుగుతూ చుట్టి, పసుపు గౌరమ్మకు పూజ చేయాలి. ఈ వ్రతం మరో ప్రత్యేకత ఏమిటి అంటే ఈ కారణం వల్ల అయినా సరే భార్య ఈ వ్రతాన్ని ఆచరించలేని అనారోగ్య స్థితిలో ఉంటే సంకల్పం చేసి ఆమెను కర్తగా పెట్టి భర్త అయినా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.

మాస శివరాత్రి..
ప్రతి నెలా కృష్ణపక్షం చతుర్దశి తిథిని మాస శివరాత్రి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడికి ప్రత్యేక ప్రజలు చేస్తారు.  జూన్ నెలలో 27న మాస శివరాత్రి వచ్చింది.

Also Read: జూన్ నెలలో ఈ ఆరు రాశులవారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు

Also Read: ఆరోగ్యం, ఆనందం, ఆదాయం-జూన్ నెలలో ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది

Published at : 04 Jun 2022 07:25 AM (IST) Tags: masa shiva ratri vata savitri vratam nirjala ekadasi Festivals in June 2022

సంబంధిత కథనాలు

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి

చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి

Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!

Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు