అన్వేషించండి

Nirjala Ekadashi 2022: ఈ రోజు నిర్జల ఏకాదశి, ఈ నియమాలు పాటిస్తే ఆర్థిక, అనారోగ్య సమస్యలుండవ్

జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ రోజు వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజిస్తే జీవితకాలానికి సరిపడా పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం.

సనాతన ధర్మంలో 24 ఏకాదశుల గురించి ప్రస్తావన ఉంది. అధికమాసం వచ్చినట్టైతే అప్పటికి మరో రెండు కలపి మొత్తం 26 ఏకాదశలు వస్తాయి. తిథుల్లో ఏకాదశి ఎప్పుడూ శుభప్రదమే.మరి నిర్జల ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే...ఈ రోజు ఉపవాసం ఉండి వ్రతమాచరిస్తే 24 ఏకాదశుల్లో పుణ్యఫలం ఈ ఒక్కరోజే దక్కుతుందట.ఏటా జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి రోజు ఈ నిర్జల ఏకాదశి జరుపుకుంటారు. 

​భీమసేన ఏకాదశి అని కూడా అంటారు
ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలను జయించేందుకు ఏకాదశి రోజు ఉపవాసాన్ని ఆచరించాలని మహర్షి వేదవ్యాసుడు పాండవులకు చెప్పాడు. వెంటనే స్పందించిన భీముడు వినయంతో వ్యాసుడికి నమస్కరిస్తూ.. "స్వామి మీరు ప్రతి పదిహేను రోజులకోసారి వచ్చే ఏకాదశికి ఉపవాసం ఉండాలని చెబుతున్నారు. నేను ఒక్క రోజు కూడా తినకుండా ఉండనలేను. మరి ఏకాదశి రోజు తినకుండా వ్రతం ఎలా ఆచరించగలను" అని భీముడు.. వ్యాసుడిని అడిగాడు. అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పాడు... "ఓ కుంతీనందనుడా..నువ్వు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కేవలం జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి ఒక్క రోజు ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశుల పుణ్యఫలం దక్కుతుందన్నాడు. అప్పటి నుంచి ఏటా నిర్జల ఏకాదశి రోజు మాత్రమే భీముడు ఉపవాసం ఉండటంతో భీమసేన ఏకాదశి అనికూడా అంటారు.

Also Read: ఇంట్లో లక్ష్మీదేవి, కృష్ణుడు, ఆంజనేయుడి ఫొటోలు ఎలాంటివి ఉండాలంటే!

జూన్ 10న నిర్జల ఏకాదశి
ఈ పర్వదినం రోజు చుక్క నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. అందుకే నిర్జల ఏకాదశి అంటారు. నిర్జల ఏకాదశి ఈ ఏడాది జూన్ 10 శుక్రవారం వచ్చింది. ఈ రోజు ఉపవాసం చేయాలి, నేలపైనే నిద్రించాలి, మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పూజచేయాలి. అష్టాక్షరి మంత్రం  "ఓం నమో భగవతే వాసుదేవాయ" అని జపించాలి. అనంతరం ఏకాదశికి సంబంధించిన కథ చెప్పుకుని హారతివ్వాలి. అతిథులను పిలిచి భోజనం పెట్టడం, బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సహా దాన ధర్మాలకు ఇదే సరైన రోజు అని పండితులు చెబుతారు. నిర్జల ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని, ఆర్థిక సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం. 

బ్రహ్మోవాచ
నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే ।
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః ॥ 
శ్రీ సహస్రకోటీ యుగధారిణే నమ ఓం నమ ఇతి ।

Also Read: జూన్ నెలలో ఈ ఆరు రాశులవారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు

Also Read: ఆరోగ్యం, ఆనందం, ఆదాయం-జూన్ నెలలో ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది

టాప్ హెడ్ లైన్స్

16-10-2026 శుక్రవారం మకర, కుంభ, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
16-10-2026 శుక్రవారం మకర, కుంభ, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
16-10-2026 శుక్రవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయ్?
16-10-2026 శుక్రవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయ్?
16-10-2026 శుక్రవారం కర్కాటకం, సింహం, కన్య రాశుల వారికి ఎలా ఉండబోతోంది?
16-10-2026 శుక్రవారం కర్కాటకం, సింహం, కన్య రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది?
16-10-2026 శుక్రవారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథున రాశుల వారికి అదృష్టం, ధనలాభం!
16-10-2026 శుక్రవారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథున రాశుల వారికి అదృష్టం, ధనలాభం!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget