అన్వేషించండి

Makar Sankranti 2024 Wishes: మకర సంక్రాంతి శుభాకాంక్షలు - మీ బంధుమిత్రులకు చెప్పేయండిలా!

Makar Sankranti 2024 Wishes: ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ బంధుమిత్రులకు కూడా ఈ కొటేషన్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..

Makar Sankranti 2024 Wishes Quotes:  సంక్రాంతి అంటే నూతన క్రాంతి. ధనస్సు రాశి నుంచి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. సంక్రాంతి, పొంగల్, మాఘి పేరేదైనా సందడి ఒకటే. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవా, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో హిందువులు, సిక్కులు ప్రముఖంగా జరుపుకునే పండగ ఇది. ఆంధ్రులకు సంక్రాంతి పెద్ద పండుగ అయితే..తెలంగాణ వాసులకు సంక్రాంతి రెండో పెద్ద పండుగ. ఈ వేడుకల్లో మీతో పాటూ  మీ ఆత్మీయులను భాగస్వామ్యం చేసేలా, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు, మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు ఈ కొటేషన్స్ తో చెప్పేయండి..

Also Read: సంక్రాంతి వేళ మీ ఇంటిముందుకొచ్చిన శివుడు, శ్రీ మహావిష్ణువుని నిర్లక్ష్యం చేయకండి!

మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..

సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో 
ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ..
 సంక్రాంతి శుభాకాంక్షలు

మీ ఇల్లు ఆనందనిలయమై
సుఖసంతోషాలతో నిండి ఉండాలని కోరుకుంటూ
సంక్రాంతి శుభాకాంక్షలు!!

Also Read: భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేండి!

ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

ఆ గాలిపటంలా ఉన్నతంగా ఎగిరే మన ఘనత
జీవితాన్ని రంగులమయం చేసే అచ్చమైన వేడుక మన సంక్రాతి 
మీకు , మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!

నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు
మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు
పంచెకట్టులు, పందెంకోళ్లు
హరిదాసులు, డూడూ బసవన్నలు
తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేస్తే అందమైన వేడుక
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!

Also Read: మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను - సంక్రాంతి సంబరాన్ని రెట్టింపు చేసే గొబ్బిళ్ల పాటలివే!

ఆకుపచ్చని మామిడి తోరణాలు
పసుపు పచ్చని మేలిమి సింగారంతో మెరిసే గడపలు
ముంగిట్లో ముగ్గులు, అందమైన గొబ్బెమ్మలు
ఇంటికి తరలివచ్చే ధాన్యపురాశులు
సంక్రాంతి శుభాకాంక్షలు!

ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త కాంతిని నింపాలని కోరుకుంటూ..
మీ అందరకీ సంక్రాంతి శుభాకాంక్షలు.

ఈ సంక్రాంతికి మీ జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించండి
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!

పాలలోని తెల్లదనం
చెరుకులోని తియ్యదనం
ముగ్గులోని రంగుల అందం
పండగ నాడు మీ ఇంట్లో వెల్లివిరియాలి ఆనందం
సంక్రాంతి శుభాకాంక్షలు!

తరిగిపోని ధాన్యపురాశులతో.. 
తరలివచ్చే సిరిసంపదలతో.. 
తిరుగులేని అనుబంధాల అల్లికలతో..
మీ జీవితం ఎప్పుడు దినదినాభి వృద్ధి చెందాలని కోరుతూ
సంక్రాంతి శుభాకాంక్షలు!

ఆకాశంలోకి దూసుకెళ్లే పతంగులు
ఉత్సాహాన్ని పెంచే కోడిపందాలు
ధాన్యపు రాశులతో నిండిపోయే గాదెలు
డూడూ బసవన్నల దీవెనలు
కీర్తనలు పాడే హరిదాసులు..
తనివి తీరని వేడుక
సంక్రాంతి శుభాకాంక్షలు..

Also Read: సంక్రాంతి ముగ్గుల్లో గొబ్బిళ్ల సందడెందుకు!

భోగి మీకు భోగభాగ్యాలను
సంక్రాంతి మీకు సుఖసంతోషాలను
కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని  కోరుకుంటూ…
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ..
మన సంప్రదాయన్ని విశ్వమంతా తెలుపుతూ..
పల్లె అందాలను ప్రపంచానికి చూపుతూ..
సంక్రాంతి పండుగను జరుపుకోండి..
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!

కళకళలాడే ముంగిట రంగవల్లులు..
బసవన్నల ఆటపాటలు..
తెలుగువారికి సొంతమైన ఆచారాలు..
మీకు సంతోషాన్ని పంచాలి ఈ సంక్రాంతి.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

వణికే చలిలో భోగిమంటలు..
కొత్త బట్టల కోసం ఎన్నో అలకలు..
మదిలో మెదిలో మధుర స్మృతులు..
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!

జంట సన్నాయి మేళం..
జోడు బసవన్నల తాళం..
మీ ఇంట నింపాలి ఆనంద కోలాహలం
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మీ భవిష్యత్ మరింత ఉండాలని మనసారా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు ఏబీపీ దేశం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు

టాప్ హెడ్ లైన్స్

15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget