(Source: ECI/ABP News/ABP Majha)
Mahalaya Amavasya 2023: మహాలయ అమావాస్య సమయంలో ఇంట్లో నుంచి ఈ 3 వస్తువులు తీసేయండి
Mahalaya Amavasya 2023: మరణించిన వ్యక్తుల వస్తువులు ఉపయోగించకూడదని గ్రంధాలలో పేర్కొన్నారు. మహాలయ అమావాస్య సందర్భంగా పూర్వీకులు ఉపయోగించిన ఈ వస్తువులను ఇంటి నుంచి తొలగించండి.
Mahalaya Amavasya 2023: హిందూ ధర్మం ప్రకారం, పితృ పక్షం చాలా ముఖ్యమైన కాలంగా పరిగణిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, పితృ పక్షం భాద్రపద శుక్ల పక్షంలోని పూర్ణిమ తిథి నాడు ప్రారంభమై అమావాస్య తిథితో ముగుస్తుంది. ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య, మహాలయ అమావాస్య అని కూడా అంటారు. మహాలయ అమావాస్య ఈ సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన వస్తుంది.
సనాతన ధర్మంలో పితృపక్ష కాలం పూర్వీకులకు అంకితం చేశారు. ఈ సమయంలో పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం, పిండ ప్రదానం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. కుటుంబ సభ్యుడు లేదా బంధువు చనిపోయినప్పుడు, వారు ఉపయోగించిన అనేక వస్తువులను ఇంట్లో లేదా వారి దగ్గర జ్ఞాపికంగా ఉంచుకుంటారు. శాస్త్రం ప్రకారం, మరణించిన వారు ఉపయోగించిన ఈ వస్తువులను వారి వద్ద ఉంచుకుంటే, జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. మహాలయ అమావాస్యకు ముందు మనం ఈ వస్తువులను ఇంట్లో నుంచి తీసివేయాలి.
1. మరణించిన వ్యక్తి దుస్తులు
చనిపోయిన వ్యక్తి లేదా మరణించిన వ్యక్తి ఉపయోగించిన దుస్తులు మరొకరు ఉపయోగించకూడదని శాస్త్రం చెబుతోంది. మరణించిన వారి దుస్తులను మనం ఉపయోగిస్తే, వారి ఆగ్రహానికి గురి కావచ్చు. వారు ఉపయోగించిన లేదా ధరించిన దుస్తులు పారవేసే బదులు, మీరు వాటిని ఇతరులకు దానం చేయవచ్చు. దీంతో మరణించిన ఆత్మకు శాంతి కూడా చేకూరుతుంది.
Also Read : పితృపక్షం సమయంలో కలలో మీ పూర్వీకులు కనిపిస్తే అది దేనికి సంకేతం!
2. మరణించిన వ్యక్తి ఆభరణాలు
పూర్వీకులు ఉపయోగించిన ఆభరణాలు ధరించడం అశుభమని భావిస్తారు. ఇలా చేస్తే జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. దీనికి బదులుగా, మీరు పూర్వీకులు ఉపయోగించిన ఆభరణాలను కరిగించి ఇతర ఆభరణాలను తయారు చేయవచ్చు. కానీ, వారు ఉపయోగించిన నగలను నేరుగా ఉపయోగించవద్దు.
3. మరణించిన వ్యక్తి చేతి గడియారం
శాస్త్రం ప్రకారం, చనిపోయినవారు ఉపయోగించిన చేతి గడియారాన్ని మనం ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి పితృదేవతల ఆగ్రహానికి గురవుతాడు. దీనికి బదులు మరణించిన వ్యక్తి చేతి గడియారాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి లేదా పాతిపెట్టండి. చనిపోయిన వ్యక్తి చేతి గడియారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించవద్దు.
Also Read : పితృ పక్షంలో ఈ 3 వస్తువులు కొంటే త్రిదోషం తప్పదు!
చనిపోయిన వ్యక్తులు ఉపయోగించిన ఈ వస్తువులను మనం ఎప్పుడూ సొంతానికి ఉపయోగించకూడదు. మరణించిన వ్యక్తి ఉపయోగించిన ఈ మూడు వస్తువులలో మీ ఇంట్లో ఏదైనా ఉంటే, వాటిని ఇంటి నుంచి బయటకు తీసి దూరంగా ఉంచండి, లేదా లేదా వాటిని దానం చేయండి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.