News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

Ancestors In Dream: పితృప‌క్షం స‌మ‌యంలో కలలో మీ పూర్వీకులు కనిపిస్తే అది దేనికి సంకేతం!

Ancestors In Dream: పితృ పక్షంలో పూర్వీకులు భూమి మీద‌కి వస్తారని మత విశ్వాసం. పితృపక్షం సమయంలో ఎవరికైనా కలలో పితృదేవతలు కనిపిస్తే దాని అర్థం ఏమిటో తెలుసా..? పితరులు కలలో కనిపించడం శుభ సంకేత‌మా?

FOLLOW US: 
Share:

Ancestors In Dream: పితృ పక్షం సమయంలో  పూర్వీకుల ఆత్మ శాంతి కోసం అనేక కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబరు 30 నుంచి ప్రారంభమయింది. పితృ పక్షంలో పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం, పిండ ప్ర‌దానం చేయడం  మంచిదని  భావిస్తారు. పితృ పక్షం సమయంలో పూర్వీకులు భూమికి వస్తారని నమ్ముతారు.  అయితే పితృ పక్షం సమయంలో మీ పూర్వీకుల గురించి కలలు వస్తే అవి దేనికి సూచన...

కలలో పూర్వీకులు
పితృ పక్షం సమయంలో, మీ పూర్వీకులు మీ కలలో మీ వైపు చేతులు చాచినట్లు మీరు చూస్తే, ఇది చాలా శుభ సంకేతమని మీరు అర్థం చేసుకోవాలి. అంటే పితరులు మీ పట్ల సంతుష్టులయ్యారని సంకేతం.  మీరు మీ జీవితంలో సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే అవన్నీ త్వరలో ముగుస్తాయని అర్థం.

Also Read : అక్టోబరు 14 వరకూ పితృ పక్షం - ఈ 15 రోజులు ఎందుకు ప్రత్యేకం!

పూర్వీకులు ప్ర‌శాంతంగా క‌నిపిస్తే
మీ పూర్వీకులు మీ కలలో నిశ్శబ్దంగా కనిపిస్తే, వారు మీ కుటుంబం, వైవాహిక జీవితంలో ఆనందంతో పాటు శాంతిని కోరుకుంటున్నారని అర్థం. అటువంటి పరిస్థితిలో, పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, మీరు పితృ పక్షంలో వారికి శాస్త్ర ప్ర‌కారం పూజలు, శ్రాద్ధం, తర్పణం, పిండ ప్ర‌దానం త‌ప్ప‌నిస‌రిగా చేయాలి.

కలలో మిఠాయి తినిపిస్తే
పితృ పక్షం సమయంలో, మీ పూర్వీకులు కలలో క‌నిపించి మీకు మిఠాయి తినిపిస్తే, ఈ కల చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మీ పూర్వీకులు మీతో సంతోషంగా ఉన్నారని, త్వరలోనే మీకు కొన్ని కొత్త శుభవార్తలు అందుతాయని దీని అర్థం.          

కలలో మీ త‌ల దువ్వితే        
పితృ పక్షం సమయంలో, మీ పూర్వీకులు మీ తల వెంట్రుకలను దువ్వుతున్న‌ట్టు మీరు క‌ల‌గ‌న్న‌ట్ల‌యితే, వారు మీకు సంభవించే అన్ని కష్టాలు, దుఃఖాల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తారని అర్థం చేసుకోండి. పితృ పక్షంలో ఇటువంటి కల చూడటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.

Also Read : పితృ పక్షంలో ఈ 3 వస్తువులు కొంటే త్రిదోషం తప్పదు!

పూర్వీకులు కలలో మాట్లాడితే          
కలలో మీ పూర్వీకులు మీతో మాట్లాడటం మీకు కనిపిస్తే, మీరు త్వరలో గొప్ప విజయాన్ని పొందుతారని అర్థం. ఇలాంటి కలలు కనడం వల్ల భవిష్యత్తులో మంచి విజయాలు వస్తాయని చెబుతారు.            

ఈ మహాలయ ప‌క్షంలో పూర్వీకులు త‌మవారి వద్దకు తిరిగి వ‌స్తార‌ని విశ్వసిస్తారు. అందుక‌ని వారిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రాద్ధకర్మలను ఆచ‌రించాలి. వారికి ఇష్టమైన వంటలు చేసి వారిని స్మరించుకుంటూ ఆవులు, కుక్కలు, కాకులకు పెడతారు.  బ్రాహ్మణులకు, పేదలకు ఆహారం, వ‌స్త్రాలు దానం చేస్తారు. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి ఆశీర్వాదాలు ఇస్తారు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

Also Read: భూలోకం నుంచి యమలోకం ఎంత దూరం - ఆత్మ ప్రయాణించే మార్గం ఎలా ఉంటుందో తెలుసా!

Published at : 03 Oct 2023 06:25 AM (IST) Tags: Good luck Pitru Paksha Victory Pitru Paksham 2023 Ancestors In Dream

ఇవి కూడా చూడండి

Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!

Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!

Horoscope Today December 2nd, 2023: ఈ రాశివారు ఒత్తికి దూరంగా ఉండాలి లేదంటే..

Horoscope Today  December 2nd, 2023: ఈ రాశివారు ఒత్తికి దూరంగా ఉండాలి లేదంటే..

Christmas 2023: క్రిస్మస్ వేడుకలు‌ డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!

Christmas 2023: క్రిస్మస్ వేడుకలు‌ డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!

Political Astrology Predictions 2023: 2023 ఎన్నికల్లో ఈ 6 రాశుల రాజకీయనాయకులకు గ్రహాలు అనుకూలంగా లేవు - ఏదైనా అద్భుతం జరగాలంతే!

Political Astrology Predictions 2023: 2023 ఎన్నికల్లో ఈ 6 రాశుల రాజకీయనాయకులకు గ్రహాలు అనుకూలంగా లేవు - ఏదైనా అద్భుతం జరగాలంతే!

Political Astrology Predictions 2023: 2023 ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయనాయకులు గెలవడం పక్కా !

Political Astrology Predictions 2023: 2023 ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయనాయకులు గెలవడం పక్కా !

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం