అన్వేషించండి

Maha Shivratri 2026: మహాశివరాత్రి పూజ ఇంట్లోనే సులభంగా చేసుకోండి! పూజా నియమాలు, విధానం, మంత్రాలు

How To Perform Shivratri Puja At Home: 2026 మహా శివరాత్రి...ఈ రోజు శివభక్తులంతా ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. అత్యంత సులువైన ఈ విధానం అనుసరిస్తే అరగంటలో పూజ పూర్తవుతుంది

Maha Shivratri 2026:  ఫిబ్రవరి 15 ఆదివారం మహా శివరాత్రి. ఈ రోజు ఇంట్లోనే భక్తిశ్రద్ధలతో పూజ చేయాలి అనుకుంటే అత్యంత సులభమైన ఈ విధానాన్ని అనుసరించవచ్చు. మీకున్న సమయాన్ని బట్టి 10 నిముషాల నుంచి అరంగంటలోపు పూర్తిచేయొచ్చు.. ఇంకా ఎక్కువ సమయం పూజలో కూర్చోవాలన్నా ఇలా చేయొచ్చు.

మహాశివరాత్రి పూజా విధానం, శాస్త్రోక్తంగా పూర్తిచేసేందుకు ఇక్కడ వివరాలు ఇస్తున్నాం. 

మాఘమాసం కృష్ణపక్షం చతుర్థశి  రోజు మహాశివరాత్రి జరుపుకుంటారు. ఈ రోజు ఉపవాసం, జాగరణ, బిల్వార్చన, శివనామస్మరణ అత్యంత ఫలాన్నిస్తాయి.  

శివరాత్రి రోజు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు

సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి

రోజంతా ఉపవాసం ఉండాలి.. అనారోగ్యంతో ఉన్నా, గర్భిణులు కూడా ఉపవాసం చేయాలి అనుకుంటే పండ్లు తీసుకోవచ్చు.. ఉప్పు, కారం ఉండే ఆహారాలు తీసుకోరాదు
  
రోజంతా ఉపవాసం...రాత్రంతా జాగరణ చేసి శివధ్యానంలో ఉండాలి
 
ఓ నమఃశివాయ అనే పంచాక్షరి జపించాలి
 
మర్నాడు ఉదయం ఉపవాసం విరమించాలి..ఈ రోజు కూడా ప్రదోష సమయంలో పారాయణ చేయాలి
 
శివపూజ ఇంట్లోనే సువులుగా చేసుకునే విధానం

కావాల్సిన పూజా సామగ్రి

శివలింగం లేదా శివుడి ఫోటో, బిల్వ దళాలు (మారేడు ఆకులు), పంచామృతాలు(పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార), పూలు, అక్షతలు, గంధం, కుంకుమ, దీపం, ధూపం నైవేద్యం ( పాలు, పండ్లు), రుద్రాక్షమాల
 
పూజ ప్రారంభం

ఇంటిని , పూజా మందిరాన్ని శుభ్రంచేసి దీపం వెలిగించి గణపతి స్మరణ చేయండి. విఘ్నాలు లేకుండా ఉపవాసం, జాగరణ పూర్తికావాలని నమస్కరించండి. 
 
మమోపాత్త సమస్త దురితక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మహాశివరాత్రి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పండి
 
ధ్యానం
శివుడిని ధ్యానించండి..శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం అని
 
అభిషేకం
శివుడు అభిషేక ప్రియుడు..శివలింగానికి పంచామృతాలతో , బిల్వదళాలతో అభిషేకం చేయండి. అభిషేకం చేస్తున్నంతసేపూ ఓ నమఃశివాయ మంత్రాన్ని జపించండి
 
బిల్వపత్రాలు 108 లేదా 111 తో అర్చన చేయండి ( మహాశివరాత్రి పూజలో, శివపూజలో అత్యంత ప్రధానం బిల్వదళాలు)
 
షోడశోపచార పూజ పూర్తిచేయండి

ఆవాహనం - శివుడిని ఆహ్వానించండి

ఆసనం,పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఫలం, తాంబూలం, దక్షిణ సమర్పించండి.
ప్రతి ఉపచారంలోనూ ఓ నమఃశివాయ లేదా ఓం త్ర్యంబకం యజామహే జపించండి
 
బిల్వార్చన సమయంలో ప్రతి బిల్వాన్ని సమర్పిస్తూ.. బిల్వాష్టకం చదువుకోండి ...
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం..త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ బిల్వదళాన్ని అర్పించండి
 
మహాశివరాత్రి పూజలో ప్రధానంగా చదవాల్సిన మంత్రాలు

ఓ నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు లేదా 1008 సార్లు

మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించండి... ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ 

రుద్రం/శ్రీ రుద్రం పారాయణం చేస్తే ఇంకా మంచిది
 
మంగళఆరతి ఇచ్చి ప్రదక్షిణ చేయండి

కాయేన వాచా మనసేంద్రియైర్యా స్తోత్రం చదవండి
 
పూజ పూర్తైన తర్వాత క్షమాపణ స్తోత్రం చదివి ప్రసాదం తీసుకోండి
 
రాత్రంతా జాగరణ చేసి శివనామస్మరణ చేయండి
 
ఇవన్నీ చేయలేం అనుకున్నవారు...

అభిషేకం, బిల్వార్చన, ఓం నమఃశివాయ జపం, ఆరతి, నైవేద్యం సమర్పించి... శివాలయానికి వెళ్లి ముక్కంటిని దర్శించుకుని రండి..  ప్రదోషకాలంలో శివాలయానికి వెళితే మరింత శుభం
 
మహాశివరాత్రి పూజ చేస్తే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. పాపాలు తొలగి శివలోక ప్రాప్తి కలుగుతుందని శివపురాణంలో ఉంది. 

ఓం నమఃశివాయ
మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు 2026

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు ఆధారంగా అందించిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు : అష్టలక్ష్ముల అనుగ్రహంతో మీ ఇంట సిరిసంపదలు!
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు : అష్టలక్ష్ముల అనుగ్రహంతో మీ ఇంట సిరిసంపదలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget