Lunar Eclipse 2025: బ్లడ్ మూన్, శని, నెప్ట్యూన్ ఒకేసారి! సెప్టెంబర్ 07 ఆదివారం అర్థరాత్రి ఆ 82 నిముషాలు ఏం చేయాలి?
Chandra Grahan 2025: సెప్టెంబర్ 07 ఆదివారం రాత్రి 82 నిమిషాలు బ్లడ్ మూన్ తో పాటూ శని , వరుణుడు అద్భుతమైన దర్శనం ఇస్తారు

Chandrudaya Grahanam 2025: 2025 సెప్టెంబర్ 7 భాద్రపద పౌర్ణమి రాత్రి జరిగే సంపూర్ణ చంద్ర గ్రహణం 82 నిమిషాలు ఉంటుంది. ఈ సమయం లో చంద్రుడు "బ్లడ్ మూన్" గా మారుతాడు. అదే సమయం లో, శని గ్రహం తన వలయాలతో, నీలం-పచ్చ రంగులో వెలిగే నెప్ట్యూన్ కూడా చంద్రుడు పక్కన కనిపిస్తాడు.
చంద్రుడు పక్కన, పసుపు బిందువులాగా వెలిగే శని గ్రహం స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో కొంచెం నీలం-పచ్చ రంగులో వరుణ (నెప్ట్యూన్) గ్రహం కనిపిస్తుంది. ఇది సౌర మండలంలో దూరంగా ఉన్న గ్రహం. ఒకే సమయంలో "బ్లడ్ మూన్", శని వలయాలు, వరుణ గ్రహం కనిపించడం ఖగోష అద్భుతం అని చెబుతారు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్ర గ్రహణం సమయంలో మానసి అస్థిరత, భ్రమ, నిర్ణయాత్మక శక్తి లోపించడం జరుగుతుంది. శని సమీపంలో ఉండంతో ఈ ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులవారిపై విశేష ప్రభావం చూపిస్తుంది.
మీన రాశి : మానసిక స్థితి, ఆరోగ్యంపై ప్రభావం
కన్యా రాశి నిర్ణయ శక్తి కోల్పోవడం, కుటుంబంలో సంఘర్షణ
మిథునం: సంబంధాలు , కెరీర్లో చికాకులు
ధనుస్సు : ప్రయాణం, అర్థిక విషయంలో అనిశ్చితి
12 రాశుల మీద ప్రభావం
మేషం- గ్రహణం సమయం లో మానసిక అస్వస్థత , కోపం పెరగవచ్చు
వృషభం - కుటుంబానికి సంబంధించి నిర్ణయం తీసుకునే సమయంలో జాగ్రత్తతో ఉండాలి
మిథునం- వ్యక్తిగత జీవితంలో గందరగోళం, కెరీర్లో అనిశ్చితి. ధ్యానం సంయమనం అవసరం
కర్కాటకం - ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొట్టకు సంబంధించిన సమస్యలు పెరగొచ్చు
సింహం- ప్రేమ సంబంధాలు, విద్యకు సంబంధించిన విషయాల్లో చికాకులు
కన్యా- కుటుంబంలో వివాదం, నిర్ణయం తీసుకోనడంలో తొందరపాటు
తులా - సోదరులకు సంబంధించిన విషయంలో టెన్షన్ ఉంటుంది, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం
వృశ్చికం - ధన వ్యయం పెరగుతుంది
ధనస్సు- ఆత్మ విశ్వాసం తగ్గుతుంది, ఆరోగ్యం మీద ప్రభావం. సంయమం తో ఉందండీ.
మకర - రహస్య శత్రువులు పొంచి ఉన్నారు..ఆధ్యాత్మిక సాధన చేయండి
కుంభం - స్నేహితులతో అభిప్రాయభేదాలు
మీనం- మానసిక ఒత్తిడి, కెరీర్ సంబంధిత చికాకులు..ధ్యానం చేయండి
82 నిమిషాలు అర్థరాత్రి ఏం చేయాలి?
ఖగోళ ప్రేమికులు: గ్రహణాన్ని వీక్షించండి..ఆ ఫొటోలను కెమెరాల్లో బంధించండి
భక్తులు: గ్రహణం సమయంలో మంత్ర జపం చేయండి. దీపం వెలిగించి నాకరాత్మక శక్తి ని దూరం చెయ్యండి. మౌన సాధన చేయండి లేదా ధ్యానం చేయండి.గ్రహణం అనంతరం గంగాజలంతో స్నానం ఆచరించండి..ఇల్లంతా గంగను చల్లండి. మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయండి.
సెప్టెంబర్ 7, 2025 అర్థరాత్రి ఈ 82 నిమిషాలు కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు...బ్రహ్మాండంలో ప్రతి పరివర్తన మన జీవితం, ఆలోచన ,, ఆధ్యాత్మిక శక్తి మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుంది. బ్లడ్ మూన్, శని, వరుణుడు ఒకేసారి దర్శనం ఇవ్వడం జ్యోతిష్య శాస్త్ర పరంగానూ అద్భుతమే.
1. చంద్ర గ్రహణం నేరుగా చూడడం సురక్షితమేనా?
ఇది సంపూర్ణంగా సురక్షితం. చంద్ర గ్రహణం నేరుగా చూడొచ్చు
2. సూతకాలంలో పూజ చేయవచ్చా?
సంప్రదాయం ప్రకారం పూజ వద్దు, కానీ మంత్ర జపం ధ్యానం మంచిది
3. చంద్ర గ్రహణం సమయం ఎంత?
ఇది 82 నిమిషాల వరకు ఉంటుంది. భారత దేశంతో సహా ఆసియా, యూరోప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు. ఈ సమాచారాన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.






















