Dev Uthani Ekadashi 2025 Date: ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, తులసి-శాలిగ్రామ్ వివాహం శుభ ముహూర్తం, పూజా విధానం!
Tulsi Vivah Muhurat: దేవుత్థాన ఏకాదశి నవంబర్ 01న వచ్చింది. 2 నవంబర్ న క్షీరాబ్ధి ద్వాదశి వస్తుంది. విష్ణువు మేల్కొనడంతో శుభకార్యాలు ప్రారంభవుతాయి. ఈ సందర్భంగా తులసి-శాలిగ్రామ వివాహం జరుగుతుంది.

Dev Uthani Ekadashi 2025: నవంబర్ 1న దేవుత్థాన ఏకాదశి, నవంబర్ 2న క్షీరాబ్ధి ద్వాదశి జరుపుకుంటారు. ఈ ఏడాది దేవుత్థాన ఏకాదశి త్రిస్పర్శ యోగంలో జరుపుకుంటారు. ఒకే రోజు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ మూడు తిథులు కలిసినప్పుడు త్రిస్పర్శ యోగం ఏర్పడుతుంది.
దేవుత్థాన ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనడం...తులసి శాలిగ్రామ్ వివాహానికి చిహ్నం
పద్మ పురాణం ప్రకారం
దేవుత్థాన ఏకాదశి త్రిస్పర్శ యోగంలో చేసిన వ్రతం , వివాహం కన్యాదానం చేసినంత ఫలితాన్నిస్తుంది. ఈ రోజునే చాతుర్మాసం ముగుస్తుంది. వివాహం, గృహ ప్రవేశం, నామకరణం వంటి శుభ కార్యాలు ప్రారంభమవుతాయి.
దేవుత్థాన ఏకాదశి 2025 తేదీ ముహూర్తం
ఏకాదశి తిథి ప్రారంభం: నవంబర్ 01, 2025 (శనివారం) సూర్యోదయానికి ఏకాదశి ఉంది
ఏకాదశి తిథి ముగింపు: నవంబర్ 01 (శనివారం) అర్థరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2.27 గంటల వరకు ఉంది
క్షీరాబ్ధి ద్వాదశి తిథి ప్రారంభం: నవంబర్ 02 ఆదివారం సూర్యోదయానికి ద్వాదశి ఉంది..అర్థరాత్రి దాటిన తర్వాత 1.18 నిముషాల వరకూ ద్వాదశి ఉంది...
క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం, తులసి-శాలిగ్రామ్ వివాహం నవంబర్ 02, 2025 (ఆదివారం సాయంత్రం)
తులసి వివాహానికి శుభముహూర్తం సాయంత్రం (గోధూళి ముహూర్తం ఉత్తమంగా పరిగణిస్తారు)
ఈసారి దేవుత్థానఏకాదశి త్రిస్పర్శ యోగంలో ఉంటుంది, ఇది చాలా అరుదైన కలయిక. ఏకాదశి, ద్వాదశి రాత్రి చివరి భాగంలో త్రయోదశి మూడు తిథులు ఒకే రోజున వచ్చినప్పుడు దానిని త్రిస్పర్శ యోగం అంటారని పద్మ పురాణంలో ఉంది.
దేవుత్థాన ఏకాదశి కథ ప్రాముఖ్యత
దేవుత్థాన ఏకాదశి రోజున శ్రీహరి నాలుగు నెలల తర్వాత యోగనిద్ర నుంచి మేల్కొని సృష్టి కార్యభారాన్ని స్వీకరిస్తారని నమ్ముతారు. ఆయన మేల్కొనడం ఆనందంలో దేవుత్థాన ఏకాదశి జరుపుకుంటారు. ఈ రోజునే విష్ణువు తులసిని వివాహం చేసుకున్నాడని భావిస్తారు. అందుకే సాయంత్రం సమయంలో తులసి - శ్రీ మహావిష్ణువు వివాహం జరిపిస్తారు. పూజలో భాగంగా తులసి మొక్క దగ్గర శాలిగ్రామాన్ని ఉంచి పూజిస్తారు
ఈ రోజున తులసిని అలంకరించి వస్త్రం సమర్పిస్తారు
తులసి ముందు శ్రీ మహావిష్ణువు పాదాలు వేసి అలంకరిస్తారు
షోడసోపచారాలతో పూజ పూర్తిచేసి నైవేద్యం సమర్పించి కథ చదువుకుంటారు
సనాతన ధర్మంలో తులసి వివాహం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. తులసి , శాలిగ్రామ్‌లను పూజించడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు వస్తాయి. ఈ రోజున చేసిన వివాహం కన్యాదానం చేసినంత పుణ్యం ఇస్తుందని నమ్ముతారు . భార్యాభర్తల మధ్య ప్రేమ మరియు సామరస్యం పెరుగుతుంది.
త్రిస్పర్శ యోగం అనేది మూడు తిథులు ఒకే రోజున కలిసే సందర్భం, ఏకాదశి, ద్వాదశి త్రయోదశి... ఈ యోగం విష్ణువు మేల్కొనడానికి సృష్టిని పునరుద్ధరించడానికి మాత్రమే కాకుండా, జీవితంలో మూడు గుణాలు...సత్త్వ, రజ, తమస్సుల సమతుల్యతకు కూడా చిహ్నం. ఈ రోజు నుంచే శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి
2025 నవంబర్ 02 క్షీరాబ్ధి ద్వాదశి! లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం సులువైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
కార్తీక మహాపురాణం కథ DAY-1: కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యం!
కార్తీక మహాపురాణం కథ DAY-2 : కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది?
కార్తీక మహాపురాణం కథ DAY-3 : బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం






















