అన్వేషించండి

Krishna Janmashtami 2023: ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియాలంటే కృష్ణతత్వం అర్థంచేసుకోవాలి!

కృష్ణుడిని భగవంతుడిగా పూజించేవారి కన్నాస్నేహితుడిగా, గురువుగా భావించిన వారినే ఎక్కువగా అనుగ్రహించాడు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఎలా ప్రవర్తించాలో అర్థం కావాలంటే కృష్ణతత్వం తెలుసుకోవాలి

Krishna Janmashtami 2023:  శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ రాక్షసులను సంహరించడంతో ముగిసిపోతాయి. కానీ శ్రీ రామ, కృష్ణావతారాలు మాత్రం పరిపూర్ణ అవతారాలు. పైగా ఏ అవతారంలోనూ తానే దేవుడిని అని చెప్పలేదు కానీ కృష్ణావతారంలో మాత్రం తానే దేవుడిని అని స్పష్టంగా చెప్పాడు  శ్రీకృష్ణుడు. అయితే ఎక్కువ మంది కృష్ణుడిని భగవాన్ స్వరూపంగా కన్నా గురువుగా, స్నేహితుడిగా, ప్రేమమూర్తిగా కొలిచి తరిస్తారు. స్పష్టంగా చెప్పుకోవాలంటే కృష్ణుడికి భక్తుల కన్నా శిష్యులే ఎక్కువమంది ఉన్నారు. 

చతురాశ్రమ ధర్మాన్ని ఆచరించి చూపిన గురువు

శ్రీ మహావిష్ణువు అవతారాల్లో గురుతత్వాన్ని చూపించిన అవతారం శ్రీ కృష్ణుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జాతకాల్లో దోషాలుంటాయి. కొన్ని దోషాలు పూజల ద్వారా పరిష్కార మవుతాయి. కానీ అస్సలు రెమిడీస్ లేని దోషాలు కొన్ని ఉంటాయి. అలాంటి దోషాలు పూజల వల్ల కూడా పరిష్కారం కావు . కేవలం గురువు ఆశీర్వచనం ఉంటేనే కొన్ని దోషాలు పరిష్కారం అవుతాయి. అందుకే వేద పండితుడితో

“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి”

అని ఆశీర్వచనం పొందాలని భావిస్తారు. ఈ ఆశీర్వచనం ద్వారా కొన్ని దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అలా మనిషి పాటించాల్సిన చతురాశ్రమ ధర్మాలైన బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాస ఆశ్రమం...ఈ నాలుగు ఆశ్రమ ధర్మాల్లో గురుతత్వాన్ని చూపించిన అవతారం కృష్ణడొక్కటే. అందుకే కృష్ణుడిరాకతో ఇంట్లో ఉంటే దోషాలు తొలగిపోతాయని భావించి శ్రీకృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు.

Also Read: పుట్టకముందే శత్రువు సిద్ధం, అడుగుకో కష్టం - కృష్ణుడిని మించి సవాళ్లు ఎదుర్కొన్నదెవరు!

అనంతమైనది కృష్ణతత్వం

రామాయణం  అంటే రాముడు నడిచిన మార్గం అని అర్థం. కేవలం కృష్ణుడిని మాత్రమే కృష్ణతత్వం అంటారు. తత్వం అంటే ఏ యుగంలో వారైనా అన్వయించుకోవచ్చు. రాముడంటే ఏంటో అందరకీ తెలుసు కానీ కృష్ణుడేంటో తెలుసుకునేందుకు  రుషులు పండితులు తాపత్రయపడ్డారు. వ్యాసభగవానుడు అంతటి వాడే కృష్ణతత్వాన్ని తెలుసుకోవడం కష్టం అని తేల్చేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటేసులువుగా కనిపించే అనంతమైనది కృష్ణతత్వం. అందుకే  గురువుగా, స్నేహితుడిగా నువ్వు నా ఇంట్లోకి వచ్చి నన్ను, నా కుటుంబాన్ని చెడుమార్గంలో నడిపించకుండా చూడాలని కృష్ణుడిని కోరుకుంటారు

Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి సెప్టెంబరు 6 or 7 - ఎప్పుడు జరుపుకోవాలి!

స్నేహధర్మానికి నిదర్శనం 

వాస్తవానికి కురుక్షేత్రం సంగ్రామం పూర్తికాకముందే అర్జునుడు ఆయుర్దోషం పొందుతాడని(చనిపోతాడని) రుషులు ముందే చెబుతారు. కానీ యుద్ధం చివరి వరకూ అర్జునుడు ఉన్నాడు. మొత్తం యుద్ధం ముగిసిపోయింది..అందర్నీ చంపేశా అని అర్జునుడు అనగానే కృష్ణుడు అర్జునిడితో రథం కిందకు దిగు అని చెబుతాడు. వెంటనే కృష్ణుడు కూడా కిందకు దిగి రథం చుట్టూ ప్రదిక్షిణ చేస్తాడు. వెంటనే ఆ రథం పెళపెళమని విరిగి బూడిదైపోతుంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు...భీష్ముడు, ద్రోణులు, కర్ణుడు లాంటి వారు వేసిన బాణాలతో ఎప్పుడో రథం కాలిపోయింది. కానీ గురువుగా, స్నేహితుడిగా నీవెంట ఉన్నా కాబట్టే  కాలిన రథం కాలినట్టు నీకు కనిపించలేదంటాడు. అదే కృష్ణతత్వం. అర్జునుడినికి దోషాల నుంచి విముక్తి కల్పించినట్టే తమని కూడా కాచుకుని ఉండాలని కన్నయ్యను పూజిస్తారు.

Also Read: ద్వారక సముద్రంలో మునిగినప్పుడు మిస్సైన కృష్ణుడి విగ్రహం ఇప్పుడు ఎక్కడుందంటే!

ఆనందానికి అధిపతి

కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. అందుకే కృష్ణుడు ఉన్న ప్రదేశాన్ని బృందావనం అంటారు. బృంద అంటే తులసి, బృంద అంటే ఆరోగ్యంతో కూడిన ఆనందం. ఆ ఆనందం వనంలా పెరిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇంట్లో సమస్యలన్నీ పరిష్కరించి ఆనందాన్నివ్వమని కృష్ణుడిని ఆహ్వానిస్తారు. కృష్ణుడి జననం నుంచి అవతారం చాలించే వరకూ ధర్మం దశగా నడిపించాడు, జీవితం అంటే ఏంటో చూపించాడు...సమస్యలను ఎదురించి సంతోషంగా ఎలా జీవించాలో నేర్పించాడు. మనిషిగా ప్రవర్తించే నడవడినను నేర్పించమని చెప్పడానికే కృష్ణపాదుకలు వేస్తారు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.  ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget