కృష్ణాష్టమి ఎప్పుడు - సెప్టెంబరు 6 or 7



పంచాంగకర్తలు ఏ రోజైతే కృష్ణాష్టమి జరుపుకోవాలని సూచిస్తున్నారో ఆ రోజు సూర్యోదయానికి అష్టమి తిథి లేదు. మర్నాడు అష్టమి తిథి ఉంది. దీంతో కృష్టాష్టమి ఏ రోజు జరుపుకోవాలా అనే గందరగోళం నెలకొంది.



కృష్ణాష్టమి 6వ తేదీనా? లేక 7వ తేదీన జరుపుకోవాలా? అంటే ముందుగా తిథులు గురించి చూసుకోవాలి...



సెప్టెంబరు 6 సప్తమి బుధవారం రాత్రి 7 గంటల 58 నిముషాల వరకూ ఉంది.. ఆ తర్వాత అష్టమి ఘడియలు మొదలయ్యాయి.



సెప్టెంబరు 7 అష్టమి గురువారం రాత్రి 7 గంటల 47 నిముషాల వరకూ ఉంది.



సెప్టెంబరు 6 బుధవారం మధ్యాహ్నం 2 గంటల 42 నిముషాల వరకూ కృత్తిక నక్షత్రం ఉంది..ఆ తర్వాత ప్రారంభమైన రోహిణి నక్షత్రం సెప్టెంబరు 7 గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకూ ఉంది.



శ్రీ కృష్ణుడు జన్మించింది శ్రావణమాసం బహుళ అష్టమి అర్థరాత్రి సమయంలో. అందుకే శ్రీ కృష్ణుడు జన్మించిన సమయానికి అష్టమి తిథి ఉండడం ప్రధానం అంటారు.



వైష్ణవులు మాత్రం సెప్టెంబరు 7నే కృష్ణాష్టమి జరుపుకుంటారు. ఎందుకంటే వారికి రోహిణి నక్షత్రంలో కూడిన అష్టమి ప్రధానం. మిగిలినవారికి కృష్ణాష్టమి సెప్టెంబరు 6 బుధవారమే.



Images Credit: Pixabay


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: అద్భుతాలంటే ఇలానే ఉంటాయి

View next story