Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు కన్నుమూసిన ప్రదేశం ఇదే!
మీరు శ్రీకృష్ణుడి గురించి చాలా కధలు విని ఉంటారు. కానీ ఆయన ఎక్కడ కన్నుమూశారు? ఆ ప్రదేశానికి ఎలా వెళ్లాలి? అనే విషయాలు తెలుసా మరి...
![Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు కన్నుమూసిన ప్రదేశం ఇదే! Krishna Janmashtami 2022: do you know about lord sri Krishna funeral palce,k now in details Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు కన్నుమూసిన ప్రదేశం ఇదే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/17/8fae9d08036f196edf2a47d8fed418831660738460699217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గుజరాత్ రాష్ట్రంలో ప్రధానంగా సందర్శించే ప్రదేశం సోమనాథ్. పరమేశ్వరుడి జ్యోతిర్లింగాల్లో ఒకటి. అయితే కేవలం శైవ భక్తులకు మాత్రమే కాదు వైష్ణవులకూ చాలా ప్రత్యేకమైన ప్రదేశం. ఎందుకంటే..సోమనాథ్ ఆలయానికి కిలోమీటరు దూరంలో ఉన్న పట్టణం త్రివేణి ఘాట్. ఇక్కడ హిరన్, కపిల, సరస్వతి నదులు అరేబియన్ సముద్రంలో కలుస్తాయి. శ్రీ కృష్ణుడు కన్నుమూసే ముందు హీరణ్ నదిని సందర్శించినట్టు చెబుతారు. హిరణ్ నది సందర్శన అనంతరం ఆ సమీపంలో ఉన్న అస్త చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా..శ్రీకృష్ణుడి కాలిని చూసిన ఓ వేటగాడు అక్కడ మృగం ఉందని భావించిన వేటగాడు బాణం వేస్తాడు. ఆ బాణం కృష్ణుడి కాలి బొటనవేలికి గుర్చుకుని..విషప్రభావం అయిన బాణం కావడం వల్ల వెంటనే కన్నుమూస్తాడు.
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
కృష్ణుడు హిరన్ నదిని సందర్శించిన పాదముద్రలు ఇవిగో అని చూపిస్తారక్కడ. ఈ ప్రదేశాన్ని దేహోత్సర్గ్ తీర్ధ అని పిలుస్తారు. ఇక శ్రీకృష్ణుడు నిర్యాణం జరిగిన ప్రదేశాన్ని భాల్కా తీర్ధం అని అంటారు. ఈ ఆలయాన్ని చాలా మంది భక్తులు సందర్శిస్తారు. మోక్షానికి ఇది ఒక గొప్ప ప్రదేశంగా భక్తులు విశ్వసిస్తారు. హిందువులు సోమనాథ్ సందర్శనను ఒక భాగ్యంగా భావిస్తారు. శివుడు, శ్రీకృష్ణుడి పవిత్ర పుణ్యక్షేత్రాలను ఒకే చోట సందర్శించడం ఇక్కడ ప్రత్యేకత.
కృష్ణుడు దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాక చూశాడు అర్జునుడు. అందుకే మృతదేహాన్ని ద్వారకకు తీసుకెళ్లే అవకాశం లేకుండా పోయింది. అందుకే ఎలాంటి ఆర్భాటము లేకుండా శ్రీకృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఎనిమిది మంది భార్యలు, సంతానం, బంధు బలగం, అఖండమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ.. శ్రీకృష్ణుడి అంత్యక్రియల సమయానికి వాళ్లెవ్వరూ లేరు. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కుమారులున్నా.. ఆయనకి కూడా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరగలేదు.
Also Read: శ్రీకృష్ణుడు అంటే దైవం మాత్రమే కాదు - స్నేహితుడు, గురువు, ప్రేమికుడు - ఇదే కృష్ణతత్వం
శ్రీ కృష్ణుడు అవతారం చాలించాడు, ఆతర్వాత ద్వారక నీటమునిగిందని చెబుతారు.. అయితే తనకు తానుగా అవతారం చాలించలేదని.. గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం ముగిసిన మూడున్నర దశాబ్ధాల తర్వాత కృష్ణుడు అవతారం చాలించాడని చెబుతారు.
కృష్ణాష్టకం
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ ।
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ ।
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ॥
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ ।
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ ।
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ ।
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ ।
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)