Mahabharat Story: ద్రౌపది 13 ఏళ్లు జుట్టుకు ముడి ఎందుకు వేయలేదు? భీముడు దుశ్శాసనుడి రక్తం తాగాడా?
Mahabharat Story: మహాభారత యుద్ధానికి ద్రౌపది ప్రధాన కారణమని మనం చాలాసార్లు విన్నాం, చదివాం. అయితే, కురుక్షేత్రంలో భీముడు దుశ్శాసనుడిని చంపడానికి.. ద్రౌపదికి, దుశ్శాసనుడి మరణానికి సంబంధం ఏమిటి?
Mahabharat Story: మహాభారతం ప్రకారం, ద్రౌపది తన ఐదుగురు భర్తలలో అర్జునుడిని ఎక్కువగా ప్రేమిస్తుంది. అయితే ఆ ఐదుగురిలో భీముడు ద్రౌపదిని ఎక్కువగా ప్రేమించాడు. అతిరథ, మహారథులు ఉన్న కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణంలో ద్రౌపదికి జరిగిన అన్యాయానికి మొట్టమొదటగా కౌరవులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వ్యక్తి భీముడేనని చెబుతారు.
ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో భీముడు చేసిన అనేక ప్రమాణాలు మహాభారత యుద్ధానికి ప్రధాన కారణాలు. ఈ మహా యుద్ధంలో లక్షలాది మంది యోధులు మరణించారు. కురు సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయంపై రగిలిపోయిన భీముడు.. దుశ్శాసనుడి రక్తంతో ద్రౌపది జుట్టును కడుగుతానని ప్రతిజ్ఞ చేశాడు.
1. భీముడు ఎందుకు ప్రతిజ్ఞ చేసాడు..?
మహాభారతంలో యుధిష్ఠిరుడు పాచికలాడే సమయంలో ద్రౌపదిని పందెంగా పెడతాడు. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు, ద్రౌపది కౌరవుల చేతుల్లో అవమానం పాలయ్యేలా, పాచికల ఆటలో దుర్యోధనుడిని గెలిపించేలా శకుని మోసం చేస్తాడు. ఈ సమయంలో దుశ్శాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకుని కౌరవ సభలోనికి తీసుకువస్తాడు.
ఇంత జరుగుతున్నా పాండవులు ఆట నియమాలను కాదనలేకపోయారు. ఆట నియమాలు పాటించి మౌనంగా ఉండిపోయాడు. కానీ, వారిలో ప్రతీకార జ్వాల రగులుతోంది. దుశ్యాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభలోకి తీసుకురావడం చూసిన భీముడు అది భరించలేక పట్టలేని కోపంతో దుశ్శాసనుడి రక్తం తాగుతానని, ఆ రక్తంతో ద్రౌపది జుట్టును కడుగుతానని ప్రతిజ్ఞ చేస్తాడు.
2. 13 ఏళ్లు జుట్టు ముడి వేయని ద్రౌపది
దుశ్శాసనుడి రక్తంతో తన వెంట్రుకలను శుభ్రం చేసేంత వరకు జుట్టు ముడివేయబోనని ద్రౌపది భీముడికి స్పష్టం చేసింది. ఈ కారణంగా, ద్రౌపది తన కురులను సుమారు 13 సంవత్సరాలు అలాగే వదిలి వేసింది. ద్రౌపదికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, భీముడు కురుక్షేత్ర యుద్ధంలో దుశ్శాసనుడి ఛాతీని చీల్చి అతని రక్తాన్ని తాగి, అదే రక్తాన్ని ద్రౌపది కురులకు పూశాడు. అలా భీముడు ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు.
3. భీముడు దుశ్శాసనుడి రక్తం తాగాడా..?
మహాభారతం ప్రకారం, యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ధృతరాష్ట్రుడిని, గాంధారిని కలవడానికి వెళతారు. ఆ సమయంలో గాంధారి భీముడిని ఇలా అడుగుతుంది. భీమా.. కురుక్షేత్ర యుద్ధ భూమిలో నువ్వు నిజంగా దుశ్శాసనుడి రక్తం తాగావా..? అప్పుడు భీముడు గాంధారితో మాట్లాడుతూ.. నేను ఖచ్చితంగా నా వాగ్దానాన్ని నెరవేర్చానని చెప్పాడు.
Also Read : మహాభారత యుద్ధంలో మరణించని కౌరవవీరుడు ఒక్కడే..!
కౌరవులు పాండవులను మోసపూరితంగా పాచికల ఆటలో ఓడించి, కిక్కిరిసిన సభలో ద్రౌపదిని అవమానించకపోతే, మహాభారతం అనే మహాయుద్ధం జరిగేది కాదు. కౌరవులతో చాలా మంది యోధులు ప్రాణాలు కోల్పోయి ఉండరు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.