అన్వేషించండి

Karthika Purnima 2022: కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకం, ఎందుకో తెలుసా?

హరిహరాదుల మాసం కార్తీకం. ఈ మాసంలో అన్ని రోజులు పరమ పవిత్రమైనవే అయినా.. ఆ మాసంలో వచ్చే కార్తీకపూర్ణిమకు ఒక విశిష్టత ఉంది. మరి కార్తీక పూర్ణిమ ప్రాధాన్యత ఏంటో మీరూ తెలుసుకోండి.

శ్రావ‌ణ‌మాసం లాగానే కార్తీక మాసం కూడా మ‌హిళ‌ల‌కు ఎంతో ఇష్ట‌మైన మాసం. హరిహరాదుల మాసం కార్తీకం. ఈ నెల‌రోజులు కూడా పూజ‌లు, ఉప‌వాసాల‌తో ఇల్లు సంద‌డిగా ఉంటుంది. శివ కేశ‌వుల‌కు బేధం లేద‌ని చెప్ప‌డ‌మే ఈ మాస ప్రాముఖ్య‌త‌. అందుకే ఈ మాసం అంతా కూడా శివుడిని ఎంత‌గా ఆరాధిస్తారో విష్ణువుని కూడా అంతే ఆరాధిస్తారు. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర ద‌గ్గ‌ర‌లో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి “కార్తీకమాసం” అని పేరు వచ్చింది.
“న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్”
....అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం. దీపావ‌ళి తెల్లారి నుంచి నెల రోజుల పాటు నియ‌మ నిష్ట‌ల‌తో కార్తీక వ్ర‌తాన్ని నిర్వ‌హిస్తారు చాలా మంది మ‌గువ‌లు.

ఇక ఈ కార్తీకమాసం మొత్తంలో అన్నీ రోజులు ప్రత్యేకమైనవే అయినా కార్తీక పూర్ణ‌మి చాలా ప్ర‌త్యేకం. కార్తీక పూర్ణ‌మి రోజున దేవాల‌యాలు భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతుంటాయి. ఆరోజు సాయంత్రం దీపకాంతుల శోభను వర్ణించలేం కూడా.. చంద్రుడి వెలుగుల‌లో ఇంటి ముంద‌ర దీప‌కాంతుల‌తో అద్బుతంగా ఉంటుంది. మ‌రి ఆ కార్తీక పూర్ణ‌మి విశిష్ట‌త ఏంటో తెలుసుకుందామా?!

పూర్వం వేదాల‌ను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకుడనే రాక్షసుడిని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించినది ఈ పౌర్ణమినాడే. అంతేకాదు పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనరోజు కార్తీకపౌర్ణమి. శివుడు త్రిపురాసురులను సంహరించింది కూడా ఈ పౌర్ణమిరోజునే కావడంతో ప్రజలంతా పండుగ చేసుకున్నారు. అందుకే దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు. అవేకాకుండా దేవదీపావళి అని, కైశిక పౌర్ణమి అని, తెలంగాణ పరిభాషలో జీటికంటి పున్నమి అని కుమార దర్శనమనే పేర్లతో కూడా పిలుస్తారు.

ఈ పౌర్ణమినాడు కొన్నిచోట్ల వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు. ఒక కోడెదూడను ఆబోతుగా స్వేచ్చగా కీర్తిశేషులైన పితృదేవతల ప్రీత్యర్థం వదులుతారు. ఇలా చేయడంవల్ల గయలోవారి ఆత్మశాంతి కోసం కోటిసార్లు శ్రాద్ధకర్మలు జరిపిన పుణ్యఫలం లభిస్తుంది. తమిళనాడు తిరువణ్ణామలైలో జ్యోతిస్వరూపుడై వెలిసిన శివుడి అగ్నిలింగాన్ని దర్శించుకోవడానికి ఈరోజున వేలాదిమంది అక్కడికి తరలివెళ్తారు.

కార్తీక పౌర్ణమిరోజు రాత్రి పండు వెన్నెల ఉంటుంది. ఈ వెన్నెలలో పాలుకాస్తే ఆ పాలు అమృతతుల్యం అవుతాయని ఒక నమ్మకం. ఆ పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారట. అందుకని పూర్వకాలంలో కార్తీకపౌర్ణిమ వెలుగులో పొయ్యి వెలిగించి పాలను మిరియాలతోపాటు కాచి తాగేవారు. కార్తీక పౌర్ణమిరోజు ఆకాశంలో చంద్రుడి నిండైన రూపంతోపాటు దానికి అతిచేరువలోనే దేవతల గురువైన బృహస్పతి (గురుగ్రహం) కూడా ఈరోజున సాక్షాత్కరిస్తుందట. ఆ గురుశిష్యులకి భక్తితో నమస్కరిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. 

తులా సంక్రమణం జరుగుతున్న ఈకార్తీకమాస సమయంలో శ్రీహరి ప్రతి నీటిబొట్టులో వ్యాప్తిచెంది ఉంటాడట. గోవుపాదం అంతటిజలంలో కూడా శ్రీహరి కొలువై ఉంటాడట. కాబట్టి కార్తీకమాసంలో నెలలో ఒకసారైనా నదీ స్నానం చేస్తే విశేష పుణ్యఫలం దక్కుతుంది. ప్రత్యేకించి పౌర్ణమిరోజు ప్రాతఃకాలంలో దంపతులు సరిగంగ స్నానాలు చేయడం విష్ణువుకెంతో ప్రీతికారకం. దానివల్ల శివ,కేశవులు ఇద్దరి అనుగ్రహానికి పాత్రులువుతారు.

Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, క్షీరాబ్ది ద్వాదశి - పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

టాప్ హెడ్ లైన్స్

Libra Half Year Horoscope 2026: ఆగష్టు దాటేస్తే డిసెంబర్ వరకూ తులా రాశివారికి అన్నీ మంచి రోజులే!
తులా రాశి అర్థ సంవత్సర ఫలితాలు 2026 - ఆగష్టు దాటేస్తే డిసెంబర్ వరకూ మీకు అన్నీ మంచి రోజులే!
కన్యారాశి 2026 ద్వితీయార్ధం: జూలై నుంచి డిసెంబర్ మధ్య శని ప్రభావం, గురు బలం – మీ భవిష్యత్తుకు మార్గం!
కన్యారాశి 2026 ద్వితీయార్ధం: జూలై నుంచి డిసెంబర్ మధ్య శని ప్రభావం, గురు బలం – మీ భవిష్యత్తుకు మార్గం!
CJP ఉద్యమం ముగుస్తుందా, కొత్త మలుపు తిరగబోతోందా? సీజేపీకి పొంచిఉన్న అతిపెద్ద ముప్పు ఏంటి? 
CJP ఉద్యమం ముగుస్తుందా, కొత్త మలుపు తిరగబోతోందా? సీజేపీకి పొంచిఉన్న అతిపెద్ద ముప్పు ఏంటి? 
Vastu Tips: ఇంట్లో ఇలాంటి గడియారం ఉంటే అశుభమా? మీరు ఈ రోజే దాన్ని తీసేయండి!
ఇంట్లో ఇలాంటి గడియారం ఉంటే అశుభమా? మీరు ఈ రోజే దాన్ని తీసేయండి!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
OG Television Premiere: ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
Embed widget