అన్వేషించండి

Karthika Deepam: కార్తీకసోమవారం మూడోవారం ఇలా చేయండి!

Karthika Deepam: కార్తీకం నెలమొత్తం ప్రత్యేక పూజలు కుదరని వాళ్లు..కనీసం మూడో సోమవారం అయినా కొన్ని నియమాలు పాటిస్తే శుభం జరుగుతుందంటారు పండితులు...

పరమేశ్వరుడికి సోమవారం ప్రీతికరమైన వారం. సోమ .. అంటే, స - ఉమ అని అర్. ఉమతో కూడినవాడు శివుడు...అందుకే సోమవారం చేసే పూజలు శివుడికి ప్రీతిని కలిగిస్తాయంటారు. ఏ సోమవారం అయినా శివయ్యకు ప్రీతే కానీ  కార్తీక సోమవారం అంతకుమించి. ఈ రోజు శివుడిని బిల్వ దళాలతో పూజిస్తే మనోభీష్టం నెరవేరుతుంది. ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివుడిని కొలిస్తే మాంగల్యబలం చేకూరుతుంది. కార్తీకసోమవారం రోజు శివుడి సన్నిధిలో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది. శివాలయంలో దీపాన్ని వెలిగిస్తే సమస్తదోషాలు నశిస్తాయి. ఉపవాస దీక్షను చేపట్టి ఈ నియమాలు పాటిస్తే మోక్షానికి చేరవవుతారు. కార్తీకమాసంలో వచ్చే ప్రతిసోమవారం ఉపవాసం, పూజ చేయకపోయినా..కనీసం మూడోసోమవారం కనీస నియమాలు పాటిస్తే మంచిదంటారు. రుద్రాభిషేకం చేయించుకుంటే ఇంకా మంచిది...ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు, ఆహారానికి కొరత ఉండదని పండితులు చెబుతారు. 

Also Read: వైరాగ్యం కావాలంటే శివుడికి వీటితో అభిషేకం చేయండి

మారేడు చెట్టును త్రిమూర్తి స్వరూపంగా, లక్ష్మీ రూపంగా  ఆరాధిస్తారు. మహాశివుడికి మారేడు దళాలంటే ఇష్టం. అందుకే మారేడును శివేష్ట అని అంటారు.  బిల్వం అంటే శ్రీఫలం. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలములు ఇచ్చేది, ఇంకా సిరిని తెచ్చే ఫలము కలది అని అర్ధం. మారేడు మహా మంగళకరమైనది. మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు. ఈశ్వరారాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, పూజలో ఎంత ఎక్కువ బిల్వ పత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని, మోక్షం కూడా ప్రాప్తిస్తుందని విశ్వాసం. అందుకే కొందరు ఏకంగా కోటి బిల్వ పత్రాలతో శివుని ఆరాధిస్తారు. సర్వ శుభాలూ చేకూర్చి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక బిల్వ వృక్షాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు.

Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..

శివయ్య భక్తుల కోసం బిళ్వాష్టకం
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం

కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం

ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం

రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం

అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం

ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం

సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం

దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం

బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం

సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం

అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం

బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
Bigg Boss 8 Telugu Prize Money: బిగ్ బాస్ ప్రైజ్ మనీ... నిఖిల్‌కు రూ. 55 లక్షలతో పాటు కారు కూడా - రోజుకు ఎంతో తెలుసా?
బిగ్ బాస్ ప్రైజ్ మనీ... నిఖిల్‌కు రూ. 55 లక్షలతో పాటు కారు కూడా - రోజుకు ఎంతో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
Bigg Boss 8 Telugu Prize Money: బిగ్ బాస్ ప్రైజ్ మనీ... నిఖిల్‌కు రూ. 55 లక్షలతో పాటు కారు కూడా - రోజుకు ఎంతో తెలుసా?
బిగ్ బాస్ ప్రైజ్ మనీ... నిఖిల్‌కు రూ. 55 లక్షలతో పాటు కారు కూడా - రోజుకు ఎంతో తెలుసా?
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Look Back 2024: ఇది మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ సంవత్సరం - ఇన్వెస్టర్ల ఇళ్లు డబ్బులమయం
ఇది మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ సంవత్సరం - ఇన్వెస్టర్ల ఇళ్లు డబ్బులమయం
IND vs AUS: బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
Embed widget