Karnataka Hasanamba Temple: ఈ అత్తా - కోడలు ఓ దగ్గరికి చేరితే యుగాంతమే - సైన్స్ కి అందని మిస్టరీ ఇది!
The Story of Miracles:హాసనాంబ పేరులోనే నవ్వుంది..అమ్మవారి రూపం కూడా చిరుమందహాసంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో ఛేదించలేని రహస్యాలెన్నో. ఏడాదికి ఏడు రోజులు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయం విశిష్టత మీకోసం
Mystery Behind The Hasanamba Temple: కర్ణాటక రాష్ట్రంల హాసన్ నగరంలో కొలువైన అమ్మవారు హాసనాంబ. సప్త మాతృకలలో ఈమె ఒకరు. అమ్మవారి ఏడు రూపాలనే సప్తమాతృకలు అంటారు..వారే..బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారీ, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. ఈ ఏడుగురు ఓసారి భూలోక సంచారానికి వచ్చినప్పుడు దక్షిణభారతదేశంగుండూ వెళుతూ హాసన్ పట్టణం అందాలు చూసి ముగ్ధులై అక్కడే కొలువై ఉండాలనుకున్నారు. మహేశ్వరి, కౌమారీ, వైష్ణవి...జమ్ము కశ్మీర్ కాట్రాలో కొలువయ్యారు. హాసన్ నగరంలో కూడా హాసనాంబ ఆలయంలో మూడు చీమల పుట్టలుగా ఉన్నారని చెబుతారు. ఇక ఇంద్రాణి, వారాహి, చాముండి దేవిగెరే హోండాలో ఉన్న మూడు బావుల్లో కొలువుండగా...బ్రాహ్మీ మాత్రం హాసన్ నగరంలోనే ప్రతిష్టితమైంది. అందుకే ఈ అమ్మవారిని హాసనాంబ అని పిలుస్తారు.
Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!
ఏడాదికి 12 రోజులు దర్శనం
హాసనాంబ ఆలయంలో ప్రధాన గోపురం ద్రావిడ శైలిలో నిర్మించారు. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించేందుకు వచ్చిన ముగ్గురు దొంగలు మూడు రాళ్లుగా మారిపోయారని చెబుతారు...ఆలయంలో ఈ రాళ్లు చూడొచ్చు. ఇక్కడ అమ్మవారికి ఎన్నో మహిమలున్నాంటారు భక్తులు. ఏటా ఆశ్వయుజమాసం చివర్లో ఏడు రోజుల పాటు ఆలయాన్ని తెరుస్తారు. అంటే దీపావళికి ఆరు రోజుల ముందు ఈ ఆలయాన్ని తెరిచి ప్రత్యేకపూజలు చేసి భక్తులను అనుమతించి...దీపావళి జరిగిన మర్నాడు..కార్తీకమాసం మొదటి రోజు అయిన బలిపాడ్యమి రోజు మూసివేస్తారు. డిప్యూటీ కమిషనర్ సమక్షంలో కానీ స్థానిక మంత్రి ఆధ్వర్యంలో కానీ ఆలయాన్ని 12 రోజుల పాటూ తెరిచి ప్రత్యేకపూజలు చేస్తారు. ఈ సమయంలో భక్తుల తాకిడిని నియంత్రించేందుకు దాదాపు 1200 మంది పోలీసులు బందోబస్తు ఉంటుంది.
ఇప్పటికీ వీడని మిస్టరీ
ఒక్కో దేవాలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. చాలా ఆలయాల్లో వీడని చిక్కుముడులెన్నో. శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసినా అంతుచిక్కని రహస్యాలెన్నో. హాసనాంబ దేవాలయంలోనూ అలాంటి ఛేదించలేని రహస్యాలెన్నో ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు తన భక్తులను ఎవరైనా హింసిస్తే వెంటనే ఉగ్రరూపంలో మారిపోతుంది. దీనికి వెనుక చరిత్ర ఏంటంటే.. హాసనాంబ భక్తులను హాసనాంబ అత్తగారు హింసించేదని ఆమెని రాయిగా మారిపోమని అమ్మవారు శపించిందంటారు. అందుకు నిదర్శనంగా అక్కడ బండరాయిలా మారిపోయిన అత్తగారు రాయిని చూపిస్తారు. అంతేకాదు ఏటా ఈ రాయి గర్భాలయంలో బియ్యపుగింజంత పరిమాణంలో కదులుతూ ఉంటుంది. ఈ రెండు రాళ్లు ఓ దగ్గరికి చేరితే యుగాంతమే అని స్థానిక కథనం. అయితే ఇంతకీ రాళ్లు ఎలా కదులుతాయంటూ ఎన్నో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఆ విషయాన్ని ఛేదించలేకపోయారు.
Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!
ఏడాదైనా ప్రసాదం వేడిగానే ఉంటుంది
హాసనాంబ ఆలయం ఏడాదికి పన్నెండు రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. అలా తెరుచుకున్న ఆలయంలో అమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటీపడతారు. తిరిగి ఆలయాన్ని మూసివేసే రోజు వెలిగించిన దీపం ఏడాది తర్వాత ఆలయాన్ని తిరిగి తెరిచే వరకూ అలాగే వెలుగుతూనే ఉంటుంది. అమ్మవారి దగ్గర ఉంచిన పూలు కూడా తాజాదనం కోల్పోకుండా అలానే ఉంటాయి. మరో విశేషం ఏంటంటే.. అమ్మవారికి నివేదించిన అన్నప్రసాదం వేడి చల్లారకుండా, రుచి మారకుండా ఏడాది తర్వాత కూడా అలానే ఉంటుంది. ఏటా ఆలయాన్ని మూసివేసే ముందు రెండు బస్తాల బియ్యం, నీళ్లు, పూలు, అన్నప్రసాదం నివేదించి తలుపులు మూసివేస్తారు.
ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు కానీ ఇందుకు సంబంధించిన ఆధారాలేవీ లేవు. ఈ ఆలయం బెంగళూరు నుంచి దాదాపు 185 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.