Kalki 2898 AD Movie Review: అశ్వత్థామ శాపం , ఎగిరే గుర్రం ప్లేస్ లో కారు, చిలుక స్థానంలో బుజ్జి..మొత్తం సేమ్ టు సేమ్ దించేసిన నాగ్ అశ్విన్!
Kalki 2898 AD Movie Review: ప్రభాస్ కల్కి 2898 AD మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీలో మొదటి సీన్ నుంచి క్లైమాక్స్ వరకూ సేమ్ టు సేమ్ పురాణ కథను దింపేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్
Kalki 2898 AD Movie Review: కల్కి 2898 AD మూవీ స్టోరీ రాసేందుకు ఐదేళ్లు పట్టిందన్న నాగ్ అశ్విన్.. భాగవత పురాణంలో వ్యాసమహర్షి రాసిన కల్కి స్టోరీని తీసుకుని ట్రెండ్ కి తగ్గట్టు మార్చాడని అర్థమవుతోంది. ఉత్తర గర్భంపై అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రంతో సినిమా ప్రారంభమవుతుంది. ఎగిరే కారు, బుజ్జి వరకూ అన్నీ పురాణకథనుంచి తీసుకున్నవే...
కురుక్షేత్రంలో జరిగిన సన్నివేశంతో కథ మొదలు
ఉప పాండవులను చంపిన తర్వాత అశ్వత్థామ పాండవుల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చిప్పుడు బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగిస్తాడు. వెంటనే అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించినా..శ్రీ కృష్ణుడు చెప్పడంతో ఆ అస్త్రాన్ని వెనక్కుతీసుకుంటాడు. అశ్వత్థామ మాత్రం ఆ అస్త్రాన్ని దారి మళ్లించి ఉత్తర గర్భంపై ప్రయోగిస్తాడు. పాండవుల వంశాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉత్తర గర్భంవైపు మళ్లిస్తాడు అశ్వత్థామ. కానీ ఆ కుట్రను తెలుసుకున్న శ్రీ కృష్ణుడు..పరీక్షితుడిని కాపాడతాడు. అశ్వత్థామ కుటిల బుద్ధిచూసి అప్పుడు శాపం ఇస్తాడు. ఈ సన్నివేశంతోనే కల్కి మూవీ స్టోరీ మొదలైంది.
Also Read: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!
ఎగిరే గుర్రం - చిలుక స్థానంలో ఎగిరే కారు - బుజ్జి
శ్రీ మహావిష్ణువు దశావతారంలో భాగంగా కల్కిగా శంబలలో విష్ణు యశుడు - సుమతి దంపతులకు జన్మించాడు ( కల్కి 2898 AD మూవీలో దీపిక పేరు సుమతి) సప్త చిరంజీవులంతా వచ్చి బాలుడిని దీవించి కల్కిగా నామకరణం చేస్తారు. ఆ తర్వాత విద్యాభ్యాసం కోసం బయలుదేరిన కల్కికి పరశురాముడు సకల విద్యలు నేర్పించి... కల్కిగా అవతరించడం వెనుకున్న ఆంతర్యం బోధించాడు. అప్పటికి తానెవరో తెలుసుకున్న కల్కి.. పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు ప్రత్యక్షమైన శివపార్వతులు.. కల్కికి తెల్లటి ఎగిరే గుర్రం, భూ భారాన్ని తగ్గించేందుకు భారమైన ఖడ్గం, సర్వజ్ఞుడు అనే మాట్లాడే చిలుకను ప్రసాదించారు. ధర్మసంస్థాపనలో ఇవే కీలకం.. ఇప్పుడు ప్రభాస్ కల్కి 2898 AD సినిమాలోనూ నాగ్ అశ్విన్ సేమ్ టు సేమ్ ఫాలో అయ్యాడని అర్థమవుతోంది. కల్కికి పరమేశ్వరుడు ప్రసాదించిన తెల్లటి ఎగిరే గుర్రం స్థానంలో...కల్కి సినిమాలో భైరవ కోసం ఎగిరే కారు తయారు చేయించాడు నాగ్ అశ్విన్. ఈ కారు కోసం నాగ్ దాదాపు 4 కోట్లు ఖర్చుచేశాడు. మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్‌తో పాటు కోయంబత్తూరులోని ఆటో ఇంజినీరింగ్ నిపుణులు ఈ కారు రూపొందించారు. ఇక పలుకులు పలికే బుజ్జిని... సర్వజ్ఞుడు అనే చిలుక స్థానంలో తీసుకొచ్చాడు. పురాణాల్లో కల్కిని ధర్మసంస్థాపన దిశగా నడిపించడంతో చిలుకదే ప్రధాన పాత్ర. కల్కిగా జన్మించిన విష్ణువును..పద్మావతిగా జన్మించిన లక్ష్మీదేవిని ఒక్కటి చేసింది , వివాహం జరిగేలా చేసింది ఈ చిలుకే. కల్కి-పద్మావతి వివాహం జరిగిన తర్వాత ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. తండ్రి ఈ భూమిని పాలిస్తే చూడాలని ఉందన్న పుత్రుల కోర్కె మేరకు కల్కి తెల్లటి ఎగిరే గుర్రం సహాయంతో ధర్మసంస్థాపన ప్రారంభించాడు. పరశురాముడు కల్కికి యుద్ధవిద్యలు నేర్పిస్తే..కల్కి సైన్యానికి అశ్వత్థామ యుద్ధవిద్యలు నేర్పించే బాధ్యత తీసుకున్నాడు. మాహిష్మతి రాజ్యంతో మొదలైన కల్కి దండయాత్ర...కలిని తరిమికొట్టేవరకూ సాగింది.
కలి సృష్టించిన అరాచక ప్రపంచమే కాంప్లెక్స్
కల్కి 2898 ఏడీ స్టోరీ మొత్తం 3 ప్రపంచాల మధ్య సాగుతుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముందే క్లారిటీ ఇచ్చేయడంతో ప్రేక్షకులకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. భూమ్మీద మనిషి జీవించేందుకు ఎలాంటి వనరులు ఉండవు... ఆహారం, నీరు కోసం అల్లాడిపోతుంటారు. ఇలాంటి సమయంలో కాంప్లెక్స్ ప్రస్తావన మొదలైంది. ఆ కొత్త కాంప్లెక్స్ మరేదో కాదు...కలి సృష్టించిన అరాచక నగరం అదే సినిమాలో చూపించిన సుప్రీమ్ యాస్కిన్ కాంప్లెక్స్. భూమి మొత్తం నిర్జీవంగా మారిపోయి..కల్కి జననం తర్వాత మాత్రమే హిమాలయాల్లో ఉన్న శంబల నగరం మనుగడలోకి వచ్చింది. అప్పటివరకూ అది మాయా నగరంగానే ఉంటుంది. నాగ్ అశ్విన్ చూపించిన కథ ప్రకారం కల్కిని గర్భంలో మోస్తున్న సుమతిగా నటించిన దీపికను కాపాడేది శంబలవాసులే...అంటే కల్కి జననం శంబలలోనే అని క్లారిటీ ఇచ్చినట్టే...
Also Read: కలి మళ్లీ ఎప్పుడొస్తాడు.. కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా!
అసలు కథ ముందుంది
ఓవరాల్ గా కల్కి కథపై ఐదేళ్లు రీసెర్చ్ చేశానని చెప్పిన నాగ్ అశ్విన్..పురాణాల్లో కల్కి జననం నుంచి కలిని తరిమికొట్టేవరకూ జరిగిన ప్రతి సంఘటననూ అద్భుతంగా రాసుకోవడమే కాదు..విజువల్ వండర్ గా చిత్రీకరించాడని ప్రేక్షకుల రియాక్షన్ చూస్తుంటే అర్థమవుతోంది. అయితే ఈ సినిమాలో మూడు ప్రపంచాలని పరిచయం చేయడంపైన, అశ్వత్థామ శాపం, ద్వాపరయుగంలో అధర్మంవైపు నిలిచిన కర్ణుడు కలియుగంలో మళ్లీ జన్మించి ధర్మ సంస్థాపనకు సహకరించాడంటూ భైరవను చూపించారు. ఈ మూవీ మొత్తం క్యారెక్టర్స్ ని పరిచయం చేసిన నాగ్ అశ్విన్ అసలు కథను సీక్వెల్లో చూపించబోతున్నాడు. ఓవరాల్ గా చెప్పాలంటే కురుక్షేత్ర సంగ్రామంతో మొదలైన కల్కి 2898 AD స్టోరీ కలియుగాంతం వరకూ ఉండబోతోందన్నమాట.
Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!