Janmashtami 2025: జన్మాష్టమి రోజు అర్థరాత్రి 12 గంటలకు దోసకాయ ఎందుకు కోస్తారు? దీనివెనుకున్న ఆసక్తికర విషయం ఏంటి?
janmashtami Secret of Cutting Cucumbers: శ్రీ కృష్ణ జన్మాష్టమి రాత్రి 12 గంటలకు దోసకాయను ఎందుకు కోస్తారు రహస్యం ఏంటి? దీని లేకుండా జన్మాష్టమి పూజ అసంపూర్ణం శాస్త్రాల్లో ఎందుకు చెబుతారు?

Janmashtami 2025: ప్రతి సంవత్సరం, దేశవ్యాప్తంగా శ్రీకృష్ణుడి జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, ఈ వేడుక ఆగస్టు 16 న వచ్చింది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుడిని విధివిధానంగా పూజిస్తారు. అయితే అర్ధరాత్రి సమయంలో దోసకాయతో ఒక ప్రత్యేక ఆచారం నిర్వహిస్తారు, ఇది లేకుండా జన్మాష్టమి పూజ అసంపూర్ణంగా పరిగణిస్తారు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
జన్మాష్టమి రాత్రి 12 గంటలకు దోసకాయను ఎందుకు కోస్తారు?
శ్రీకృష్ణుడి భక్తులకు కృష్మాష్టమి చాలా ముఖ్యమైన రోజు. జన్మాష్టమి రోజున, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో ప్రతి ఇంట్లో , ఆలయంలో శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఈ రోజున బాలకృష్ణుడికి 56 రకాల వంటలను సమర్పిస్తారు. పురాణాల ప్రకారం, కృష్ణ జన్మాష్టమి అర్ధరాత్రి సమయంలో దోసకాయను కోసే ఆచారం ఉంది. అయితే రాత్రి 12 గంటలకు దోసకాయను ఎందుకు కోస్తారో తెలుసుకుందాం.
మతపరమైన నమ్మకాల ప్రకారం, దోసకాయ గర్భానికి సంబంధించినది. జన్మాష్టమి పూజలో దోసకాయను దేవకి గర్భానికి చిహ్నంగా భావిస్తారట. దోసకాయను కోయడం ద్వారా, దోసకాయ నుంచి బాలకృష్ణుడు జన్మించినట్లుగా ఒక సాంకేతిక దృశ్యం. జన్మాష్టమి ఉదయం, బాలకృష్ణుడి విగ్రహాన్ని కాడతో ఉన్న దోసకాయలో ఉంచుతారు, ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో, కాడతో సహా దోసకాయను కోసి బాలకృష్ణుడికి ఆహ్వానం పలుకుతారు.
దోసకాయ కాడను బొడ్డు తాడుగా భావిస్తారు. దానిని కోసి కృష్ణుడిని దేవకి గర్భం నుంచి వేరు చేసే ప్రక్రియ పూర్తవుతుంది. ఇలా చేయడానికి ఒక నమ్మకం ఉంది, అదేంటంటే.. బిడ్డ పుట్టినప్పుడు తల్లి నుంచి వేరు చేసినప్పుడు బొడ్డు తాడును ఎలా కోస్తారో, అదే విధంగా దోసకాయను కోయడం ద్వారా శ్రీకృష్ణుడి జననం జరుగుతుంది. దోసకాయ నుంచి కృష్ణుడు జన్మించిన వెంటనే, శంఖం ఊది శ్రీకృష్ణుడిని స్వాగతిస్తారు. తర్వాత గోపాలుడిని పూజిస్తారు.
కృష్ణుడు దోసకాయల నుంచి జన్మించాడని ఉత్తర భారతదేశంలోని భక్తుల నమ్మకం. అందుకే పూజలో కాడతో కూడిన కీరదోసకాయ ఉంచి ఆ తర్వాత నాణెంతో కాడను కోసి కీరదోసను వేరు చేస్తారు. అనంతరం శంఖం ఊది శ్రీ కృష్ణుడికి ఆహ్వానం పలికుతారు. అదే కీరదోసను కట్ చేసి కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ పూర్తైన తర్వాత ఈ కీరదోస ముక్కల్ని అందరకీ ప్రసాదంగా పంచుతారు. గర్భిణులు కీరదోసను ప్రసాదంగా తీసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. కృష్ణాష్టమి రోజు కీరదోస ప్రసాదం తీసుకుంటే సంతానం ఆయురారోగ్యాలతో ఉంటారని విశ్వాసం.
ఆధ్యాత్మికపరంగానే కాదు ఆరోగ్యానికి కూడా కీరదోస చాలా మంచిది. కీరదోసలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల చలువ చేస్తుంది. డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారికి మంచి ఆహారం.ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కీరదోసలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కీరదోసలో క్యాన్సర్ ను నివారించే లక్షణాలున్నాయని తేలింది. నిద్రలేమి సమస్యకు కూడా కీరదోస చెక్ పెట్టేస్తుంది.
గమనిక: మతవిశ్వాసాలు, భక్తుల నమ్మకాల ఆధారంగా సేకరించి అందించిన వివరాలు ఇవి. ఆధ్యాత్మిక గ్రంధాలు, పండితుల నుంచి సేకరించి అందించిన సమాచారం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.






















