Navaratri Day 5: నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారం - పూజా విధానం, నైవేద్యం వివరాలు ఇవే!
Shardiya Navratri 2025: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 26న ఐదో రోజు శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తోంది ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ...ఈ అలంకారం విశిష్టత ఇదే..

Sri Maha Lakshmi Devi: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. రోజుకో అలంకారంలో అనుగ్రహించే దుర్గమ్మ...బాలా త్రిపురసుందరి, గాయత్రిదేవి, అన్నపూర్ణ, శ్రీ కాత్యాయనీ దేవిగా దర్శనమిచ్చింది. ఉత్సవాల్లో ఐదో రోజైన సెప్టెబర్ 26 మహాలక్ష్మిగా దర్శనమిస్తోంది.
ఈరోజు అమ్మవారిని గులాబీరంగు వస్త్రంతో అలంకరిస్తారు
బెల్లంతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు
కలువ పూలతో పూజిస్తే కార్యసిద్ధి కలుగుతుంది
ధనం, ధాన్యం, ధైర్యం, విజయం, విద్య, సౌభాగ్యం, సంతానం, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో దర్శనమిస్తుంది. ఈ అలంకారాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. మంగళప్రదమైన మహా లక్ష్మీ.. మూడు శక్తుల్లో ఒకటి. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించిందన అమ్మవారు శక్తిత్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఆశించిన ఫలితాలు త్వరగా అందుతాయని భక్తుల విశ్వాసం.
యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా
అన్ని జీవాల్లోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవే అని చండీ సప్తసతి చెబుతోంది.
శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో శ్రీ మహాలక్ష్మిని గులాబీరంగు వస్త్రంతో అలంకరిస్తారు. పాలసముద్రం నుంచి ఉద్భవించినందుకు ప్రతీకగా తెల్లటి కలువలతో పూజిస్తారు. తెల్లటి కలువపూలు దొరక్కపోతే తెల్లటి పూలు వేటితోనైనా పూజించవచ్చు. అమ్మవారికి క్షీరాన్నం ప్రీతికరం. అందుకే పరమాన్నం చేసి నివేదించాలి. లేదంటే అటుకులు, బెల్లం,కొబ్బరిని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈరోజు చేసే దానధర్మాలకు రెట్టింపు ఫలితాన్ని అందిస్తుందట మహాలక్ష్మీదేవి.
అమ్మవారి పూజ ఏదైనా కానీ శ్రీ సూక్తం విధానంలో చేస్తారు. షోడసోపచార పూజ చేయేలనివారు శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన అష్టోత్తరం, శ్రీసూక్తం, కనకధారాస్తవం చదువుకున్నా చాలు..
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేందర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరిసిజాం వందే ముకుంద ప్రియాం
శ్రీ లక్ష్మాష్టక స్తోత్రం
ఇంద్ర ఉవాచ –
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ||
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ||
సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ||
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ||
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ||
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ||
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ||
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ||
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||
[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్]
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించనవి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















