అన్వేషించండి

Mauni Amavasya 2025 : మౌని అమావాస్య 2025 - ప్రాముఖ్యత, చేయాల్సిన పరిహారాలు - పూజా విధానం , శుభ ముహూర్తం

Mauni Amavasya 2025 : హిందూ మతంలో మౌని అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం, ఇతరులకు దానం చేయడం మంచిదని భావిస్తుంటారు.

Mauni Amavasya 2025 : హిందూ క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసంలోని అమావాస్యను మౌని అమావాస్య అంటారు. మౌని అంటే నిశ్శబ్దం. కాబట్టి ఈ రోజున మౌనం పాటించడం, ఉపవాసం ఉండడం ద్వారా మానసిక, ఆధ్యాత్మిక బలాన్ని పొందుతారని చెబుతారు. ఈ రోజున నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించడం, దానం చేయడం వల్ల చేసిన పాపాలు తొలగిపోయి, మోక్షం ప్రాప్తిస్తుందని అనేక మంది విశ్వసిస్తుంటారు. అందులోనూ ఈ రోజు గంగా నది (Ganga River)లో చేసే స్నానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో (Triveni Sangam) స్నానాలాచరించేందుకు వెళ్తుంటారు. సూర్య భగవానుడు, పూర్వీకులను పూజించేందుకు ఇది ఉత్తమమైన రోజు. ఈ ఏడాది ఇది జనవరి 29వ తేదీన రాబోతోంది.

మౌని అమావాస్య తిథి

హిందూ విశ్వాసాల ప్రకారం, మాఘ మాస అమావాస్య తిథి జనవరి 28వ తేదీ రాత్రి 7.32 గంటలకు ప్రారంభమై జనవరి 29న సా.6.05 గంటలకు ముగుస్తుంది.

శుభ ముహూర్తం

మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తం జనవరి 29వ తేదీన ఉ. 5.25 గంటలకు ఆరంభమై 6.18 గంటల వరకు ఉంటుంది. 

మౌని అమావాస్య ప్రాముఖ్యత

మౌని అమావాస్య నాడు గంగా నదిలో స్నానం చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజున గంగా జలం అమృతంలా మారుతుందని చెబుతారు. మను మహర్షి మాఘమాసంలో వచ్చే అమావాస్య రోజున జన్నించాడని, అందుకే ఈ తేదీని మౌని అమావాస్య అని పిలుస్తారని నమ్ముతుంటారు. ఈ రోజు మౌనం పాటిస్తే వారు తమ జీవితంలో విజయం సాధిస్తారని అనేక మంది విశ్వసిస్తుంటారు.

మౌని అమావాస్య - పూజా విధానం

మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మేల్కోవడం ఫలప్రదంగా చెబుతారు. ఈ రోజున వీలైతే గంగా నదిలో స్నానం చేయాలి. అది సాధ్యం కాని యెడల స్నానం చేసే నీళ్లలో గంగా జలం కలిపి స్నానం చేయొచ్చు. ఆ తర్వాత లోకానేలే శ్రీ మహా విష్ణువును ధ్యానించి, ఉపవాసం ఉండాలి. అనంతరం ఇంట్లో లేదా దగ్గర్లోని తులసి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత మీ తాహత మేరకు పేదలకు ఆహారం, డబ్బు, బట్టలు లేదా ఇంకేదైనా దానం చేయండి.

ఈ పరిహారాలతో మౌని అమావాస్యను జరుపుకోండి

  • తమ పూర్వీకుల అనుగ్రహం పొందాలనుకునే వారు ఈ రోజున పసుపు పంగు దుస్తులు ధరించి తమ పెద్దలను స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల వారి ఆత్మ శాంతించి, ఆశీర్వచనాలు అందిస్తారని నమ్ముతుంటారు.
  • ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపు కలిపిన నీళ్లను చిలకరించి, ఇంటి తలుపును కూడా నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందంటారు.
  • ఈ రోజున మహా విష్ణువుతో పాటు తులసి చెట్టును కూడా అత్యంత భక్తి, శ్రద్దలతో పూజించాలి, ధ్యానించాలి.

Also Read : Types of Salt : ఉప్పుల్లోని రకాలు.. వాటి ఉపయోగాలు.. దేనిని వాడితే వంటకు రుచి పెరుగుతుందో తెలుసా?

 
 

 

 

టాప్ హెడ్ లైన్స్

13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
Solar Eclipse 2026: మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
Solar Eclipse 2026: సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
ఆగష్టు 12న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
Pisces Half Year Horoscope: మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget