Gemstone: ఈ రాశి వారు ఆ రంగు రత్నాన్ని ధరిస్తే డబ్బే డబ్బు!
Diamond: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు రంగు రాళ్ళను ధరిస్తే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
మనలో చాలా మంది డబ్బును ఎలా సంపాదించాలి.. వచ్చిన ధనాన్ని ఎలా ఆదా చేయాలా అని ఆలోచిస్తుంటారు. దీని కోసం అనేక రకాల ప్రయోగాలు చేస్తారు. అయినా ఏ మాత్రం కూడా లాభం ఉండదు. అలాంటి సమస్యలకి జ్యోతిష్య శాస్త్రంలో పరిష్కారం ఉంది. అదేంటో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రహం మేష రాశికి అధిపతిగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా, ఎంతో శక్తివంతమైన రాశి అని నిపుణులు అంటున్నారు. మేష రాశి వారు తమ లక్ష్యాలను సాధించేందుకు శ్రమిస్తారు. అంతే కాకుండా ఇది కొన్నిసార్లు చిన్న సమస్యల ద్వారా ప్రభావితమవుతుంది. అయితే, రత్న శాస్త్రం ప్రకారం, నగలు ధరించడం వల్ల ఇటువంటి సమస్యలను నివారించవచ్చు. అలాగే కొంత వరకు ఉపశమనం పొందుతారు. అయితే ఏ రత్నాన్ని ధరిస్తే.. ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో ఇక్కడ చూద్దాం..
వజ్రం:
ఖరీదైన రత్నంలో ఇది కూడా ఒకటి. ఈ రత్నము శుక్రగ్రహానికి ప్రతీక. శుక్ర గ్రహ దోషం ఉన్న వారు బంగారంతో ఎడమచేతికి ధరించవచ్చు. మేష రాశి వారు వజ్రాన్ని ధరించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో పాటు సృజనాత్మకత కూడా పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దీనిని ధరించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు సులభంగా తొలగిపోతాయని కూడా నమ్ముతారు.
మేషరాశి వారు ఈ రత్నాలను ధరించాలి
రత్నాల శాస్త్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, మేషరాశి వారు ఆక్వామారిన్ స్టోన్స్, బ్లడ్ స్టోన్స్‌తో పాటు పుష్యరాగం ధరిస్తే.. వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది పసుపురంగులో మెరిసే ఒక రత్నం. ఇది గురుగ్రహానికి ప్రతీకగా చెబుతారు. గురు గ్రహ దోషాలున్నవారు ఈ రత్నాన్ని ధరిస్తే చాలా వరకు నియంత్రించబడుతుంది. అంతేకాదు ఈ రత్నాలను ధరించడం వల్ల జాతకంలో అంగారకుడి స్థానం కూడా బలపడుతుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా మేష రాశి వారు చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు. మీ పనులకు అడ్డంకులు వచ్చినా.. వాటిని దాటుకుని ముందుకు వెళ్తారు.
మేషరాశి స్త్రీలు తప్పనిసరిగా ధరించాల్సిన ఆభరణాలు
ఈ రాశి గల స్త్రీలు వజ్రం ధరించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. వీరు పుష్యరాగం, నీలమణి ధరించడం చాలా మంచిదట. దీన్ని ధరించడం ద్వారా, మీరు కోరుకున్న కోరికలను సులభంగా తీర్చుకోవచ్చు. క్లిష్టమైన పనులను కూడా మీరు ఒక్కరే చేసుకోగలరు. అలాగే ఎప్పటి నుంచో చేయాలనుకున్న పనులను, మీ కుటుంబ సహకారంతో పూర్తి చేస్తారు.
మేషం అదృష్ట రత్నం
మేషరాశి వారికి పగడపు రాళ్లను ధరించడం ఎంతో మేలు చేస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అదే సమయంలో, అడ్డంకులు కూడా తొలగిపోతాయి. జీవితంలో ఊహించని విజయాలు ఉంటాయి. సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఇది సముద్రంలో దొరుకుతుంది. అంగారక గ్రహ ప్రీతికరమైన పగడాన్ని దండగా కానీ, ఉంగరం రూపంలో గానీ ధరించవచ్చు. వెండి అయినా సరిపోతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
Also Read: మీరు పెళ్లిచేసుకునేముందు ఇవన్నీ ఆలోచించారా - పెళ్లి గురించి చాణక్యుడు చెప్పిన ఆసక్తికర విషయాలివే!