By: ABP Desam | Updated at : 20 May 2022 07:11 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 మే 20 శుక్రవారం రాశిఫలాలు
మేషం
మీ మనసు ఆనందంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి మంచి సమయం. తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు.కుటుంబంలో ఒక ముఖ్యమైన అంశం చర్చకు రావొచ్చు. తెలియని అడ్డంకిని అధిగమిస్తారు.
వృషభం
ఒక పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది.పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. ఎవరినీ పూర్తిగా నమ్మకూడదు. ఒక కేసు విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారంలో అభివృద్ధి వల్ల మీ మనోబలం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి.
మిథునం
మీ జీవిత భాగస్వామిని మోసం చేయకండి. అవసరం అయితేనే ప్రయాణం చేయండి. ఇతరుల మాటల మధ్యలోకి వెళ్లొద్దు. బాధ్యతను నిర్వర్తించడంలో అలసత్వం వద్దు. పాత స్నేహితులతో కొన్ని విషయాలపై డిస్కస్ చేస్తారు. సాహిత్, కళా రంగానికి సంబంధించిన వ్యక్తులు నిరాశకు గురవుతారు.ఎవరితోనైనా వివాదం జరిగే అవకాశం ఉంది.
Also Read: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం
కర్కాటకం
కుటుంబ వ్యవహారాలను పూర్తి చేయడంలో వెనుకాడరు. ఆఫీసులో సమర్థతను ప్రదర్శిస్తారు.వ్యాపారంలో అస్థిరత దూరమవుతుంది. కుటుంబ సంబంధాల్లో సామరస్యం అద్భుతంగా ఉంటుంది. ఇతరుల సమస్యల్లో మిమ్మల్ని మీరు జోక్యం చేసుకోకండి. ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి.
సింహం
నిలిచిపోయిన పాత పనులను పూర్తి చేయడం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు.ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ రోజు అద్భుతమైనది. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు తొలగిపోతాయి, కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
కన్యా
వ్యాపార సంబంధిత లావాదేవీల్లో అవకతవకల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు అవగాహన పెంచుకోవాలి. విద్యార్థులు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. మీరు కొన్ని పనులు పూర్తి చేయడంలో గందరగోళానికి గురవుతారు.
తులా
ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. మీ సమస్యలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు.రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. మీ సంపద పెరుగుతుంది.
వృశ్చికం
మీరు కార్యాలయంలో కొత్త అవకాశాలను పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. దానధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వృద్ధుల అనుభవంతో ప్రయోజనం పొందుతారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపగలుగుతారు.
Also Read: 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!
ధనుస్సు
సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ గౌరవం పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వద్దు. పెట్టుబడికి సంబంధించిన పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు పిల్లల పనితో చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తుల జీతాలు పెరగుతాయి.రిస్క్ తీసుకోకండి.
మకరం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఉత్తమ రచనలకు బహుమతులు పొందుతారు. మీరు మీ లోపాలపై నియంత్రణ పొందడానికి ప్రయత్నిస్తారు. మంచి వ్యక్తులతో పరిచయం మీకు కలిసొస్తుంది. మీ సంపద పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇదే మంచి సమయం.
కుంభం
ఈరోజు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మిమ్మల్ని మీరు క్రమశిక్షణతో ఉంచుకోండి. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. అధికారులతో ఎక్కువగా వాగ్వాదానికి దిగొద్దు. అనియంత్రిత ఆహారం కారణంగా కడుపు నొప్పితో ఇబ్బంది పడతారు. మీ ఆస్తుల రక్షణకోసం తగిన భద్రతా ఏర్పాట్లు చేయండి.టెన్షన్ తగ్గుతుంది.
మీనం
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఈ రోజు మీకు ఆహ్లాదకరమైన రోజు అని రుజువవుతుంది. అనవసర చర్చల్లో పాల్గొనవద్దు.వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. మీరు ప్రేమ సంబంధాలను పూర్తిగా ఆనందిస్తారు. సృజనాత్మకంగా పనిచేస్తారు. టూర్ వెళ్లేందుకు ప్లాన్ వేసుకుంటారు.
Horoscope 6th July 2022: ఈ రాశులవారి దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది , జులై 6 బుధవారం రాశిఫలాలు
Panchang 6th July 2022: జులై 6 బుధవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వివస్వత సప్తమి సందర్భంగా సూర్య ధ్యానం
Jagannath Temple: దేవుడికి దహన సంస్కారాలు, ఈ ఆలయంలో విగ్రహాలను దహనం చేసేస్తారు, మళ్లీ ఇలా ప్రాణం పోసుకుంటాయ్!
Kumar Sashti 2022 : కుజ దోష, నాగ దోషం, సంతాన లేమి నివారణకోసం కుమారషష్టి రోజు ఇలా చేయండి!
Ashada Masam 2022: ఆషాఢం మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా ఉంచుతారు!
Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు
Twitter Moves Court : ప్రభుత్వం చెప్పినట్లు చేయలేం - కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ పిటిషన్ !
IND vs ENG 5th Test: బాజ్ బాలా? అదేంటో తెలియదంటున్న రాహుల్ ద్రవిడ్
Shaitan Web Series: ఓటీటీ కోసం 'యాత్ర' దర్శకుడి వెబ్ సిరీస్ - 'సైతాన్'