By: ABP Desam | Updated at : 03 May 2022 05:33 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 మే 3 మంగళవారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మీకు మంచి రోజు. ఓ శుభవార్త వింటారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. నిరుద్యోగులు ఇంటర్యూల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి మాటలకు విలువ ఇవ్వండి. ప్రేమికులు తమ మనసులో మాట తెలిపేందుకు ఇదే మంచి సమయం. ఇంటి బాధ్యతలు నిర్వహిస్తారు.
వృషభం
అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఈ రోజు మీరు మీతో బిజీగా ఉంటారు. ఓ శుభవార్త వినడం కోసం ఎదురుచూస్తుంటారు. వ్యాపారంలో అద్భుతమైన పురోగతి ఉంటుంది. కార్యాలయంలో ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు.
మిథునం
విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. అప్పులు చేయకండి. కార్యాలయంలో మీ ఆధిపత్యం తగ్గుతుంది. కొన్ని ప్రతికూల వార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది.
Also Read: మీ రాశి ప్రకారం 'మే' నెలలో మీకు శుభాన్ని, అశుభాన్ని ఇచ్చే తేదీలివే
కర్కాటకం
కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. పిల్లల వృత్తికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. పాత మిత్రులను కలుసుకోవడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.విలువైన వస్తువుల భద్రత విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.
సింహం
ఎక్కువ పని కారణంగా తొందరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఈ రోజు సానుకూలంగా ఉంటారు. వ్యాపారులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో జఠిలమైన వ్యవహారాలను పరిష్కరిస్తారు. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు.
కన్యా
ఈ రోజు మీరు మానసిక గందరగోళంలో ఉంటారు. ఎక్కువ ఖర్చు చేస్తారు. పిల్లలు ఎదుర్కొనే సమస్యలు తొలగిపోతాయి. ఇతరుల బాధ్యతలను కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు అన్ని పనులు మీరు అనుకున్న విధంగానే జరుగుతాయి. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి జీతం పెరగుతుంది.
తులా
ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. మిమ్మల్ని ఉపయోగించుకుని వేరేవ్యక్తులు ప్రయోజనం పొందుతారు. మీ వ్యక్తిత్వంతో అందర్నీ ఆకట్టుకుంటారు. మహిళలు తమ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి. కార్యాలయంలో ఆకస్మిక మార్పు ఉంటాయి. మీ పనిని మీరు ఎంజాయ్ చేస్తారు.
Also Read: హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి, పఠిస్తే కష్టాలెందుకు తీరుతాయి
వృశ్చికం
గతంలో మీరు పడిన కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు అందుకుంటారు. ప్రయాణాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారంలో కొత్త సహచరులను చేర్చుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఎలాంటి చర్చల్లో అయినా మీదే ఆధిపత్యం. ఉద్యోగులు, విద్యార్థులకు అనుకూల సమయం.
ధనుస్సు
ఈ రాశి వారు అధిక ఖర్చులను నివారించాలి. ఆధ్యాత్మిక చర్చలు మీ దృక్పథాన్ని మార్చుతాయి. హైపర్ టెన్షన్ రోగులు కోపం తెచ్చుకోకుండా ఉండాలి. ఈ రోజు మీ వ్యాపారం సాధారణంగా కొనసాగుతుంది. ఇతరుల విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు.
మకరం
విద్యారంగంతో అనుబంధం ఉన్న వారికి చాలా మంచి రోజు. మీరు కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. ప్రభుత్వ పనుల్లో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. ఫ్యూచర్ ప్రణాళికలు వేసుకుంటారు. ప్రేమికులు వివాహం దిశగా అడుగేయవచ్చు.
కుంభం
అధికారుల తీరు పట్ల అసంతృప్తికి లోనవుతారు.మీ ఆర్థిక స్థితి పెరుగుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండండి. ఈ రోజు మీ పని మరియు బాధ్యతల నుంచి తప్పించుకోవాలి అనుకోవద్దు. శారీరక, మానసిక శక్తిలో స్వల్ప తగ్గుదల ఉంటుంది. అర్థం లేని విషయాలపై ఒత్తిడి పెంచుకోవద్దు. పెద్దల అనుభవాల వల్ల ప్రయోజనం పొందుతారు.
మీనం
ఈ రోజు పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఎవరికీ సలహా ఇవ్వకండి. మీరు ప్రభావవంతమైన వ్యక్తి నుంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. మీ ప్రయత్నాలు మిమ్మల్ని మరో మెట్టు ఎక్కిస్తాయి. మీ సలహాతో ప్రయోజనం పొందేవారి సంఖ్య పెరుగుతుంది. సానుకూలంగా ఆలోచించండి. అవివాహితులు వివాహం గురించి ఆందోళన చెందుతారు.
Also Read: పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయ్ అంటారు కదా, ఆ పాతకాలు ఏంటో తెలుసా
Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు
Horoscope Today 20th May 2022: ఈ రాశివారికి పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Today Panchang 20 th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం
Gyanvapi Mosque Row: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం
Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి
TTD Darshan Tickets For July, August : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం
Breaking News Live Updates : దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు హైకోర్టుకు బదిలీ, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్
CM KCR Appriciates Nikat Zareen : విశ్వ విజేతగా నిలిచిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్, సీఎం కేసీఆర్ హర్షం