Horoscope Today 5th April 2022: ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 ఏప్రిల్ 5 మంగళవారం రాశిఫలాలు
మేషం
మీరు మీ పనిలో అజాగ్రత్తగా ఉండకూడదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. కొత్త పరిచయాల నుంచి ప్రయోజనం పొందుతారు. లావాదేవీల విషయంలో జాగ్రత్తలేకుంటే నష్టపోతారు. మీరు తల్లిదండ్రుల విషయాల్లో గొప్ప విజయాన్ని పొందుతారు. కార్యాలయంలో శుభవార్త వింటారు.
వృషభం
రాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. మీ విజయాలను అంతా అభినందిస్తారు.ఉద్యోగులు ప్రమోషన్ సంబంధిత సమాచారం అందుకుంటారు. మీ మాటలు ఇతరులపై సానుకూల ప్రభావం చూపుతాయి.వైవాహిక సంబంధాలలో సామరస్యం అద్భుతంగా ఉంటుంది.
మిథునం
ఈ రోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొంతమంది మిమ్మల్ని ఎగతాళి చేస్తారు...అలాంటి వారితో అనవసర చర్చలు వద్దు. శారీరకంగా బలహీనంగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. దంపతులు సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో గందరగోళం ఉండొచ్చు. పెద్దల సలహాలు పాటించండి.
Also Read: శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మీ రాశిఫలితం, కందాయ ఫలం ఇక్కడ తెలుసుకోండి
కర్కాటకం
ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఆధ్యాత్మికతకు సంబంధించిన వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. కార్యాలయంలో సానుకూల మార్పులు సంభవించవచ్చు. ఆస్తికి సంబంధించిన ఒప్పందం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది.
సింహం
ఒకరి మాటలవల్ల బాధపడతారు. మీ ఆలోచనలతో రాజీ పడకండి.ఎవరినీ దుర్భాషలాడొద్దు.ఓ శుభవార్త వింటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. రిస్క్ తీసుకుంటేనే కొన్ని పనులు పూర్తవుతాయి. విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం వద్దు. విద్యార్థులకు ప్రయోజనం పొందుతారు.
కన్యా
పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. అధికారులు మీ ప్రవర్తనను మెచ్చుకుంటారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. సంతోషంగా ఉంటారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. తల్లిదండ్రుల దీవెనలు మీపై ఉంటాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
తుల
వ్యాపారులకు నష్టాలొచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉపాధ్యాయుల సహాయం అందుతుంది. ఉద్యోగం మారే ఆలోచన చేస్తారు. శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడతారు. మీకు ఏ పని చేయాలని అనిపించదు. మీ మాటల మీద సంయమనం పాటించండి. ఈరోజు పాత మిత్రులను కలుస్తారు. పిల్లలతో గడుపుతారు.
వృశ్చికం
వివాహేతర సంబంధాల పట్ల జాగ్రత్త వహించండి.చదువులో కొన్ని ప్రయోగాలు చేయవచ్చు. మీరు మీ ప్రియమైన వారి నుంచి ప్రేమ, గౌరవాన్ని పొందుతారు. పాత స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
Also Read: శుభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలావారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే అంతా శూన్యమే
ధనుస్సు
ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీ ఆచరణాత్మక లక్షణాలు ప్రశంసలందుకుంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో లాభాన్ని పొందుతారు. మీరు సత్సంగం యొక్క ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు పొందుతారు. మీ ఆలోచనలను ఇతరులపై రుద్దకండి. ఉద్యోగంలో వస్తున్న సమస్యలు తొలగిపోతాయి.
మకరం
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఎవరితోనూ కోపంగా మాట్లాడొద్దు. తలపెట్టిన కొన్ని పనులు నిలిచిపోతాయి. ప్రేమికులు వివాహప్రతిపాదనలు దిశగా అడుగేయవచ్చు. కొత్త పనులకు ప్రణాళిక వేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కుంభం
తెలియని అడ్డంకి వల్ల మీ పనులు నిలిచిపోతాయి. కొత్తగా ప్రారంభించే పనివిషయంలో గందరగోళానికి గురవుతారు.ఉద్యోగం గురించి ఆందోళన చెందుతారు. ఇంటి పనులను పూర్తి చేయగలుగుతారు.వినోద సాధనాల కోసం ఖర్చు చేస్తారు. వ్యాపారంలో పెద్ద మార్పు రావొచ్చు. ప్రేమికుల మధ్య వాగ్వాదం జరుగుతుంది.
మీనం
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. పోటీపరీక్షలు రాసేవారు విజయం సాధిస్తారు. అధికారులు మీ పని పట్ల చాలా సంతోషిస్తారు. జీవిత భాగస్వామితో గొడవపడొద్దు. ఎవరికీ సలహా ఇవ్వకండి.