Horoscope Today 24 January 2022: ఈ నాలుగు రాశులవారు ఈ రోజు సంతోషంగా ఉంటారు.. మీరున్నారా ఇందులో మీ రాశి ఫలితం తెలుసుకోండి...
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
2022 జనవరి 24 సోమవారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మీతో పాటూ మీ చుట్టూ ఉన్నవారంతా సంతోషంగా ఉంటారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు. ఉద్యోగులు ఇతరులపై ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోండి. మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం
వివాహితులైన వారి బంధం స్థిరంగా ఉంటుంది. మీ నైపుణ్యం మరింత వెలుగుచూస్తుంది. మీ పురోగతితో మీరు సంతృప్తి చెందలేరు..ఇంకా సాధించాలనే తపన ఉంటుంది. ఏ విషయంలోనూ ఎమోషనల్ అవ్వకండి. ఎవరికీ మాటివ్వవద్దు. పని ఒత్తిడి తగ్గుతుంది.
మిథునం
వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే ముందడుగు వేయండి. మీ పనితీరుని మరింత మెరుగుపర్చుకోవడం ద్వారా లాభం ఉంటుంది. కోర్టు కేసుల్లో పురోగతి ఉండదు. విద్యార్థులు చదువులో కష్టపడాల్సి వస్తుంది.
కర్కాటకం
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ లక్ష్యాన్ని చేరుకోవడం సులభం అవుతుంది. మీరు కోరుకున్న విద్యా సంస్థలో ప్రవేశం పొందవచ్చు. ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారి జీతం పెరగవచ్చు. ప్రత్యర్థులు మీకు దూరంగా ఉంటారు.
Also Read: రేవతి మినహా చివరి ఏడు నక్షత్రాల్లో జన్మిస్తే మీరు సూపర్..నక్షత్ర దోషాలు Part-4
సింహం
మీ సమస్య తీరుతుంది. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. ఏదైనా దూరప్రాంత ప్రయాణానికి ప్లాన్ చేసుకోవచ్చు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. బ్యాంక్, ఇన్సూరెన్స్‌కు సంబంధించిన పనిలో మీరు విజయం సాధిస్తారు. పిల్లల సక్సెస్ ని ఎంజాయ్ చేస్తారు.
కన్య
నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కొత్తగా ప్రయత్నిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. మతపరమైన కార్యక్రమాలకు ఈ రోజు చాలా మంచిది. కుటుంబంలో సామరస్యం ఉంటుంది. దంపతులు సంతోషంగా ఉంటారు. టెన్షన్ తగ్గుతుంది.
తుల
ఈరోజు పని ఒత్తిడి పెరుగుతుంది. ఉన్నత విద్యావంతులైన యువత విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. రుణాలు ఇవ్వడం మానుకోండి. ఇంటి అలంకరణలో డబ్బు ఖర్చు చేస్తారు. తలనొప్పి ఉండేవారు ఒత్తిడికి దూరంగా ఉండాలి.
వృశ్చికం
మీరు ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. మీ పనితీరు అధికారులను ఆకట్టుకుంటుంది. సాహిత్య రంగానికి సంబంధించిన వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. వ్యాపార ప్రయాణాలు ప్లాన్ చేస్తారు. పెట్టుబడులు కలిసొస్తాయి. విద్యార్థులకు మంచి సమయం.
Also Read: ఈ నక్షత్రంలో పుడితే మామూలు శాంతి కాదు బాబోయ్...నక్షత్ర దోషాలు Part-3
ధనుస్సు
ఆర్థిక లావాదేవీల్లో నిమగ్నమైన వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు గౌరవం పొందుతారు. వాహనం కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
మకరం
మీరు అనుకున్నది నెరవేరుతుంది. ప్రయాణానికి ప్రణాళికలు వేయొచ్చు. కార్యాలయంలో మీ కష్టాన్ని మరొకరు సొమ్ముచేసుకోవచ్చు జాగ్రత్త. పూర్వీకుల నుంచి వెంటాడుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో సామరస్యం ఉంటుంది. మీరు బాధల నుంచి ఉపశమనం పొందుతారు.
కుంభం
సహోద్యోగుల ప్రవర్తన ఇబ్బందికరంగా ఉంటుంది. అలసిపోయినట్టు ఉంటుంది. వ్యాపారస్తులకు కష్టమర్లతో సంబంధాలు క్షీణిస్తాయి. విద్యార్థులు విజయం సాధించవచ్చు. గుర్తు తెలియని వ్యక్తుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది.
మీనం
మీరు గతంలో తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించగలుగుతారు. జీవిత భాగస్వామి సలహా పాటించండి. మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఈరోజు సంతోషంగా ఉంటారు మీరు మీ బాధ్యతను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. రహస్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-2
Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి