Horoscope Today 9th January 2022: ఈ రోజు ఈ రాశులవారు అన్నీ పాజిటివ్ గా థింక్ చేస్తారు, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మేషం
ఈ రోజు మీరు వ్యాపారానికి సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. కొత్తగా చేపట్టే పనుల్లో కొంత గందరగోళం ఉంటుంది. అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ ప్రత్యర్థులు మీకు హాని కలిగించవచ్చు. మీ మాటల మీద సంయమనం పాటించండి.
వృషభం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. స్నేహితుడిని కలుస్తారు. వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు జరగొచ్చు. విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకు ఇష్టమైన వంటకాలను ఆస్వాదించండి. బంధువులు మీ ఇంటికి రావొచ్చు. మీరు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు.
మిథునం
ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. పిల్లల సక్సెస్ ని ఎంజాయ్ చేస్తారు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకండి. అత్తమామల వైపు నుంచి మంచి సమాచారం అందుతుంది. మీరు కుటుంబం, వ్యాపారం, వృత్తిని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆలోచించి ఖర్చు చేయండి.
Also Read: మీ సరదా సరే..దయచేసి భోగి మంటల్లో ఇవి మాత్రం వేయకండి..
కర్కాటకం
చాలా కాలం తర్వాత పాత మిత్రులను కలుస్తారు. మీ కుటుంబంతో కొత్త ప్రాజెక్ట్ గురించి చర్చిస్తారు. వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. నిలిచిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. ఒకరి మాటలు విని మీ ప్రియమైన వారిని అనుమానించకండి.
సింహం
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కొన్ని పనుల్లో అజాగ్రత్త వల్ల భారీ నష్టాలు ఎదురవుతాయి. లావాదేవీ పత్రాలను జాగ్రత్తగా చదవండి. విద్యార్థులు తమ కెరీర్‌లో కొంత గందరగోళానికి గురవుతారు. బంధువుల నుంచి విచారకరమైన వార్తలు అందుతాయి.
కన్య
ఆఫీసులో సహోద్యోగుల సహాయం అందుతుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంటికి బంధువులు రావొచ్చు. మీరు మతపరమైన యాత్రకు వెళ్ళవచ్చు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉంటాయి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Also Read: భోగి మంటలెందుకు, భోగి పళ్లెందుకు.. ఎందుకు చేయాలి ఇవన్నీ..
తుల
కార్యాలయంలో సవాళ్లు ఎదురవుతాయి. మీ ప్రవర్తనతో ఆకట్టుకుంటారు. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రణాళికలు వేసుకోవచ్చు. ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి.
వృశ్చికం
ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. తెలియని వ్యక్తులను నమ్మవద్దు. ఆర్థిక పరిస్థితిలో మార్పు ఉంటుంది. ప్రతి విషయంలో సానుకూలంగా ఆలోచిస్తారు. చాలా కాలం తర్వాత స్నేహితుడిని కలుస్తారు. టెన్షన్ తగ్గుతుంది. .
ధనుస్సు
ఇతరులకు సహాయం చేస్తారు. ఎవరైనా మిమ్మల్ని నిందిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలతో విభేదించవచ్చు. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
మకరరాశి
మీ ప్రణాళికలను బహిర్గతం చేయడానికి తొందరపడకండి. తద్వారా నష్టపోతారు, విమర్శలపాలవుతారు. మానసిక గందరగోళం అలాగే ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. వ్యాపార సంబంధిత ఒప్పందాలు పూర్తవుతాయి. ఒత్తిడికి లోనవుతారు. మీ ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
కుంభం
మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని అభినందిస్తారు. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. కార్యాలయంలో అంతా మంచే జరుగుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతికూలంగా ఆలోచించే ధోరణిని వదులుకోండి. రిస్క్ తీసుకోకండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. శుభవార్త వింటారు.
మీనం
సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. మీ వల్ల మీ స్నేహితుడి పెద్ద సమస్య తీరుతుంది. పెట్టుబడి ఆఫర్లను పొందుతారు. చాలా రోజులుగా నిలిచిపోయిన మొత్తం చేతికందుతుంది. కఠినంగా మాట్లాడకండి. పిల్లలతో సమయం గడపడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామికి బహుమతులు ఇవ్వొచ్చు.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
Also Read: వారంలో ఈ రోజు తలస్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు, ఆపదలు తప్పవట…
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
Also Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి