Horoscope Today 7th January 2022: ఈ రాశివారు జీవిత భాగస్వామిపట్ల గౌరవంగా వ్యవహరించాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
జనవరి 7 శుక్రవారం రాశి ఫలితాలు
మేషం
కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. చేపట్టిన ప్రణాళికలు విజయవంతం అవుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యకు అవకాశాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది.
వృషభం
ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసుల నుంచి విముక్తి పొందుతారు. వ్యాపారంలో భాగస్వామ్యానికి అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామి పట్ల గౌరవంగా వ్యవహరించండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
మిథునం
ఆధ్యాత్మిక వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడుతుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. వైవాహిక బంధంలో అపార్థాలు తొలగిపోతాయి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. కొత్త పనుల చేపట్టాలనే ఉత్సాహంగా ఉంటారు. ఇతరులకు సహాయం చేస్తారు.
Also Read: శని ప్రభావంతో బాధపడుతున్నారా.. అయితే మంగళవారం,శనివారం ఇలా చేయండి..
కర్కాటకం
వ్యాపారంలో నష్టపోతారు. కొత్త ఉద్యోగం అనే ఆలోచనే వద్దు. ఇంటి వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. దీర్ఘకాలిన వ్యాధులతో బాధపడుతున్న వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అనవసర సలహాలు ఇవ్వొద్దు. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థుల బాధలు తొలగిపోతాయి.
సింహం
వ్యాపారంలో బాధ్యతలు అనుకున్న సమయం కన్నా ముందే పూర్తిచేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. అత్తింటి వారినుంచి శుభవార్త అందుతుంది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
కన్య
ఈరోజు మీ మనసులో సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. పని చేసే ప్రదేశంలో కొత్త వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగస్తులు సహోద్యోగుల ప్రవర్తనతో ఇబ్బంది పడతారు. మీరు మీ లక్ష్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. కారణం లేకుండా ఖర్చు చేయవద్దు.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
తుల
మీ తీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు మొత్తం ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ప్రేమికులు వివాహానికి కుటుంబ సభ్యులను ఒప్పించడంలో విజయం సాధిస్తారు. పూర్వీకుల నుంచి పరిష్కారం కాని కొన్ని విషయాల్లో ఒక పరిష్కారం ఉంటుంది. మీడియాతో అనుబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
వృశ్చికం
ఈ రోజు గొంతు సమస్యతో బాధపడతారు, ఆఫీసులో పెద్దగా పని లేకపోయినా కష్టపడాల్సి వస్తుంది. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందడం కష్టమవుతుంది. మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించండి. ఇంటి పెద్దలు సంతోషంగా ఉంటారు. ఒత్తిడికి లోనవుతారు.
ధనుస్సు
ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారు. పిల్లల అవసరాలను జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగస్తులకు కలిసొచ్చే రోజు. కుటుంబ సభ్యుల అంచనాలను అందుకుంటారు. యువత ఉద్యోగాలు పొందవచ్చు. బాధల నుంచి విముక్తి ఉంటుంది.శత్రువులు ప్రశాంతంగా ఉంటారు.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
మకరం
ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పనులతో సంబంధం ఉన్న వ్యక్తులు సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధిత విషయాల్లోనూ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఈరోజు ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు అనవసరమైన సమస్యల్లో చిక్కుకుపోవచ్చు. ఒత్తిడికి దూరంగా ఉండండి. వివాదం వచ్చే అవకాశం ఉంది.
కుంభం
వ్యాపారంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. అనవసరమైన ఖర్చులను నియంత్రించగలుగుతారు. మీ పని నాణ్యత మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులకు ఇది శుభసమయం. స్నేహితులను కలుస్తారు.
మీనం
ఇంటికి అతిథులు రావచ్చు. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగులకు బాధ్యత పెరుగుతుంది. వ్యాపారులకు సాధారణ ఫలితాలున్నాయి. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ఈ రోజంతా కాస్త గందరగోళంగా ఉంటుంది.
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read: ఈ టైప్ లాఫింగ్ బుద్ధ మీ ఇంట్లో ఉంటే.. అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందట
Also Read: గోమాతతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారు, లేకపోతే ఏమవుతుంది..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి